త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CMO Tamilnadu | విజ‌య్ క్రేజ్ మాలూలుగా ఉండ‌దు మ‌రి.. 48 గంట‌ల్లోనే ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్స్‌

CMO Tamilnadu | విజ‌య్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత తమిళ‌నాడు సీఎంవో (CMO Tamilnadu) సోష‌ల్ మీడియా ఖాతాల‌కు ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్స్ (followers) పెరిగారు. త‌మిళ‌నాడు సీఎంవో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు రెండు రోజుల్లోనే ఏకంగా మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ పెరిగారు.

D

National | Published On May 12, 2026, 10.19 am IST

CMO Tamilnadu | విజ‌య్ క్రేజ్ మాలూలుగా ఉండ‌దు మ‌రి.. 48 గంట‌ల్లోనే ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్స్‌
Advertisement

CMO Tamilnadu | దళపతి విజయ్.. ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా ఇదే పేరు మార్మోగిపోతోంది. ఎందుకంటే ఇటీవ‌లే జ‌రిగిన త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య్ టీవీకే పార్టీ ఊహించ‌ని రీతిలో భారీ మెజారిటీతో విజ‌యం సాధించ‌డ‌మే. సాధార‌ణంగా విజ‌య్‌కి హీరోగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఆయ‌న‌కున్న క్రేజ్ మ‌రింత పెరిగింది. ఎంత‌లా అంటే.. విజ‌య్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత తమిళ‌నాడు సీఎంవో (CMO Tamilnadu) సోష‌ల్ మీడియా ఖాతాల‌కు ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్స్ (followers) పెరిగారు.

త‌మిళ‌నాడు సీఎంవో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు రెండు రోజుల్లోనే ఏకంగా మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ పెరిగారు. గతంలో టీఎన్ సీఎంఓ ఇన్‌స్టా ఖాతాకు సుమారు 4.4 లక్షల మంది మాత్రమే ఫాలోవర్స్ మాత్ర‌మే ఉండేవారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన 48 గంటల్లోనే ఆ సంఖ్య ఏకంగా 14 లక్షలకు చేరింది. అంటే కేవలం రెండు రోజుల్లోనే దాదాపు 10 లక్షల మంది కొత్తగా ఫాలో అయినట్లు తెలుస్తోంది. అటు ఎక్స్ ఖాతాకు కూడా గ‌తంలో 4 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ఉండేవారు. ఇప్పుడు అది 21 ల‌క్ష‌ల‌కు చేరింది. దీన్ని బ‌ట్టే అర్థ‌మ‌వుతోంది విజ‌య్‌కి ఎంత క్రేజ్ ఉందో.

Also Read..

వినేశ్‌-రెజ్లింగ్‌ సమాఖ్య మధ్య ముదురుతున్న వివాదం..! నోటీసులపై స్టార్‌ రెజ్లర్‌ రెస్పాన్స్‌ ఇదే..!

వ‌రుస‌గా నాలుగో సెష‌న్‌లోనూ న‌ష్టాలే.. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా ప‌త‌నం..

తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. పాఠశాలలు, ఆలయాలకు దగ్గరలో మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశాలు..!

Advertisement
Advertisement