త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Madras High Court | మహిళా కలెక్టర్‌కు ఎమ్మెల్యే అసభ్యకర మెసేజ్‌లు.. విజ‌య్ ప్ర‌భుత్వంపై మ‌ద్రాసు హైకోర్టు ఆగ్ర‌హం

Madras High Court | తమిళనాడులోని విజ‌య్ ప్ర‌భుత్వం (Tamil Nadu government )పై మ‌ద్రాసు హైకోర్టు (Madras High Court) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కళ్లకురిచి జిల్లా మహిళా కలెక్టర్‌కు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీకే (TVK) ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేష్‌పై (TVK MLA Arul Vignesh) ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ప్ర‌శ్నించింది. ‘‘ఈ సందేశాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పటివరకు మీరేం చేశారు? చర్యలు తీసుకోవాలని నేనే మీకు సూచించాలా? మీ అంతట మీరే ఎందుకు స్పందించలేకపోయారు?’’ అంటూ న్యాయమూర్తి ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు.

D

National | Published On Nov 24, 2026, 1.34 pm IST

Madras High Court | మహిళా కలెక్టర్‌కు ఎమ్మెల్యే అసభ్యకర మెసేజ్‌లు.. విజ‌య్ ప్ర‌భుత్వంపై మ‌ద్రాసు హైకోర్టు ఆగ్ర‌హం
Advertisement

Madras High Court | త్రినేత్ర న్యూస్ : కళ్లకురిచి జిల్లా మహిళా కలెక్టర్‌కు (Kallakurichi District Collector) అసభ్యకరమైన మెసేజ్‌లు పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీకే (TVK) ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేష్ (TVK MLA Arul Vignesh) వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వ (Tamil Nadu government) తీరుపై మద్రాస్ హైకోర్టు (Madras High Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం గురించి జులై 31నే ప్రభుత్వానికి సమాచారం అందినా.. ఇంత‌వ‌ర‌కూ ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది.

ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ లక్ష్మీనారాయణన్.. ప్ర‌భుత్వానికి ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. బాధితురాలికి సంబంధించిన అస‌భ్య‌క‌ర మెసేజ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా వాటిని తొలగించడానికి ప్రభుత్వం ఎందుకు తక్షణమే చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ‘‘ఈ సందేశాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పటివరకు మీరేం చేశారు? చర్యలు తీసుకోవాలని నేనే మీకు సూచించాలా? మీ అంతట మీరే ఎందుకు స్పందించలేకపోయారు?’’ అంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. న‌ష్టం జ‌రిగాక చ‌ర్య‌లు తీసుకుంటే ప్ర‌యోజ‌మేంటి..? అని నిల‌దీశారు. ఇది పరోక్షంగా బాధితురాలిని అవమానించడమేన‌ని వ్యాఖ్యానించారు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న పోస్టుల‌ను వెంట‌నే తొల‌గించాల‌ని ఆదేశించారు.

అయితే, ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశామ‌ని, మ‌హిళా పోలీస్ స్టేష‌న్ ద్వారా ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ జాన్ స‌త్య‌న్ కోర్టుకు తెలిపారు. మహిళా కలెక్టర్‌తో ప్రభుత్వం మాట్లాడిందా..? ఆమెకు తగిన రక్షణ కల్పించిందా..? అని హైకోర్టు ప్రశ్నించింది. మహిళలపై లైంగిక వేధింపుల విషయంలో వారి హోదాతో సంబంధం లేకుండా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది. "ఆమె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా, పారిశుద్ధ్య కార్మికురాలైనా సరే.. లైంగిక వేధింపుల నుంచి రక్షణ పొందే హక్కు ప్రతి మహిళకూ ఉంది" అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

నిందితుడు ఎమ్మెల్యే కావడంతో ఎస్పీ (SP) స్థాయి కంటే పైస్థాయి అధికారి పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని కోర్టు అభిప్రాయపడింది. ప‌ని ప్ర‌దేశాల్లో మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపుల నిరోధ‌క చ‌ట్టం కింద అంత‌ర్గ‌త ఫిర్యాదుల క‌మిటీని ఏర్పాటు చేశారా..? లేదా..? అని కోర్టు ఆరా తీసింది. ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఎవరినైనా కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు చిన్న అనుమానం వచ్చినా సహించేది లేద‌ని తీవ్రంగా హెచ్చ‌రించింది.

Also Read..

ఆత్మ‌క‌థ‌లో సావ‌ర్క‌ర్‌పై వ్యాఖ్య‌లు.. సోనియా గాంధీకి లీగ‌ల్ నోటీసులు

కార్తీక‌ దీపం వేడుక‌ల‌పై తీవ్ర ఉత్కంఠ‌.. మ‌దురైలో 144 సెక్ష‌న్ అమ‌లు

అమీర్‌పేట వీధుల్లో హీరో విజయ్ ఆంటోనీ సంద‌డి.. హోట‌ల్లో చాయ్ తాగుతూ స్థానికుల‌తో ముచ్చ‌ట్లు

Advertisement
Advertisement