త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Himanta Biswa Sarma | అస్సాం సీఎంగా హిమంత బిశ్వశ‌ర్మ ప్ర‌మాణం.. తొలి కాంగ్రెసేతర నాయకుడిగా రికార్డు

Himanta Biswa Sarma | అస్సాం ముఖ్య‌మంత్రిగా హిమంత బిశ్వ శ‌ర్మ వ‌రుస‌గా రెండోసారి ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. త‌ద్వారా అస్సాంలో వరుసగా రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన తొలి కాంగ్రెసేతర నాయకుడిగా రికార్డు సృష్టించారు.

D

National | Published On May 12, 2026, 5.22 pm IST

Himanta Biswa Sarma | అస్సాం సీఎంగా హిమంత బిశ్వశ‌ర్మ ప్ర‌మాణం.. తొలి కాంగ్రెసేతర నాయకుడిగా రికార్డు
Advertisement

Himanta Biswa Sarma | అస్సాం (Assam)లో బీజేపీ ప్ర‌భుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా హిమంత బిశ్వ శ‌ర్మ (Himanta Biswa Sarma) వ‌రుస‌గా రెండోసారి ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. గౌహ‌తిలోని ఖానాప‌రా ప‌శువైద్య క‌ళాశాల మైదానంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో హిమంత చేత గ‌వ‌ర్న‌ర్ ల‌క్ష్మ‌ణ్ ప్ర‌సాద్ ఆచార్య ప్ర‌మాణ స్వీకారం చేయించారు. సీఎం హిమంత‌తోపాటూ న‌లుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.

ఈ ప్ర‌మాణ‌ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ న‌డ్డా, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, కూట‌మి ఎంపీలు, సీనియ‌ర్ నాయ‌కులు హాజ‌ర‌య్యారు. వీరికి ప్ర‌ధాని మోదీ, కేంద్ర మంత్రులు శుభాకాంక్ష‌లు తెలిపారు.

కాగా, అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని కూట‌మి అధికారంలోకి రావ‌డం ఇది వ‌రుస‌గా మూడోసారి. 2016లో ప్ర‌స్తుత కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ నేతృత్వంలోని బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. ఆ త‌ర్వాత 2021లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలుపొంది.. హిమంత బిశ్వ శ‌ర్మ నేతృత్వంలోని ఎన్డీయే ప్ర‌భుత్వం మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చింది. ఇప్పుడు వ‌రుస‌గా రెండోసారి సీఎంగా హిమంత బాధ్య‌త‌లు చేప‌ట్టి.. అస్సాంలో వరుసగా రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన తొలి కాంగ్రెసేతర నాయకుడిగా రికార్డు సృష్టించారు. 126 అసెంబ్లీ స్థానాల‌కు గానూ ఎన్డీయే కూట‌మి 102 స్థానాల్లో గెలుపొందింది. ఇందులో బీజేపీ 82 స్థానాల్లో, ఏజీపీ 10 స్థానాల్లో, బీపీఎఫ్ 10 చోట్ల విజ‌యం సాధించాయి.

Also Read..

స‌నాత‌నధ‌ర్మాన్ని నిర్మూలించాలి : ఉద‌య‌నిధి స్టాలిన్

పెట్రోల్ బంకులో భారీ అగ్నిప్ర‌మాదం.. 12 మందికి గాయాలు.. కాలిబూడిదైన ద్విచ‌క్ర వాహ‌నాలు

11 గంట‌ల్లో శ్రీ‌లంక టు భార‌త్‌.. వ‌యా రామసేతు.. స్విమ్మింగ్‌తో బెంగుళూరు జంట వ‌ర‌ల్డ్ రికార్డ్‌

Advertisement
Advertisement