NASA | పవర్‌ఫుల్ ఏఐ టూల్‌తో వంద గ్రహాలను గుర్తించిన నాసా..!
NASA | ఈ అనంత విశ్వంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ఇందులో కొన్ని మాత్రమే వెలుగులోకి వచ్చాయి. ఎప్పటికప్పుడు ఖగోళశాస్త్రవేత్తలు కొత్త గ్రహాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో వందకుపైగా ఎక్సోప్లానెట్స్‌ను గుర్తించారు.
NASA | ఈ అనంత విశ్వంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ఇందులో కొన్ని మాత్రమే వెలుగులోకి వచ్చాయి. ఎప్పటికప్పుడు ఖగోళశాస్త్రవేత్తలు కొత్త గ్రహాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో వందకుపైగా ఎక్సోప్లానెట్స్‌ను గుర్తించారు. నాసా ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (టెస్) మిషన్ డేటాను ఆధారంగా వీటిని గుర్తించగా.. ఇందులో 31 కొత్త గ్రహాలు ఉన్నాయి. పవర్‌ఫుల్ ఏఐ టూల్ ‘రేవెన్’ సహాయంతో జాడను పట్టేశారు. ఈ పరిశోధనలో అత్యంత అరుదైన, అసాధారణ గ్రహాలు కూడా వెలుగులోకి వచ్చాయి. కొన్ని గ్రహాలు తమ నక్షత్రాల చుట్టూ అత్యంత వేగంతో పరిభ్రమిస్తున్నాయి. మరికొన్ని ‘నెప్ట్యూనియన్ డెజర్ట్’గా పిలిచే రహస్య ప్రాంతంలో గుర్తించారు. నెప్ట్యూన్ పరిమాణంలో ఉన్న మధ్యస్థ గ్యాస్ గ్రహాలు తమ నక్షత్రాలకు అత్యంత సమీపంలో ఉంటే చాలా అరుదుగా కనిపించే ప్రాంతాన్ని ఈ పేరుతో పిలుస్తారు.
ఈ అధ్యయనం యూనివర్సిటీ ఆఫ్ వార్విక్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు నిర్వహించారు. పరిశోధన ఫలితాలు ‘మంత్లీ నోటీసెస్ ఆఫ్ ది రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ (MNRAS)’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. నాసా టెస్ మిషన్ తొలి నాలుగేళ్లలో సేకరించిన 2.2 మిలియన్ స్టార్స్ డేటాను బృందం విశ్లేషించింది. అంతరిక్ష మిషన్లు సాధారణంగా వేలాది గ్రహ సంకేతాలను నమోదు చేస్తాయి. వాటిలో నిజమైన గ్రహాలను గుర్తించడం పెద్ద సవాల్‌గా ఉంటుంది. ఈ సమస్యను రేవెన్ అధిగమించింది. మిలియన్ల సిమ్యులేటెడ్ డేటాపై శిక్షణ పొందిన ఈ ఏఐ టూల్, నక్షత్ర కాంతిలో వచ్చే మార్పు గ్రహం వల్లనా లేదంటే ఇతర ఖగోళ కారణాల వల్లనా అనేది ఖచ్చితంగా గుర్తిస్తుంది. ఈ పరిశోధనలో కొన్ని ప్రత్యేక రకాల గ్రహాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
ముఖ్యంగా తమ నక్షత్రాలకు అత్యంత సమీపంలో పరిభ్రమిస్తూ 16 రోజుల్లో ఒక పరిభ్రమణాన్ని పూర్తి చేసే గ్రహాలను పరిశీలించారు. అధ్యయన ప్రధాన రచయిత డాక్టర్ మారినా లాఫార్గా మాగ్రో ప్రకారం.. రేవెన్ వ్యవస్థ ద్వారా 118 కొత్త గ్రహాలు ధ్రువీకరించామని, 2వేలకుపైగా గ్రహాలుగా ఉండే అవకాశం ఉన్న సంకేతాలను గుర్తించారని.. ఇందులో వెయ్యి కొత్తవి ఉన్నట్లు తెలిపారు. కొత్తగా గుర్తించిన గ్రహాల్లో కొన్ని అత్యంత ప్రత్యేకమైనవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వీటిలో 24 గంటల్లోపే తమ నక్షత్రం చుట్టూ ఒకసారి తిరిగే అల్ట్రా-షార్ట్ పీరియడ్ గ్రహాలు ఉన్నాయి. నెప్ట్యూనియన్ డెజర్ట్ ప్రాంతంలో ఉన్న గ్రహాలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు






