Aaya Sher Song | 200 మిలియన్ల వ్యూస్ – యూట్యూబ్‌లో నాని ఆయా షేర్ సాంగ్ రికార్డ్ – దుమ్మురేపుతున్న తెలంగాణ పాట
నాని ప్యారడైజ్‌లోని ఆయా షేర్ లిరికల్ సాంగ్ 200 మిలియన్ల వ్యూస్‌ను చేరుకుంది. టాలీవుడ్ హిస్టరీలో ఇప్పటివరకు కేవలం మూడు లిరికల్ సాంగ్స్ మాత్రమే రెండు వందల మిలియన్ల వ్యూస్‌ను దాటాయి. ఈ ఘనతను సాధించిన నాలుగో పాటగా ఆయా షేర్ నిలిచింది.
Entertainment | Published On Jul 3, 2026, 4.34 pm IST
Aaya Sher Song | నాని ప్యారడైజ్ సినిమాలోని ఆయా షేర్ సాంగ్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఆయా షేర్ తెలుగు లిరికల్ సాంగ్‌కు 200 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. శుక్రవారం నాటితో ఈ మైలురాయిని చేరుకుంది. ఇప్పటివరకు తెలుగులో కేవలం మూడు లిరికల్ సాంగ్స్ మాత్రమే రెండు వందల మిలియన్ల వ్యూస్‌ను దాటాయి. ఈ రికార్డును బ్రేక్ చేసిన నాలుగో పాటగా ఆయా షేర్ లిస్ట్‌లో చేరింది.
చికిరి చికిరి...
హయ్యెస్ట్ వ్యూస్ దక్కించుకున్న తెలుగు సినిమా లిరికల్ సాంగ్స్ లో రామ్‌చరణ్ పెద్ది సినిమాలోని చికిరి సాంగ్ 299 మిలియన్ల వ్యూస్‌తో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఉప్పెన సినిమాలోని నీ కన్ను నీలి సముద్రం (248 మిలియన్ల వ్యూస్), కుర్చీ మడతపెట్టి (212 మిలియన్ల వ్యూస్)తో తర్వాతి ప్లేస్‌లో కొనసాగుతోన్నాయి.ఈ మూడు పాటల తర్వాత 200 మిలియన్ల వ్యూస్‌ను చేరుకున్న నాలుగో సాంగ్‌గా ఆయా షేర్ నిలిచింది.
తెలంగాణ సాహిత్యం...
ఆయా షేర్ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా...అడ్డుల జంగిరెడ్డి, అర్జున్ చాందీ ఈ పాటను ఆలపించారు. తెలంగాణ సాహిత్యంతో ఊర మాస్‌గా సాగిన ఈ పాట రిలీజై మూడు నెలలు అవుతోన్న ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంది.
జడల్‌గా...
పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ప్యారడైజ్ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాని జడల్ అనే క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం చాలా మేకోవర్ అయ్యారు. కయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోండగా...సీనియర్ నటుడు మోహన్‌బాబు విలన్ పాత్ర చేస్తున్నారు. రాఘవ్ జుయాల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
రిలీజ్ వాయిదా....
నాని ప్యారడైజ్ మూవీని తొలుత మార్చి 26న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ డిలే వల్ల ఆగస్ట్ 21కి వాయిదాపడింది. ఆ డేట్‌కు కూడా సినిమా రావడం అనుమానమేనని ప్రచారం జరుగుతోంది. హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తోన్న రెండో మూవీ ఇది. గతంలో వీరిద్దరు కలిసి దసరా సినిమా చేశారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లోనే రూపొందిన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rukmini Vasanth | క్రేజీ కాంబో సెట్ – నితిన్‌కు జోడీగా డ్రాగన్ బ్యూటీ – ప్రొడ్యూసర్‌గా హీరో నాని
జులై 11, 2026

Sreeleela | యూట్యూబ్‌లో చరిత్రను సృష్టించిన మహేష్‌బాబు ,శ్రీలీల తెలుగు సాంగ్ – 800 మిలియన్ల వ్యూస్‌తో రికార్డ్
జూన్ 29, 2026

Vijay Deverakonda | విజయ్ దేవరకొండ కొత్త మూవీ లాంఛ్ – చీఫ్ గెస్ట్‌గా నాని – ఫొటోలు వైరల్
ఏప్రిల్ 20, 2026
తాజావార్తలు
- ●Ramcharan | పుకార్లకు పుల్‌స్టాప్ - రామ్‌చరణ్ , సుకుమార్ మూవీ జానర్ ఇదే - రిలీజ్ ఎప్పుడంటే?
- ●MP Vaddiraju | తెలంగాణను ఆదుకోండి.. కేంద్రానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విజ్ఞప్తి
- ●IPS Molest | నేషనల్ పోలీసు అకాడమీలో ట్రైనీ ఐపీఎస్‌కు లైంగిక వేధింపులు
- ●Harish Rao | రైతుల కోపాగ్నిలో మాడి మసైపోతావ్ రేవంత్ : హరీశ్‌రావు
- ●MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి
- ●Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్

Ramcharan | పుకార్లకు పుల్‌స్టాప్ - రామ్‌చరణ్ , సుకుమార్ మూవీ జానర్ ఇదే - రిలీజ్ ఎప్పుడంటే?

MP Vaddiraju | తెలంగాణను ఆదుకోండి.. కేంద్రానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విజ్ఞప్తి

IPS Molest | నేషనల్ పోలీసు అకాడమీలో ట్రైనీ ఐపీఎస్‌కు లైంగిక వేధింపులు

Harish Rao | రైతుల కోపాగ్నిలో మాడి మసైపోతావ్ రేవంత్ : హరీశ్‌రావు



