త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Madrasa Teacher | పోక్సో కేసు.. మ‌ద‌ర్సా టీచ‌ర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష‌

Madrasa Teacher | ఓ 11 ఏళ్ల బాలుడిని లైంగిక వేధింపుల‌కు గురి చేసిన మ‌ద‌ర్సా టీచ‌ర్‌కు ప్ర‌త్యేక కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. శిక్ష‌తో పాటు రూ. 10 వేలు జ‌రిమానా విధించింది.

S

Hyderabad | Published On Jul 3, 2026, 4.11 pm IST

Madrasa Teacher | పోక్సో కేసు.. మ‌ద‌ర్సా టీచ‌ర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష‌
Advertisement

Madrasa Teacher | త్రినేత్ర‌.న్యూస్ : ఓ 11 ఏళ్ల బాలుడిని లైంగిక వేధింపుల‌కు గురి చేసిన మ‌ద‌ర్సా టీచ‌ర్‌కు ప్ర‌త్యేక కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. శిక్ష‌తో పాటు రూ. 10 వేలు జ‌రిమానా విధించింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. బాలాపూర్ ప‌రిధిలో మ‌ద‌ర్సా సెంట‌ర్‌లో స‌యీద్ న‌దీమ్(22) అనే వ్య‌క్తి టీచ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. అయితే అక్క‌డ చదువుకుంటున్న 11 ఏళ్ల బాలుడిపై 2022 మార్చి నెల‌లో న‌దీమ్ అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. బాలుడిని లైంగికంగా వేధించాడు. ఈ విష‌యం బ‌య‌ట‌కు చెబితే చంపేస్తాన‌ని బాలుడిని టీచ‌ర్ బెదిరింపుల‌కు గురి చేశాడు. టీచ‌ర్ వేధింపులు తాళ‌లేక బాధిత బాలుడు జ‌రిగిన ఘోరాన్ని కుటుంబ స‌భ్యుల‌కు తెలిపాడు.

దీంతో బాలాపూర్ పోలీసులు కేసు న‌మోదు చేసి చాంద్ర‌య‌ణ‌గుట్ట పీఎస్‌కు బ‌దిలీ చేశారు. అక్క‌డ ఛార్జీషీటు నమోదు చేసి త‌ద‌నంత‌రం బండ్ల‌గూడ పీఎస్‌కు కేసును బ‌దిలీ చేశారు. మొత్తానికి ఈ కేసులో వాద‌న‌లు కొన‌సాగించిన ప్ర‌త్యేక కోర్టు న‌దీమ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష‌తో పాటు రూ. 10 వేలు జ‌రిమానా విధించింది.

Advertisement
Advertisement