త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

JCD Prabhakar | తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా జె.సి.డి. ప్రభాకర్ ఎన్నిక‌

JCD Prabhakar | తమిళనాడు రాజకీయ చరిత్రలో మ‌రో కొత్త అధ్యాయం మొదలైంది. తమిళనాడు శాసనసభ స్పీకర్‌గా (Speaker) తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ ఎమ్మెల్యే జేసీడీ ప్ర‌భాక‌ర్ (JCD Prabhakar) ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు.

D

National | Published On May 12, 2026, 5.14 pm IST

JCD Prabhakar | తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా జె.సి.డి. ప్రభాకర్ ఎన్నిక‌
Advertisement

JCD Prabhakar | తమిళనాడు శాసనసభ స్పీకర్‌గా (Speaker) తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ ఎమ్మెల్యే జేసీడీ ప్ర‌భాక‌ర్ (JCD Prabhakar) ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఆయ‌న‌ చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గ‌తంలో AIADMK పార్టీలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. విజ‌య్ (TVK Vijay) నేతృత్వంలోని కొత్త ప్ర‌భుత్వంలో ఆయ‌నకు కీల‌క‌మైన రాజ్యాంగ ప‌ద‌వి వ‌రించింది.

విజ‌య్ తొలిసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డంతో.. అనుభ‌వం ఉన్న నేత‌లు చాలా అవ‌స‌రం. అందుకే కీల‌క‌మైన ప‌ద‌వికి దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాల్లో అనుభ‌వం ఉన్న‌ జె.సి.డి. ప్రభాకర్‌ను ఎన్నుకున్నారు. ప్రభాకర్ ఎన్నికతో పాటు తురైయూర్ ఎమ్మెల్యే ఎం. రవిశంకర్‌ను డిప్యూటీ స్పీకర్‌గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్పీక‌ర్‌గా ఎన్నికైన ప్ర‌భాక‌ర్‌కు సీఎం విజ‌య్, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేతగా ఉన్న ఉద‌య‌నిధి స్టాలిన్‌ శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం స‌భా సంప్ర‌దాయం ప్ర‌కారం ఉద‌య‌నిధి స్టాలిన్‌.. ప్ర‌భాక‌ర్‌ను స్పీక‌ర్ స్థానం వ‌ద్ద‌కు తీసుకెళ్లి కూర్చోబెట్టారు.

జేసీడీ ప్ర‌భాక‌ర్‌కు సుదీర్ఝ రాజ‌కీయ అనుభ‌వం ఉంది. ఎంజీఆర్ కాలం నుంచి ఆయ‌న రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్నారు. 1980లో విల్లివాక్కం నియోజకవర్గం నుంచి ఏఐఏడీఎంకే (AIADMK) ఎమ్మెల్యేగా మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ త‌ర్వాత జ‌య‌ల‌లిత హ‌యాంలో పార్టీ సంస్థాగ‌త నిర్మాణంలో కీల‌క పాత్ర పోషించారు. ఆయ‌న‌కు అన్ని రాజ‌కీయ ప‌క్షాల‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయ‌న సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ప్ర‌స్తుత విజ‌య్ ప్ర‌భుత్వంలో అత్యంత కీల‌కం కానుంది.

Also Read..

ఆంథ్రోపిక్ కు పోటీగా ఓపెన్ఏఐ డే బ్రేక్‌.. సైబ‌ర్ సెక్యూరిటీని ఇచ్చే కొత్త ఏఐ మోడ‌ల్‌..

ప్ర‌ధాని మోదీ పొదుపు వ్యాఖ్య‌ల ఎఫెక్ట్‌.. స్టాక్ మార్కెట్ల‌లో న‌ష్టాలు కంటిన్యూ..

విజ‌య్ క్రేజ్ మాలూలుగా ఉండ‌దు మ‌రి.. 48 గంట‌ల్లోనే ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్స్‌

Advertisement
Advertisement