Daybreak | ఆంథ్రోపిక్ కు పోటీగా ఓపెన్ఏఐ డే బ్రేక్.. సైబర్ సెక్యూరిటీని ఇచ్చే కొత్త ఏఐ మోడల్..
Daybreak | ఓపెన్ఏఐ సైబర్ సెక్యూరిటీ రంగంలోకి మరింత దూకుడుగా అడుగుపెడుతూ డే బ్రేక్ అనే కొత్త ఏఐ ప్లాట్‌ఫామ్‌ను ప్రకటించింది. సాఫ్ట్‌వేర్‌లో ఉన్న భద్రతా లోపాలను వేగంగా గుర్తించడం, వాటికి ప్యాచ్‌లు రూపొందించడం, సైబర్ దాడులను ముందుగానే అడ్డుకోవడం లక్ష్యంగా ఈ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపింది.
Technology | Published On May 12, 2026, 5.04 pm IST
Daybreak | ఓపెన్ఏఐ సైబర్ సెక్యూరిటీ రంగంలోకి మరింత దూకుడుగా అడుగుపెడుతూ డే బ్రేక్ అనే కొత్త ఏఐ ప్లాట్‌ఫామ్‌ను ప్రకటించింది. సాఫ్ట్‌వేర్‌లో ఉన్న భద్రతా లోపాలను వేగంగా గుర్తించడం, వాటికి ప్యాచ్‌లు రూపొందించడం, సైబర్ దాడులను ముందుగానే అడ్డుకోవడం లక్ష్యంగా ఈ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపింది. డే బ్రేక్ ప్లాట్‌ఫామ్ ఫ్రాంటియర్ ఏఐ ఫర్ సైబర్ డిఫెండర్స్ కాన్సెప్ట్‌పై ఆధారపడి పనిచేస్తుంది. పెద్ద కోడ్‌బేస్‌లను విశ్లేషించడం, సున్నితమైన భద్రతా లోపాలను గుర్తించడం, ఫిక్స్‌లను ధ్రువీకరించడం, అపరిచిత సిస్టమ్‌లను అర్థం చేసుకోవడం వంటి పనులను ఏఐ ద్వారా వేగంగా నిర్వహించవచ్చని కంపెనీ తెలిపింది.
కంటిన్యూస్ సాఫ్ట్ వేర్ సెక్యూరిటీ లక్ష్యం..
ఈ ప్లాట్‌ఫామ్‌లో ఓపెన్ఏఐ జీపీటీ 5.5 మోడళ్లు, కోడెక్స్ సెక్యూరిటీ అనే కోడింగ్-కేంద్రీకృత ఏజెంటిక్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఇవి కలిసి సెక్యూరిటీ టీమ్‌లకు కోడ్ రివ్యూ, థ్రెట్ మోడలింగ్, డిపెండెన్సీ రిస్క్ అనాలిసిస్, ప్యాచ్ వాలిడేషన్, డిటెక్షన్ ఇంజనీరింగ్ వంటి పనుల్లో సహాయం చేస్తాయని కంపెనీ వివరించింది. ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ స్పందిస్తూ ఏఐ ఈజ్ ఆల్‌రెడీ గుడ్ అండ్ అబౌట్ టు గెట్ సూపర్ గుడ్ ఎట్ సైబర్ సెక్యూరిటీ అని పేర్కొన్నారు. సైబర్ భద్రతలో ఏఐ సామర్థ్యాలు వేగంగా పెరుగుతున్నాయని, అందుకే సంస్థలు ముందుగానే రక్షణాత్మక వ్యవస్థలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఓపెన్ఏఐ వెల్లడించిన వివరాల ప్రకారం డే బ్రేక్ ప్రధాన లక్ష్యం కంటిన్యూస్ సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ. అంటే ఒకసారి మాత్రమే స్కాన్ చేయడం కాకుండా, నిరంతరం సాఫ్ట్‌వేర్‌ను పర్యవేక్షిస్తూ కొత్త బలహీనతలను గుర్తించడమన్నమాట. కోడ్ రిపోజిటరీల్లో నేరుగా ప్యాచ్‌లు రూపొందించడం, వాటిని టెస్ట్ చేయడం, ఫిక్స్‌లను ధ్రువీకరించడం కూడా ఈ ప్లాట్‌ఫామ్ చేయగలదని కంపెనీ తెలిపింది.
3 స్థాయిల్లో యాక్సెస్ మోడల్స్..
ఓపెన్ఏఐ ఈ ప్లాట్‌ఫామ్‌లో మూడు స్థాయిల యాక్సెస్ మోడళ్లను ప్రవేశపెట్టింది. సాధారణ జీపీటీ-5.5, ట్రస్టెడ్ యాక్సెస్ ఫర్ సైబర్, జీపీటీ-5.5-సైబర్ పేర్లతో వేర్వేరు భద్రతా నియంత్రణలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా అత్యంత శక్తివంతమైన జీపీటీ-5.5-సైబర్ మోడల్‌కు కఠినమైన అకౌంట్ ధ్రువీకరణ, నియంత్రిత యాక్సెస్ మాత్రమే ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. ఈ వ్యవస్థలో భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారు. సైబర్ సామర్థ్యాలు దుర్వినియోగం కాకుండా ట్రస్ట్, వెరిఫికేషన్, ప్రపోర్షనల్ సేఫ్ గార్డ్స్ అండ్ అకౌంటబిలిటీ విధానాలను అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఎందుకంటే ఇదే టెక్నాలజీని హ్యాకర్లు కూడా దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని ఓపెన్ఏఐ అంగీకరించింది.
అనేక కంపెనీల భాగస్వామ్యం..
ఈ ప్రాజెక్ట్‌లో క్లౌడ్ ఫ్లేర్, సిస్కో, క్రౌడ్ స్ట్రైక్, పాలో ఆల్టో నెట్‌వర్క్స్, ఒరాకిల్, జడ్ స్కేలర్, అకమై, ఫోర్టినెట్ వంటి ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయని ఓపెన్ఏఐ వెల్లడించింది. క్లౌడ్ ఫ్లేర్ సీటీవో డేన్ నెక్ మాట్లాడుతూ ఫ్రాంటియర్ మోడల్స్ సెక్యూరిటీ వర్క్ ఫ్లోను మరింత వేగవంతం చేస్తాయని పేర్కొన్నారు. టెక్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఆంథ్రోపిక్ ఇటీవల ప్రవేశపెట్టిన ప్రాజెక్ట్ గ్లాసింగ్, క్లాడ్ మైథోస్ కు ప్రత్యామ్నాయంగా ఓపెన్ఏఐ డే బ్రేక్‌ను తీసుకొచ్చింది. దీంతో ఏఐ కంపెనీల మధ్య సైబర్ సెక్యూరిటీ రంగంలో పోటీ మరింత తీవ్రమవుతోందని భావిస్తున్నారు. ఓపెన్ఏఐ రాబోయే వారాల్లో ప్రభుత్వాలు, పరిశ్రమ భాగస్వాములతో కలిసి మరింత శక్తివంతమైన సైబర్-కేపబుల్ మోడల్స్‌ను దశలవారీగా విడుదల చేసే ప్రణాళికలో ఉంది. సంస్థల భద్రతా బృందాలు ఏఐ సహాయంతో గంటల పనిని నిమిషాల్లో పూర్తి చేయగలిగే స్థాయికి డే బ్రేక్ ను అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






