TVK | రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్‌లో చోటు.. సీపీఎం హెచ్చరికలతో ప్రచారానికి చెక్‌పెట్టిన టీవీకే
TVK | ఏఐఏడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలకు (AIADMK Rebals) సీఎం విజయ్ (CM Vijay) తన మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని టీవీకే ఖండించింది. తమ ప్రభుత్వానికి అన్నాడీఎంకేతో ఎలాంటి పొత్తులు లేవని స్పష్టం చేసింది.
TVK | ఏఐఏడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలకు (AIADMK Rebals) సీఎం విజయ్ (CM Vijay) తన మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ప్రచారాన్ని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ తోసిపుచ్చింది. తమ ప్రభుత్వానికి అన్నాడీఎంకేతో ఎలాంటి పొత్తులు లేవని స్పష్టం చేసింది.
అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటే ప్రభుత్వానికి మద్దతు కొనసాగించే విషయాన్ని పునరాలోచిస్తామంటూ సీపీఎం హెచ్చరికల (CPM Warning) నేపథ్యంలో టీవీకే నేత, మంత్రి ఆధవ్ అర్జున క్లారిటీ ఇచ్చారు. తమ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ప్రకటించిన వీసీకే, సీపీఎంతోపాటూ మరో మూడు పార్టీలను ప్రభుత్వంలో చేరాల్సిందిగా తమ పార్టీ ఆహ్వానించినట్లు ఆధవ అర్జున స్పష్టం చేశారు. అదే సమయంలో మంత్రివర్గం విస్తరణపై సీఎం విజయ్ త్వరలోనే ప్రకటన చేస్తారని ఆధవ్ అర్జున వెల్లడించారు.
కాగా, ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన రెబల్ వర్గానికి విజయ్ తన కేబినెట్‌లో చోటు కల్పిస్తారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారం నేపథ్యంలో విజయ్ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్న సీపీఎం తీవ్ర హెచ్చరికలు చేసింది. రెబల్స్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటే.. విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము అందిస్తున్న మద్దతును "పునఃపరిశీలించాల్సి" ఉంటుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలోనే ఊహాగానాలకు విజయ్ పార్టీ చెక్‌పెట్టింది.
Also Read..
సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న ‘కాక్రోచ్ పార్టీ’.. ఇందులో చేరాలంటే ఈ అర్హతలు మస్ట్ మరి..
సమాజం కోసం పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు.. సారా అలీ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
38 ఏళ్ల తర్వాత అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్.. TG EAPCET టాపర్ 'రుషి'ని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి
తాజావార్తలు
- ●Sandeep Vanga | ప్రభాస్ స్పిరిట్ కంటే ముందే సందీప్ వంగా కొత్త మూవీ రిలీజ్ - రోమాంచకం గ్లింప్స్ వచ్చేసింది
- ●Etela Rajender | రేవంత్ మూర్ఖపు ప్రయత్నాలు బంజేయ్.. వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్‌లు ఆన్ జేయి
- ●KTR | మీరు వడ్ల బస్తాలు మోస్తుంటే.. రేవంతేమో డబ్బుల బస్తాలు మోస్తుండు
- ●Movie Collections | నాగబంధం వర్సెస్ రావు బహదూర్ - ఈ వారం రిలీజైన సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ దేనికి వచ్చాయంటే?
- ●Telangana SIR Process Status | తెలంగాణలో జోరుగా SIR ప్రక్రియ: పంపిణీలో టాప్.. డిజిటైజేషన్లో ఢమాల్, జిల్లాల వారీగా రిపోర్ట్ ఇదే!
- ●Jalalabad Renamed Parshurampuri | జలాలాబాద్ ఇక నుంచి పరశురాంపురి

Sandeep Vanga | ప్రభాస్ స్పిరిట్ కంటే ముందే సందీప్ వంగా కొత్త మూవీ రిలీజ్ - రోమాంచకం గ్లింప్స్ వచ్చేసింది

Etela Rajender | రేవంత్ మూర్ఖపు ప్రయత్నాలు బంజేయ్.. వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్‌లు ఆన్ జేయి

KTR | మీరు వడ్ల బస్తాలు మోస్తుంటే.. రేవంతేమో డబ్బుల బస్తాలు మోస్తుండు

Movie Collections | నాగబంధం వర్సెస్ రావు బహదూర్ - ఈ వారం రిలీజైన సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ దేనికి వచ్చాయంటే?






