TVK | తమిళనాడులో త్రిముఖ పోరు.. ద్రవిడ పార్టీలకు సవాల్ విసురుతున్న టీవీకే.. 80 స్థానాల్లో ముందంజ
TVK | తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే (DMK), అన్నాడీఎంకే, విజయ్‌కు చెందిన టీవీకే (తమిళగ వెట్రి కళగం) పార్టీల మధ్య తీవ్రమైన త్రిముఖ పోరు నడుస్తోంది. ద్రవిడ పార్టీలకు టీవీకే (TVK) సవాల్ విసురుతోంది.
TVK | నాలుగు రాష్ట్రాలు, ఒక యూటీలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే (DMK), అన్నాడీఎంకే, విజయ్‌కు చెందిన టీవీకే (తమిళగ వెట్రి కళగం) పార్టీల మధ్య తీవ్రమైన త్రిముఖ పోరు నడుస్తోంది. ద్రవిడ పార్టీలకు టీవీకే (TVK) సవాల్ విసురుతోంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు గట్టి పోటీనిస్తూ టీవీకే సత్తా చాటుతుండటంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. టీవీకే దాదాపు 80 స్థానాల్లో ముందంజలో దూసుకెళ్తోంది. ఇక ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కేవలం 54 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఏఐడీఎంకే-బీజేపీ కూటమి 44 స్థానాల్లో ముందంజలో ఉంది.
తిరిచురాపల్లిలో విజయ్ ముందంజ
టీవీకే చీఫ్ విజయ్ తిరిచురాపల్లి (Tirichurapalli)లో ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్ ముగిసే సరికి 1,649 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.
తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఏప్రిల్ 23న ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 4 వేల మంది అభ్యర్థులు పోటీచేశారు. 85.15 శాతం ఓటింగ్ రికార్డయ్యింది. కౌంటింగ్‌కు మొత్తం 62 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈవీఎం కోసం ప్రత్యేకంగా 234 కౌంటింగ్ హాళ్లను, పోస్టల్ బ్యాలెట్లు, ETPBS ఓట్లను లెక్కించేందుకు మరో 240 హాళ్లు కేటాయించారు. మొత్తం 3,324 కౌంటింగ్ టేబుళ్లపై ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్ విధుల్లో 1.25 లక్షల మంది భద్రతా సిబ్బంది, అధికారులు, సూక్ష్మపరిశీలకులు పాల్గొంటున్నారు. ఈ ఎన్నికల్లో గెలవాలంటే 118 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంటుంది.
Also Read..
పవర్‌ఫుల్ ఏఐ టూల్‌తో వంద గ్రహాలను గుర్తించిన నాసా..!
వరంగల్ రైతు సభను విజయవంతం చేయండి : ఆస్ట్రేలియా ఎన్నారై బీఆర్ఎస్
సంక్షోభం దిశగా ప్రపంచం.. 2090 నాటికి ప్రమాదంలో 260 కోట్ల మంది..!
సంబంధిత వార్తలు

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

TVK | రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు.. సీపీఎం హెచ్చరికలతో ప్రచారానికి చెక్‌పెట్టిన టీవీకే
మే 20, 2026

MK Stalin | విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలి.. పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపు
మే 19, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



