Mamata Banerjee | మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే ఏం జరుగుతుంది.. రూల్స్ ఏం చెబుతున్నాయ్..?
Mamata Banerjee | "మేం ఓడిపోలేదు.. బీజేపీ ప్రజాతీర్పును దొంగిలించింది. నేను రాజ్‌భవన్‌కు వెళ్లను. రాజీనామా చేయను" అంటూ మమతా బెనర్జీ చేసిన ప్రకటనతో బెంగాల్‌లో తర్వాత ఏం జరుగుతుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సీఎం పదవికి దీదీ రిజైన్ చేయకపోయినా రాజ్యాంగపరంగా తదుపరి ప్రక్రియలు ఆగవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. 15 ఏళ్లపాటూ అధికారంలో కొనసాగిన మమతా బెనర్జీ (Mamata Banerjee) నేతృత్వంలోని టీఎంసీ (TMC) తాజా ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. భవానీపూర్‌లో దీదీ కూడా ఓడిపోయారు. అయితే, ఈ ఓటమిని మమత అంగీకరించడంలేదు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీదీ ప్రకటనతో బెంగాల్‌లో తర్వాత ఏం జరుగుతుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఆమె సీఎం పదవికి రిజైన్ చేయకపోయినా (resign as Chief Minister) రాజ్యాంగపరంగా తదుపరి ప్రక్రియలు ఆగవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి కచ్చితంగా రాజీనామా చేయాలని రాజ్యాగంలో ఎక్కడా స్పష్టమైన నిబంధన లేదు. ఓటమి తర్వాత పదవి నుంచి తప్పుకోవడం అనేది శాంతియుత అధికార మార్పిడిలో ఒక భాగం. ఇది సంప్రదాయమే తప్ప నిబంధన కాదు. ఎన్నికల సంఘం ధృవీకరించిన ఫలితాల ద్వారా సభలో మద్దతు లేదని స్పష్టమైతే రాజ్యాంగ సంప్రదాయం ప్రకారం సదరు ముఖ్యమంత్రి స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.
మెజారిటీ నిరూపించుకోవాల్సిందే..
ఒకవేళ ముఖ్యమంత్రి తన పదవిలో కొనసాగాలంటే శాసనసభలో కచ్చితంగా మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే, తాజా ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ కేవలం 80 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. 293 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు 148 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే, ప్రస్తుతం టీఎంసీకి అంతమంది ఎమ్మెల్యేల మద్దతు లేదు.
గవర్నర్ ముందు రెండు ఆప్షన్లు..
దీదీ తన పదవికి రాజీనామా చేయకపోతే.. గవర్నర్‌కు కొన్ని అధికారాలు ఉంటాయి. అందులో రాష్ట్రపతి పాలన కూడా ఒకటి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం.. గవర్నర్ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు. రాష్ట్రపతి పాలన విధిస్తారు. అయితే దీన్ని చివరి ఆప్షన్‌గా మాత్రమే పరిగణిస్తారు. ఇంకో ఆప్షన్ ఏంటంటే.. అసెంబ్లీని ఆటోమేటిక్‌గా రద్దు చేయడం. ఒకవేళ మమత సీఎం పదవికి రాజీనామా చేయకపోతే.. గవర్నర్ అసెంబ్లీని రద్దు చేసే అవకాశమే ఎక్కువగా ఉంటుంది.
అదే సమయంలో టీఎంసీ ప్రభుత్వానికి ఓ ఆప్షన్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. తనకు మెజారిటీ ఉందని దీదీ చేస్తున్న వాదనను అసెంబ్లీలో నిరూపించుకోవాలని గవర్నర్ కోరతారు. ఆమె అలా నిరూపించుకోలేకపోతే.. మెజారిటీ ఉన్న పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తారు. ఇక రేపటితో అంటే మే7తో దీదీ ప్రభుత్వ పాలన కాలం ముగియనుంది. అప్పటిలోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read..
ఏఐఏడీఎంకేలో చీలిక.. టీవీకేవైపు 35 మంది ఎమ్మెల్యేల మొగ్గు
విజయ్‌కి కాంగ్రెస్ మద్దతు.. కండిషన్స్ అప్లై..!
మరోసారి చిక్కుల్లో పలాష్ ముచ్చల్..! స్మృతి చిన్ననాటి ఫ్రెండ్ ఫిర్యాదుతో కేసు నమోదు..!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

N Ramachander Rao | మోదీ నేపథ్యం.. కాంగ్రెస్‌కు ఎప్పుడూ కంటగింపే : ఎన్ రామచందర్ రావు
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



