Udhayanidhi Stalin | సనాతనధర్మాన్ని నిర్మూలించాలి : ఉదయనిధి స్టాలిన్
Udhayanidhi Stalin | తాను, విజయ్ ఒకే కళాశాలలో చదువుకున్నామని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. తమ అనుభవాలను, జ్ఞానాన్ని సీఎంతో పంచుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. తమిళనాడు అభివృద్ధి కోసం మనమందరం కలిసి పనిచేద్దాం అంటూ పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఆయన మరోసారి సనాతన ధర్మం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
Udhayanidhi Stalin | తాను, విజయ్ (CM Vijay) ఒకే కళాశాలలో చదువుకున్నామని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. నేడు అసెంబ్లీలో ఉదయనిధి (Udhayanidhi Stalin) మాట్లాడారు. తమ అనుభవాలను, జ్ఞానాన్ని సీఎంతో పంచుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. తమ సూచనలను కూడా విజయ్ స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. అదేసమయంలో నిన్న డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌తో విజయ్ భేటీ అంశాన్ని కూడా ఉదయనిధి ప్రస్తావించారు.
రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం..
"నిన్న సీఎం విజయ్ మా నాయకుడు (ఎంకే స్టాలిన్‌ను ఉద్దేశించి), అనేక మంది ఇతర నాయకుల నుంచి శుభాకాంక్షలు అందుకున్నారు. ఇదే రాజకీయ నాగరికత ఈ సభలో కూడా కొనసాగాలి. మనం అధికార పక్షంగా, ప్రతిపక్షంగా వేర్వేరు వరుసల్లో కూర్చున్నప్పటికీ.. తమిళనాడు అభివృద్ధి కోసం మనమందరం కలిసి పనిచేయాలి" అని ఉదయనిధి పిలుపునిచ్చారు.
అక్కడ వందేమాతరమే ప్లే చేయలేదు..
అదే సమయంలో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో వందేమాతరం తర్వాత తమిళనాడు రాష్ట్ర గీతాన్ని ఆలపించడంపై కూడా ఆయన స్పందించారు. "పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అసలు వందేమాతరమే ప్లే చేయలేదు. కానీ ఇక్కడ ప్లే చేశారు. అక్కడ గవర్నర్ ఎవరో మీ అందరికీ తెలుసు. ఇలాంటివి మళ్లీ జరగకుండా ప్రభుత్వం చూడాలి. మన తమిళనాడు రాష్ట్ర గీతం ఎప్పటికీ మొదటి స్థానంలోనే ఉండాలి" అని ఉదయనిధి పేర్కొన్నారు.
సనాతనాన్ని నిర్మూలించాలి..
ఇదే సమయంలో ఆయన మరోసారి సనాతన ధర్మం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలను వేరు చేసే సనాతనాన్ని నిర్మూలించాలంటూ వ్యాఖ్యానించారు.
విజయ్ Vs ఉదయనిధి
తమిళనాడు రాజకీయాలు (Tamil Nadu Politics) ఆసక్తికరంగా మారాయి. నిన్నటి వరకూ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలు అధికార, ప్రతిపక్షంలో కూర్చోగా.. నేడు యువ నేతలు ఆ స్థానాల్లో కూర్చొని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వాళ్లు ఎవరో కాదు. ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉండి సినిమా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్న జోసెఫ్ విజయ్, ఉదయనిధి స్టాలిన్.
విజయ్‌కి ఎలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం లేదు. ఆయన రెండేళ్ల క్రితం స్థాపించిన టీవీకే పార్టీ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసింది. ఊహించని రీతిలో భారీ మెజారిటీతో గెలుపొందింది. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ మాత్రం చెపాక్ నుంచి గెలుపొంది మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆయన తమిళనాడు అసెంబ్లీలో ప్రధానప్రతిపక్ష నేతగా ఉన్నారు.
ఇలా కొత్త తరం నాయకులు తమిళనాడు రాష్ట్రాన్ని నడిపించబోతున్నారు. అయితే, సీఎం విజయ్, ఉదయనిధి స్టాలిన్ గతంలో మంచి స్నేహితులు. ఉదయనిధి తన సినీ నిర్మాణ సంస్థ ‘రెడ్ జెయింట్ మూవీస్’ ద్వారా విజయ్‌తో పలు చిత్రాలు నిర్మించారు. ఆ సమయంలో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఒకప్పుడు సినిమా వేదికలపై కలిసి కనిపించిన ఈ ఇద్దరు యువ నేతలు.. ఇప్పుడు రాజకీయ రణరంగంలో ముఖాముఖి తలపడుతుండటం ఆసక్తికరంగా మారింది.
Also Read..
పెట్రోల్ బంకులో భారీ అగ్నిప్రమాదం.. 12 మందికి గాయాలు.. కాలిబూడిదైన ద్విచక్ర వాహనాలు
11 గంటల్లో శ్రీలంక టు భారత్.. వయా రామసేతు.. స్విమ్మింగ్‌తో బెంగుళూరు జంట వరల్డ్ రికార్డ్
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

Vijay TVK Cabinet | తమిళనాడు పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్: 59 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రభుత్వంలోకి కాంగ్రెస్.. సీఎం విజయ్ క్యాబినెట్లో ఇద్దరికి ఛాన్స్
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



