త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suvendu Adhikari | బెంగాల్ సీఎంగా సువేందు అధికారి..?

Suvendu Adhikari | బెంగాల్ నూత‌న సీఎంగా సువేందు అధికారి బాధ్య‌త‌లు చేప‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌భుత్వ ఏర్పాటుపై చ‌ర్చించేందుకు శుక్ర‌వారం కోల్‌క‌తాలో బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలో సువేందు అధికారిని ఆ పార్టీ శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌గా ఎన్నుకునే అవ‌కాశం ఉంద‌ని సంబంధిత వ‌ర్గాల ద్వారా తెలిసింది.

D

National | Published On May 6, 2026, 12.07 pm IST

Suvendu Adhikari | బెంగాల్ సీఎంగా సువేందు అధికారి..?
Advertisement

Suvendu Adhikari | ప‌శ్చిమ బెంగాల్‌లో ప్ర‌భుత్వ ఏర్పాటుకు బీజేపీ ముమ్మ‌రంగా ఏర్పాట్లు కొన‌సాగిస్తోంది. బెంగాల్ నూత‌న సీఎంగా సువేందు అధికారి (Suvendu Adhikari) బాధ్య‌త‌లు చేప‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌లే జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న విజ‌యం సాధించిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఏర్పాటుపై చ‌ర్చించేందుకు శుక్ర‌వారం కోల్‌క‌తాలో బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశం జ‌ర‌గ‌నుంది.

ఈ స‌మావేశంలో సువేందు అధికారిని ఆ పార్టీ శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌గా ఎన్నుకునే అవ‌కాశం ఉంద‌ని సంబంధిత వ‌ర్గాల ద్వారా తెలిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య.. సువేందు అధికారి పేరును ప్రతిపాదించగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఆయనను శాసనసభా పక్ష నేతగా ప్రకటిస్తారని స‌ద‌రు వ‌ర్గాలు తెలిపాయి. కాగా, తాజా ఎన్నిక‌ల్లో భ‌వానీపూర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌మ‌తా బెన‌ర్జీపై సువేందు అధికారి పోటీ చేశారు. దీదీపై ఘ‌న విజ‌యం సాధించారు. దీదీని సువేందు ఓడించ‌డం ఇది రెండోసారి. దీంతో శాస‌న‌స‌భా ప‌క్ష‌నేత‌గా సువేందును బీజేపీ ఎన్నుకునే అవ‌కాశం ఉంది.

మే 9న బెంగాల్ నూత‌న సీఎం ప్ర‌మాణ స్వీకారం

ప్ర‌తిప‌క్షాల కంచుకోటను బీజేపీ (BJP) బ‌ద్ద‌లు కొట్టింది. 15 ఏళ్ల టీఎంసీ పాలనకు కాషాయ పార్టీ ఘనంగా ముగింపు పలికింది. 294 అసెంబ్లీ స్థానాల‌కు గానూ ఏకంగా 206 స్థానాల్లో జ‌య‌భేరి మోగించి అఖండ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఈ నేప‌థ్యంలో బెంగాల్ రాష్ట్రంలో క‌మ‌లం పార్టీ తొలిసారి ప్ర‌భుత్వ ఏర్పాటుకు (New Bengal govt) సిద్ధ‌మైంది. ఈ మేర‌కు ముహూర్తం కూడా ఖ‌రారు చేసింది. నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్ (Rabindranath Tagore) జ‌యంతిని పురస్కరించుకుని మే 9వ తేదీన కోల్‌క‌తాలో ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు స‌మిక్ భ‌ట్టాచార్య‌ (Samik Bhattacharya) ప్ర‌క‌టించారు. కాగా, ప్ర‌స్తుత టీఎంసీ ప్ర‌భుత్వ ప‌ద‌వీకాలం రేప‌టితో ముగియ‌నున్న విష‌యం తెలిసిందే.

Also Read..

మ‌మ‌తా బెన‌ర్జీ రాజీనామా చేయ‌క‌పోతే ఏం జ‌రుగుతుంది.. రూల్స్ ఏం చెబుతున్నాయ్‌..?

ఏఐఏడీఎంకేలో చీలిక‌.. టీవీకేవైపు 35 మంది ఎమ్మెల్యేల మొగ్గు

విజ‌య్‌కి కాంగ్రెస్ మ‌ద్ద‌తు.. కండిష‌న్స్ అప్లై..!

Advertisement
Advertisement