Bus Plunged Into Ditch | లోయలో పడిన బస్సు.. 40 మంది మృతి
Bus Plunged Into Ditch | పాకిస్థాన్ (Pakistan)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది (Bus Plunged Into Ditch). ఈ దుర్ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు.
International | Published On Jul 3, 2026, 2.23 pm IST
Bus Plunged Into Ditch | పాకిస్థాన్ (Pakistan)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది (Bus Plunged Into Ditch). ఈ దుర్ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
బస్సు క్వెట్టా నుంచి ఇస్లామాబాద్ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో బలూచిస్థాన్-ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్సు (Khyber Pakhtunkhwa provinces) సరిహద్దుకు సమీపంలోని మారుమూల ప్రాంతమైన దానా సార్ వద్దకురాగానే బస్సు నియంత్రణ కోల్పోయి లోయలోకి పడిపోయిందని బలూచ్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రింద్ తెలిపారు. మార్గం మధ్యలో బ్రేక్ డౌన్ అయిన బస్సులోని ప్రయాణికులను కూడా ఇందులో ఎక్కించారని తెలిపారు. దీంతో ఓవర్‌లోడ్ కారణంగా బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయినట్లు వివరించారు. ఇక ఈ ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Also Read..
సీఎం విజయ్-త్రిషను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్
డివైడర్‌ను ఢీకొట్టిన ఎల్‌పీజీ ట్యాంకర్.. గ్యాస్ లీకై భారీ పేలుడు.. ఐదుగురు మృతి.. షాకింగ్ వీడియో
మిరాకిల్.. 8 రోజులుగా 140 టన్నుల శిథిలాల కిందే.. 100 గంటల ఆపరేషన్ తర్వాత సజీవంగా బయటకు
తాజావార్తలు
- ●CM Revanth Reddy | తెలంగాణ రైజింగ్ 2047 అడ్డుకోవడం రాజకీయ వివక్షే : సీఎం రేవంత్రెడ్డి
- ●Singireddy Niranjan Reddy | పంటలు వేయొద్దు.. కొనొద్దు.. బోనస్ ఇవ్వొద్దు
- ●CM Revanth Reddy | ఇది తెలంగాణకు జరిగిన అవమానం.. ముక్తకంఠంతో ఖండించాలని సీఎం రేవంత్ పిలుపు
- ●Bank Strike | బ్యాంకులు బంద్.. నాలుగు రోజుల సమ్మె.. ఎప్పుడంటే..
- ●Arvind Dharmapuri | సీఎం తమ్ముడు చెప్పిండని.. నాపైన ఏసీపీతో నిఘా పెట్టించిండ్రు
- ●CM Revanth Reddy | ఆ రాజకీయ కారణం ఏంటో మోదీయే చెప్పాలి : రేవంత్రెడ్డి

CM Revanth Reddy | తెలంగాణ రైజింగ్ 2047 అడ్డుకోవడం రాజకీయ వివక్షే : సీఎం రేవంత్రెడ్డి

Singireddy Niranjan Reddy | పంటలు వేయొద్దు.. కొనొద్దు.. బోనస్ ఇవ్వొద్దు

CM Revanth Reddy | ఇది తెలంగాణకు జరిగిన అవమానం.. ముక్తకంఠంతో ఖండించాలని సీఎం రేవంత్ పిలుపు

Bank Strike | బ్యాంకులు బంద్.. నాలుగు రోజుల సమ్మె.. ఎప్పుడంటే..






