Sara Ali Khan | సమాజం కోసం పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు.. సారా అలీ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Sara Ali Khan | బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ ప్రస్తుతం సినిమాలతో పాటు పలు అంశాలపై స్పందిస్తూ తరుచూ వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల ‘పతి పద్ని ఔర్ వో దో’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్, వామికా గబ్బి, ఆయుష్మాన్ ఖురానా కీలక పాత్రల్లో నటించారు.
Entertainment | Published On May 20, 2026, 4.27 pm IST
Sara Ali Khan | బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ ప్రస్తుతం సినిమాలతో పాటు పలు అంశాలపై స్పందిస్తూ తరుచూ వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల ‘పతి పద్ని ఔర్ వో దో’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్, వామికా గబ్బి, ఆయుష్మాన్ ఖురానా కీలక పాత్రల్లో నటించారు. ఆధునిక ప్రేమ, వివాహ బంధాల్లో ఎదురయ్యే భావోద్వేగాలు, అపార్థాలు, సంబంధాల మధ్య వచ్చే మార్పులను వినోదాత్మకంగా చూపించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన అందుకుంటోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంట్వర్యూలో పెళ్లి, వ్యక్తిగత జీవితంపై తన ఆలోచనలను ఓపెన్‌గానే వెల్లడించింది. ప్రస్తుతం యువతలో పెళ్లిపై మారుతున్న అభిప్రాయాల మధ్య సారా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. పెళ్లి అనే వ్యవస్థను తాను చాలా సీరియస్‌గా చూస్తానని, జీవితంలో చూసిన అనుభవాలే తన ఆలోచనలను ప్రభావితం చేశాయని తెలిపింది. చుట్టుపక్కల జరిగిన కొన్ని విఫల వివాహాలు తనకు చాలా విషయాలు నేర్పాయని చెప్పిన సారా.. కేవలం ఒత్తిడితో, సమాజం కోసం పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తనకు లేదని స్పష్టం చేసింది.
ఒంటరిగా బతకడమే మేలు..
‘సరైన వ్యక్తి దొరికే వరకు వేచి ఉండటం తప్పేమీ కాదు. తొందరపడి జీవితాంతం బాధపడే బంధంలోకి వెళ్లడం కంటే ఒంటరిగా సంతోషంగా జీవించడం మేలని నమ్ముతాను’ అంటూ వ్యాఖ్యానించింది. ముందుగా వ్యక్తిగతంగా ఎదగడం ముఖ్యమని కూడా సారా పేర్కొంది. తన వ్యక్తిత్వాన్ని గౌరవించే వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తానని ఆమె చెప్పింది. ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ సినిమాలపైనే ఉందని, కెరీర్‌లో ఇంకా చాలా సాధించాలని ఉందని సారా అలీ ఖాన్ వెల్లడించింది. బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె.. కంటెంట్ ఆధారిత కథలకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకెళ్తోంది. గ్లామర్ పాత్రలతో పాటు నటనకు స్కోప్ ఉన్న పాత్రలను కూడా ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. సారా అలీ ఖాన్ కెరీర్‌ను పరిశీలిస్తే.. ‘కేదార్‌నాథ్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఆమె తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత ‘సింబా, ‘లవ్ ఆజ్ కల్, ‘అత్రంగి రే’, ‘మర్డర్ ముబారక్’ వంటి సినిమాలతో బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది. స్టార్ కిడ్ అనే ట్యాగ్‌తో వచ్చినప్పటికీ, తనదైన నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందింది.
సినిమాల్లో బిజీబిజీ..
ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పటికే సారా చేతిలో పలు ఆసక్తికర ప్రాజెక్టుల్లో బిజీగా ఉంది. రొమాంటిక్ డ్రామా, వుమెన్ ఓరియెంటెడ్, ఓటీటీ ప్రాజెక్టులు ఇలా విభిన్నమైన జానర్లలో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా సారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తన ట్రావెల్ వీడియోలు, ఫ్యామిలీ పోస్టులు, ఫిట్‌నెస్ అప్‌డేట్స్‌తో అభిమానులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది. పెళ్లి విషయంలో సారా అలీ ఖాన్ వెల్లడించిన అభిప్రాయాలు ప్రస్తుతం యువతలో జరుగుతున్న చర్చలకు ప్రతిబింబంగా కనిపిస్తున్నాయి. కెరీర్‌కు ప్రాధాన్యం ఇస్తూనే, వ్యక్తిగత జీవితంపై కూడా స్పష్టమైన ఆలోచనలతో ముందుకెళ్తున్న ఈ బాలీవుడ్ బ్యూటీ.. ప్రస్తుతం ఉద్తా తీర్ మూవీలో బిజీగా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RGI Airport | ప్రయాణీలకు యూడీఎఫ్ షాక్.. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న జీఎంఆర్..!
జులై 6, 2026

Tummala Nageswara Rao | ఇప్పటికి రైతు ఖాతాల్లో రూ.7490.72 కోట్లు జమ
జులై 6, 2026

Kriti Sanon | హీరో డామినేషన్ నచ్చలేదు – చాలా కండీషన్లు పెట్టాడు – అల వైకుంఠపురములో రీమేక్‌పై కృతి సనన్ షాకింగ్ కామెంట్లు
జులై 6, 2026
తాజావార్తలు
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ
- ●Telangana SIR Process | "ఒక వ్యక్తికి ఒకే ఓటు" కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్
- ●Divyabharathi | హాట్ ఫొటోలతో రచ్చ చేసిన సుడిగాలి సుధీర్ హీరోయిన్
- ●Uttam Kumar Reddy | 2028 జూన్ కల్లా ఎస్ ఎల్ బీసీని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ●Corporation chairmens tenure | రేపటితో 34 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవీ కాలం పూర్తి..
- ●Ponnam Prabhakar | రాముడి పేరుతో దోచుకున్నందుకు బీజేపీ క్షమాపణ చెప్పాలి

OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

Telangana SIR Process | "ఒక వ్యక్తికి ఒకే ఓటు" కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్

Divyabharathi | హాట్ ఫొటోలతో రచ్చ చేసిన సుడిగాలి సుధీర్ హీరోయిన్

Uttam Kumar Reddy | 2028 జూన్ కల్లా ఎస్ ఎల్ బీసీని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి



