TVK Vijay | విజయ్‌ని ఆహ్వానించిన గవర్నర్.. సీఎంగా ఆ ఫైల్‌పైనే తొలిసంతకం..!
TVK Vijay | టీవీకే చీఫ్ విజయ్ (TVK Vijay) నేడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ (Rajendra Vishwanath Arlekar)ను కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటు అంశంపై చర్చించనున్నారు.
TVK Vijay | టీవీకే చీఫ్ విజయ్ (TVK Vijay)కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ (Rajendra Vishwanath Arlekar) నుంచి ఆహ్వానం అందింది. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 సీట్లలో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా.. విజయ్‌కు గవర్నర్ ఆహ్వానం పంపారు. గవర్నర్ ఆహ్వానం మేరకు విజయ్ నేడు ఆయన్ని కలవనున్నారు. ప్రస్తుతం కేరళలో ఉన్న గవర్నర్ ఇవాళ మధ్యాహ్నం చెన్నైకి చేరుకోనున్నారు. సాయంత్రం గవర్నర్‌తో విజయ్ భేటీ కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటు అంశంపై చర్చించనున్నారు.
ఇదిలా ఉండగా.. రేపు విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం "వెట్రి పయణం పథకం" అమలు కోసం తొలి సంతకం చేయనున్నట్లు తెలిసింది. ఈ పథకం మహిళా సాధికారత, వారి భద్రతకు ఉద్దేశించినది. రాష్ట్రంలోని ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయంతోపాటూ ఈ పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందజేస్తామని విజయ్ ప్రకటించారు.
టీవీకేకి అధికారికంగా మద్దతు ప్రకటించిన కాంగ్రెస్
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి కాంగ్రెస్ పార్టీ తన మద్దతు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. మతతత్వ శక్తులను కూటమిగా దూరంగా ఉంచాలని హస్తం పార్టీ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
The President of Tamizhaga Vettri Kazhagam (TVK), C Vijay, has formally requested the Indian National Congress (INC) to extend its support for forming a government in Tamil Nadu... Tamil Nadu Congress Committee and the Congress Legislative Party (CLP) has decided to extend its… pic.twitter.com/6s3hbmGUfI
— ANI (@ANI) May 6, 2026
Also Read..
కాగ్నిజెంట్‌లో 15 వేలమందిపై వేటు.. భారత్‌లోనే అధికం..!
మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే ఏం జరుగుతుంది.. రూల్స్ ఏం చెబుతున్నాయ్..?
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

TVK | రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు.. సీపీఎం హెచ్చరికలతో ప్రచారానికి చెక్‌పెట్టిన టీవీకే
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



