Bhagyashri Borse | రిజెక్ట్ చేసిన సినిమాలోనే హీరోయిన్‌గా నటించా – భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్
అఖిల్ అక్కినేని లెనిన్ మూవీని భాగ్యశ్రీ బోర్సే రిజెక్ట్ చేసిందట. డేట్స్ అడ్జెస్ట్ కావడం కష్టంగా మారడంతో ఈ సినిమాను మిస్ చేసుకుందట. కానీ అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ తన వద్దకే ఈ సినిమా ఆఫర్ వచ్చిందని చెప్పింది. లెనిన్ ప్రమోషన్స్‌లో భాగ్యశ్రీ చేసిన కామెంట్లు వైరల్ అవుతోన్నాయి.
Entertainment | Published On Jul 3, 2026, 2.53 pm IST
Bhagyashri Borse | హీరోహీరోయిన్ల భవితవ్యం విజయాలపైనే ఆధారపడి ఉంటుంది. ఎంత బ్యాక్‌గ్రౌండ్, యాక్టింగ్ టాలెంట్ ఉన్నా సక్సెస్ లేకపోతే ఇండస్ట్రీలో రాణించడం కష్టమే. అఖిల్ అక్కినేనితో భాగ్యశ్రీ బోర్సే ఇద్దరు ఓ మంచి విజయం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. వీరిద్దరు జంటగా నటించిన లెనిన్ మూవీ జూలై 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా రిజల్ట్ అటు అఖిల్‌తో పాటు ఇటు భాగ్యశ్రీ ఇద్దరికి కీలకంగా మారింది. లెనిన్‌తో కెరీర్‌లో ఫస్ట్ హిట్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని ఆశపడుతోన్నారు.
రిజెక్ట్ చేశా...
లెనిన్ మూవీలో భారతి అనే రాయలసీమ యువతిగా భాగ్యశ్రీ బోర్సే కనిపించబోతుంది. ట్రెడిషనల్ రోల్ చేస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్న భాగ్యశ్రీ బోర్సే ఓ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ బయటపెట్టింది. తొలుత లెనిన్ సినిమాను రిజెక్ట్ చేసిందట. కానీ అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ తన వద్దకే ఈ ఆఫర్ వచ్చిందని అన్నది. తొలుత భారతి పాత్ర కోసం దర్శకుడు.... భాగ్యశ్రీ బోర్సేను అప్రోచ్ అయ్యాడట. ఆ టైమ్‌లో కాంతతో పాటు ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ డేట్స్ అడ్జెస్ట్ చేయలేక లెనిన్ మూవీని రిజెక్ట్ చేసిందట.
శ్రీలీల...
భాగ్యశ్రీ బోర్సే కాదనడంతో మేకర్స్ హీరోయిన్‌గా శ్రీలీలను ఎంపికచేశారు. లుక్ టెస్ట్‌తో పాటు కొన్ని సీన్లు షూట్ చేశారు. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా శ్రీలీల అర్థాంతరంగా ఈ సినిమా నుంచి తప్పుకుంది.
దాంతో మరోసారి భాగ్యశ్రీ వద్దకే ఈ ఆఫర్ చేరిందట. రెండో సారి కథ వినగానే వెంటనే ఓకే చెప్పిసిందట. ఒకే సినిమాలో రెండు సార్లు హీరోయిన్‌గా తనకు ఛాన్స్ వచ్చిందంటూ భాగ్యశ్రీ బోర్సే లెనిన్ ప్రమోషన్స్‌లో చెప్పింది. రిజెక్ట్ చేసిన సినిమాలోనే హీరోయిన్‌గా నటించానని అన్నది.
చిత్తూరు యాస...
లెనిన్ కోసం చిత్తూరు యాసను నేర్చుకొని సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పిందట. చిత్తూరు యాస కోసం స్పెషల్‌గా ఓ ట్రైనర్‌ను పెట్టుకొని శిక్షణ కూడా తీసుకునట్లు భాగ్యశ్రీ బోర్సే చెప్పింది.
లెనిన్ మూవీకి మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వం వహించారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీతో కలిసి హీరో నాగార్జున ఈ సినిమాను నిర్మించారు. మే నెలలోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు డిలే కావడంతో వాయిదావేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bhagyashri Borse | అప్పుడు గెస్ట్ రోల్…ఇప్పుడు హీరోయిన్ – బాలీవుడ్ వయలెంట్ లవ్‌స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే?
ఆగస్టు 20, 2026

Bandla Ganesh Daughter Wedding | ఘనంగా బండ్ల గణేష్ కూతురు వివాహం – టాలీవుడ్ స్టార్స్ సందడి
ఆగస్టు 16, 2026

George Krish | శర్వానంద్ జార్జ్ క్రిష్ షురూ – ఓపెనింగ్ రోజే రిలీజ్ డేట్ చెప్పేశారుగా!
ఆగస్టు 14, 2026
తాజావార్తలు
- ●H1N1 | హెచ్1ఎన్1పై ఆందోళన వద్దు.. ఐసీఎంఆర్ క్లారిటీ..!
- ●Bollywood | తమన్నాతో టీవీ నటుడి ఎంగేజ్మెంట్ - ఫొటోలు వైరల్
- ●OBC Leaders Support Konda Surekha | కాంగ్రెస్‌లో ముదురుతున్న 'కొండా' ఎపిసోడ్: సురేఖకు ఓబీసీ సంఘం అండ.. అధిష్ఠానం తీరుపై ఫైర్!
- ●Tirumala | తిరుమల శ్రీవారికి విశేష అభిషేకం.. ఘనంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు
- ●Vakiti Srihari | సురేఖ, వాకిటియే కాదు.. ఎవరైనా పార్టీ తర్వాతే
- ●G Jgadeesh Reddy | కాంగ్రెస్, బీజేపీ నాటకం బయటపడింది

H1N1 | హెచ్1ఎన్1పై ఆందోళన వద్దు.. ఐసీఎంఆర్ క్లారిటీ..!

Bollywood | తమన్నాతో టీవీ నటుడి ఎంగేజ్మెంట్ - ఫొటోలు వైరల్

OBC Leaders Support Konda Surekha | కాంగ్రెస్‌లో ముదురుతున్న 'కొండా' ఎపిసోడ్: సురేఖకు ఓబీసీ సంఘం అండ.. అధిష్ఠానం తీరుపై ఫైర్!

Tirumala | తిరుమల శ్రీవారికి విశేష అభిషేకం.. ఘనంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు



