త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Australia NRI BRS | వరంగల్ రైతు సభను విజయవంతం చేయండి : ఆస్ట్రేలియా ఎన్నారై బీఆర్ఎస్

Australia NRI BRS | మే 6న త‌ల‌పెట్టిన వరంగల్ ఉమ్మడి జిల్లా రైతు సభను విజవంతం చేయాల‌ని పిలుపునిస్తూ ఆస్ట్రేలియా ఎన్నారై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అనిల్ బైరెడ్డి ఆధ్వర్యంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు.

S

Telangana | Published On May 4, 2026, 10.00 am IST

Australia NRI BRS | వరంగల్ రైతు సభను విజయవంతం చేయండి : ఆస్ట్రేలియా ఎన్నారై బీఆర్ఎస్
Advertisement

Australia NRI BRS | త్రినేత్ర‌.న్యూస్ : మే 6న త‌ల‌పెట్టిన వరంగల్ ఉమ్మడి జిల్లా రైతు సభను విజవంతం చేయాల‌ని పిలుపునిస్తూ ఆస్ట్రేలియా ఎన్నారై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అనిల్ బైరెడ్డి ఆధ్వర్యంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు.

కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ప్రకటించి 30 నెలలవుతున్న డిక్లరేషన్‌లోని హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని, రైతులకు అండగా నిలుస్తూ కాంగ్రెస్ సర్కార్ రైతులకు చేసిన మోసాన్ని వరంగల్ నుంచి ఎండగట్టి రైతులను చైతన్యం చేసే "రైతు సభను" విజయవంతం చేయాలని అనిల్ బైరెడ్డి విజ్ఞప్తి చేశారు.

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విచ్చేస్తున్న "వరంగల్ రైతు సభను" జిల్లా నలుమూలల నుండి రైతు ప్రతినిధులు వేలాదిగా తరలిరావాలని వచ్చి విజయవంతం చేయాలని ఆస్ట్రేలియా ఎన్నారై బీఆర్ఎస్ నాయకులు పిలుపునివ్వడం జరిగింది.

ఎన్నారై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అనిల్ బైరెడ్డితో పాటు రాహుల్ నడిదే, రమేష్ ముత్యాల, మధు పార్స, సత్య గుండా, రవీందర్ చుక్క, శ్రీకాంత్ రోహిత్, హరీష్ రెడ్డి, సజ్జాద్ పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement