త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trisha | త్రిష బ‌ర్త్‌డే ట్రీట్ – విశ్వంభ‌ర నుంచి స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్‌

త్రిష బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి విశ్వంభ‌ర నుంచి మేక‌ర్స్ చెన్నై క్వీన్‌ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అవ‌ని అనే పాత్ర‌లో త్రిష క‌నిపించ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు.

N

Entertainment | Published On May 4, 2026, 12.23 pm IST

Trisha | త్రిష బ‌ర్త్‌డే ట్రీట్ – విశ్వంభ‌ర నుంచి స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్‌
Advertisement

Trisha |  త్రిష తెలుగులో సినిమా చేసి ప‌దేళ్లు దాటిపోయింది. 2016లో వ‌చ్చిన నాయ‌కి త‌ర్వాత టాలీవుడ్‌కు దూర‌మైంది. సుదీర్ఘ విరామం త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న విశ్వంభ‌ర మూవీతో తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది త్రిష‌. సోషియో ఫాంట‌సీ యాక్ష‌న్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు వ‌శిష్ట మ‌ల్లిడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

పోస్ట‌ర్ రిలీజ్‌...

సోమ‌వారం త్రిష బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విశ్వంభ‌ర టీమ్ అభిమానుల‌కు స్వీట్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా నుంచి త్రిష స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. విశ్వంభ‌ర‌లో త్రిష అవ‌ని పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఇర‌వై ఏళ్ల త‌ర్వాత‌....

చిరంజీవి, త్రిష కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న సెకండ్ మూవీ ఇది. గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి స్టాలిన్ సినిమా చేశారు. ఏఆర్ మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో 2006లో వ‌చ్చిన ఈ మూవీ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. మ‌ళ్లీ ఇర‌వై ఏళ్ల త‌ర్వాత చిరంజీవి, త్రిష కాంబినేష‌న్‌లో సినిమా రాబోతుండ‌టం గ‌మ‌నార్హం.
విశ్వంభ‌ర‌లో త్రిష‌తో పాటు ఆషికా రంగ‌నాథ్ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆస్కార్ విన్న‌ర్ కీర‌వాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

రిలీజ్ ఆల‌స్యం....

విశ్వంభ‌ర మూవీ గ‌త ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది. కానీ వీఎఫ్ఎక్స్‌, గ్రాఫిక్స్ విష‌యంలో విమ‌ర్శ‌లు రావ‌డంతో మేక‌ర్స్ పోస్ట్‌పోన్ చేశాడు. జూలై 10న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానుంది. దాదాపు రెండు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో యూవీ క్రియేష‌న్స్ సంస్థ విశ్వంభ‌ర సినిమాను నిర్మిస్తోంది.

Advertisement
Advertisement