త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cognizant Layoffs | కాగ్నిజెంట్‌లో 15 వేల‌మందిపై వేటు.. భార‌త్‌లోనే అధికం..!

Cognizant Layoffs | దిగ్గజ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ (Cognizant Technology Solutions).. తమ ఉద్యోగులకు గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఏకంగా 12 వేల నుంచి 15 వేల మంది ఉద్యోగుల‌పై వేటు వేయాల‌ని నిర్ణ‌యించింది.

D

Business | Published On May 6, 2026, 12.34 pm IST

Cognizant Layoffs | కాగ్నిజెంట్‌లో 15 వేల‌మందిపై వేటు.. భార‌త్‌లోనే అధికం..!
Advertisement

Cognizant Layoffs | టెక్‌ రంగంలో అనిశ్చితి కొనసాగుతోంది. కృత్రిమ మేధ (AI) ప్రవేశంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉద్యోగుల భ‌ద్ర‌త ప్ర‌మాదంలో ప‌డింది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ (IT) సెక్టార్‌ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. చిన్న కంపెనీల నుంచి మొదలుకొని దిగ్గజ టెక్ సంస్థల వరకు అన్నీ తమ కార్యకలాపాల్లో ఏఐని భాగం చేస్తూ.. మానవ వనరుల్ని క్రమంగా తగ్గించుకుంటున్నాయి. ఫ‌లితంగా వేలాది మంది టెకీలు త‌మ ఉద్యోగాల‌ను కోల్పోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది.

తాజాగా అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న దిగ్గజ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ (Cognizant Technology Solutions).. తమ ఉద్యోగులకు గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఏకంగా 12 వేల నుంచి 15 వేల మంది ఉద్యోగుల‌పై వేటు వేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు సంబంధిత వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ అంత‌ర్జాతీయ మీడియా నివేదిస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా సంస్థ‌లో ప్ర‌స్తుతం 3,57,000 మంది ఉద్యోగులు ఉన్నారు. భారత్ ప్రధాన కేంద్రంగానే 2,50,000 మంది వరకు పనిచేస్తున్నారు. దీంతో ఈ లేఆఫ్స్ ప్ర‌భావం ఎక్కువ‌గా భార‌త్‌లో ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌పైనే ఉంటుంద‌ని స‌ద‌రు వ‌ర్గాలు తెలిపాయి.

భార‌త్‌లో 13వేల మందిపై ప్ర‌భావం..

భారతదేశంలో కాగ్నిజెంట్ ఉద్యోగుల సగటు వార్షిక వేతనం రూ. 15 లక్షల వరకు ఉంది. ఇక ఉద్యోగ విరమణ పరిహారం దాదాపు 6 నెలల వేతనానికి సమానంగా ఉంటుంది. అంటే ఒక్కో ఉద్యోగికి సగటున రూ. 7.5 లక్షల వరకు ఇవ్వాల్సి వస్తుంది. ఈ లెక్కన భారత్‌లోనే దాదాపు 12 వేల నుంచి 13 వేల మంది వరకు ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు తెలుస్తోంది.

ప్రాజెక్ట్ లీప్..

కాగ్నిజెంట్ ఇటీవల 'ప్రాజెక్ట్ లీప్' (Project Leap) పేరుతో ఒక Transformation Programme ప్రకటించింది. దీని ప్రధాన ఉద్దేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లో పెట్టుబడులు పెంచడం, సంస్థ డిజిటల్ సామర్థ్యాలను బలోపేతం చేయడం, ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచడం (Reskilling).

ఈ ప్రాజెక్ట్ కోసం సంస్థ $230 మిలియన్ల నుంచి $320 మిలియన్ల వరకు (సుమారు రూ.2,680 కోట్లు) ఖర్చు చేయనుంది. ఇందులో ప్యాకేజీలు, ఉద్యోగుల తొలగింపు నష్టపరిహారం కింద 200–270 మిలియన్ డాలర్లు వెచ్చించనుంది. అయితే, ఈ ప్రాజెక్ట్ అమలు ద్వారా ఈ ఏడాది ఏకంగా $300 మిలియన్ల మేర ఆదా అవుతుందని కంపెనీ అంచనా వేస్తోంది.

Also Read..

బెంగాల్ సీఎంగా సువేందు అధికారి..?

మ‌మ‌తా బెన‌ర్జీ రాజీనామా చేయ‌క‌పోతే ఏం జ‌రుగుతుంది.. రూల్స్ ఏం చెబుతున్నాయ్‌..?

ఏఐఏడీఎంకేలో చీలిక‌.. టీవీకేవైపు 35 మంది ఎమ్మెల్యేల మొగ్గు

Advertisement
Advertisement