త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TVK MLA | బ‌ల‌ప‌రీక్ష‌కు ముందు టీవీకేకి షాక్‌.. ఓటింగ్‌లో ఆ ఎమ్మెల్యే పాల్గొన‌కూడ‌దంటూ ఆదేశం

TVK MLA | అసెంబ్లీలో త‌న బ‌లాన్ని నిరూపించుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్న త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్‌కి షాక్ త‌గిలింది. తిరుప‌త్తూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి డీఎంకే అభ్య‌ర్థి కేఆర్ పెరియకరుప్పన్‌పై కేవ‌లం ఒకే ఒక్క ఓటు తేడాతో గెలుపొందిన టీవీకే ఎమ్మెల్యే ఆర్‌. శ్రీ‌నివాస‌ సేతుప‌తి.. ఓటింగ్‌లో పాల్గొన‌కూడ‌ద‌ని మ‌ద్రాసు హైకోర్టు ఆదేశాలిచ్చింది.

D

National | Published On May 12, 2026, 5.28 pm IST

TVK MLA | బ‌ల‌ప‌రీక్ష‌కు ముందు టీవీకేకి షాక్‌.. ఓటింగ్‌లో ఆ ఎమ్మెల్యే పాల్గొన‌కూడ‌దంటూ ఆదేశం
Advertisement

TVK MLA | త‌మిళ‌నాడు శాస‌న‌స‌భ‌లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన టీవీకే చీఫ్ విజ‌య్‌.. అసెంబ్లీలో త‌న బ‌లాన్ని నిరూపించుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో టీవీకే ఎమ్మెల్యే (TVK MLA) శ్రీ‌నివాస‌ సేతుప‌తి ఓటింగ్‌లో పాల్గొన‌కూడ‌దంటూ మ‌ద్రాసు హైకోర్టు ఆదేశాలిచ్చింది.

ఆర్‌. శ్రీ‌నివాస‌ సేతుప‌తి (R Srinivasa Sethupathi).. తిరుప‌త్తూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి డీఎంకే (DMK) అభ్య‌ర్థి కేఆర్ పెరియకరుప్పన్ (KR Periyakaruppan)పై పోటీ చేసి కేవ‌లం ఒక్క ఓటు తేడాతో గెలుపొందాడు. సేతుపతికి 83,365 ఓట్లు రాగా, పెరియకరుప్పన్‌కు 83,364 ఓట్లు వ‌చ్చాయి. ఈ ఫ‌లితాల‌పై పెర‌య‌క‌రుప్ప‌న్ హైకోర్టును ఆశ్ర‌యించారు. పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో లోపాలు జ‌రిగాయంటూ ఆరోపించారు. రీకౌంటింగ్ జ‌రిపేలా ఆదేశాలు ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. శ్రీ‌నివాస‌ సేతుప‌తిని ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌కుండా అడ్డుకోవాల‌ని కోరారు.

ఈ మేర‌కు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌ను ప‌రిశీలించిన న్యాయ‌స్థానం తాజాగా కీల‌క ఆదేశాలు జారీ చేసింది. శ్రీనివాస‌ సేతుపతి శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయకుండా కోర్టు ఆంక్షలు విధించింది. అసెంబ్లీలో టీవీకే బలాన్ని నిరూపించుకోవడానికి జరగబోయే విశ్వాస పరీక్షలో పాల్గొన‌కూడ‌ద‌ని ఆదేశించింది. కోర్టు తీర్పుతో అసెంబ్లీలో టీవీకే బ‌లం 119కి త‌గ్గింది.

అయిన‌ప్ప‌టికీ.. మెజారిటీకి అవ‌స‌ర‌మైన సంఖ్య మాత్రం త‌గ్గ‌లేదు. అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష‌కు 118 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు అవ‌స‌రం. ప్ర‌స్తుతం టీవీకేకి మిత్ర‌ప‌క్షాల మ‌ద్ద‌తుతో 120 మంది ఎమ్మెల్యేల బ‌లం ఉంది. తాజా ప‌రిణామంతో ఆ సంఖ్య 119కి త‌గ్గింది. ఇక తాజాగా ఏఐఏడీఎంకే రెబ‌ల్ ఎమ్మెల్యేలు కూడా టీవీకేకి బ‌హిరంగ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

Also Read..

పేప‌ర్ లీక్ క‌ల‌క‌లం.. నీట్ ప‌రీక్ష ర‌ద్దు చేస్తూ ఎన్టీయే కీల‌క ప్ర‌క‌ట‌న‌

అస్సాం సీఎంగా హిమంత బిశ్వశ‌ర్మ ప్ర‌మాణం.. తొలి కాంగ్రెసేతర నాయకుడిగా రికార్డు

స‌నాత‌నధ‌ర్మాన్ని నిర్మూలించాలి : ఉద‌య‌నిధి స్టాలిన్

Advertisement
Advertisement