త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | అడ్లూరి గారు.. మీరు రాజీనామా చేయొద్దు.. వీరి బాధ‌లు వినండి చాలు

RS Praveen Kumar | రాష్ట్రంలో అధికార ప్ర‌తిప‌క్షం స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్ల‌తో రాజ‌కీయ వేడి నెల‌కొన్న వేళ ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ మ‌రో ఆస‌క్తికర‌ ట్వీట్ చేశారు. మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ రాజీనామా చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని.. తాము డిబేట్‌కు కూడా ర‌మ్మ‌ని అడ‌గ‌మ‌న్నారు. ద‌య‌చేసి వీరి మొర ఆల‌కించాల‌ని.. రాష్ట్రమంతా ఇలాంటి ప‌రిస్థితే ఉంద‌ని ఓ విద్యార్థి తండ్రి ఆవేద‌ను త‌న ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.

S

Telangana | Published On Jul 3, 2026, 4.38 pm IST

RS Praveen Kumar | అడ్లూరి గారు.. మీరు రాజీనామా చేయొద్దు.. వీరి బాధ‌లు వినండి చాలు
Advertisement
  • ఓ విద్యార్థి తండ్రి ఆవేద‌న‌ను ట్వీట్ చేసిన ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్

త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో అధికార ప్ర‌తిప‌క్షం స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్ల‌తో రాజ‌కీయ వేడి నెల‌కొన్న వేళ ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ మ‌రో ఆస‌క్తికర‌ ట్వీట్ చేశారు. మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ రాజీనామా చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని.. తాము డిబేట్‌కు కూడా ర‌మ్మ‌ని అడ‌గ‌మ‌న్నారు. ద‌య‌చేసి వీరి మొర ఆల‌కించాల‌ని.. రాష్ట్రమంతా ఇలాంటి ప‌రిస్థితే ఉంద‌ని ఓ విద్యార్థి తండ్రి ఆవేద‌ను త‌న ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. అందులో ఏముందంటే..

గుడ్ మార్నింగ్ సార్. నేను మెదక్ నుండి మాట్లాడుతున్నాను. నా పేరు అశోక్ సార్. మా పిల్లలు బెస్ట్ అవైలబుల్ స్కీం కింద సిద్ధార్థ స్కూల్, మెదక్‌లోని గీత స్కూల్లో చదువుతున్నారు. ఈ స్కూల్ యాజమాన్యం ప్రతి విద్యా సంవత్సరం ఆరంభంలో “గవర్నమెంట్ నుండి మాకు హాస్టల్ ఫీజులు రావట్లేద‌ని.. మీ పిల్లల్ని ఇప్పుడే పంపియొద్దని ప్రతిసారి నెల రోజుల పాటు ఇబ్బంది పెడుతున్నారు సార్”. దాదాపు నాలుగేళ్ల‌ నుండి మాకు ఇదే ప్రాబ్లం సార్. ఈసారి స్పెషల్‌గా సిద్ధార్థ స్కూల్ వాళ్లు, మెదక్ గీత స్కూల్ వాళ్లు మాకు పిల్లలు వద్దే వద్దని క‌చ్చితంగా చెబుతున్నారు. దయచేసి మా దగ్గరికి రావద్దు అంటున్నారు.

ప్ర‌జా పాల‌న‌ కదా..

ఈ స‌మ‌స్యపై మెదక్ కలెక్టర్ ఆఫీసులో మేం పలుమార్లు విన్నవించాం. జిల్లా కలెక్టర్‌కు విన‌తిపత్రం కూడా ఇచ్చాం. ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసులోనూ అంద‌జేశాం. 50 మంది పేరెంట్స్ అందరం కలిసి గత 15 రోజుల నుండి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. అయినా దీనికి పరిష్కారం దొరకడం లేదు. (ప్రజా పాలన కదా!) పిల్లల్ని తీసుకోండి.. మేం గవర్నమెంట్‌తో మాట్లాడి మీ ఫీజు తొందరగా ఇప్పించే ప్రయత్నం చేస్తామ‌ని.. మా సైడ్ నుంచి బిల్ అయిపోయిందని వెల్ఫేర్ ఆఫీసు వాళ్లు చెప్పినా స్కూల్ యాజమాన్యం అసలు ఒప్పుకోవట్లేదు సార్.

ఆ వివ‌క్ష‌ మైండ్‌లో ఉండిపోతుంది..

పిల్లల్ని విద్యాసంస్థల ఆరంభంలోనే ఈ విధంగా చేయడంతో పిల్లలకి జాతి వివక్ష అనే విషయం అర్థం అయిపోతుంది. వాళ్ల‌ మెదడులో ఏస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన పిల్లల పరిస్థితి, వాళ్ల భవిష్యత్, చదువుకు పనికిరారు అనే విషయాన్ని వాళ్ల‌ మైండ్‌లో ఉండిపోతుంది. ఎస్సీ సామాజిక వర్గం మీద ఉన్న ఈ వివక్షను తొలిగించి ఎవరైనా సరే ఈ స్కీమ్ మూలంగా చదువుకోవచ్చు అనే ఒక ధైర్యాన్ని ఒక భరోసాను కల్పించే విధంగా గవర్నమెంట్ ముందుకురావాలి.

మాకు సాయం చేయండి సార్‌..

ఈ రెండు స్కూల్లో కలిపి దాదాపు 50 మంది పిల్లలు ఉన్నారు సార్. తూప్రాన్ గీత స్కూల్ వాళ్లు కూడా ఈ పిల్లల్ని జాయిన్ చేసుకున్నారు సార్. ఈ రెండు స్కూల్ యాజమాన్యాల‌తో ఒకసారి మాట్లాడండి. ఈసారి అయితే పిల్లలను తీసుకోండి “గవర్నమెంట్ నుండి మాట్లాడి మిగతా మీకేదైనా అమౌంట్ మేం ఇప్పిస్తాం అని చెప్పండి. ఆ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేలా అడ్మిట్ చేసుకునే విధంగా ఏదైనా మాకు సహాయం చేయండి సార్. ఇకనైనా ఈ పద్ధతిని ప్రవేట్ స్కూల్ యాజమాన్యం మానుకొని పిల్లల్ని సకాలంలో స్కూల్లో జాయిన్ చేసుకొని ఒకవేళ వాళ్ల‌కి హాస్టల్ ప్రాబ్లం అయితే డే స్కాలర్‌గా అయినా సరే చదువు చెప్పడానికి వారు ముందుకు వచ్చేలా మాకు ఏదన్న సాయం చేయండి అంటూ అశోక్‌ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement