త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thalapathy Vijay | సిల్వ‌ర్ స్క్రీన్ టూ సీఎం సీట్ – రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన టాప్ స్టార్లు వీళ్లే

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ద‌ళ‌ప‌తి విజ‌య్ టీవీకే పార్టీ ఆధిక్యంలో కొన‌సాగుతోంది. అధికార డీఎంకేతో పాటు అన్నా డీఎంకేల‌కు షాకిస్తూ ద‌ళ‌ప‌తి విజ‌య్ టీవీకే పార్టీ ముందంజ‌లో ఉంది. విజ‌య్ త‌మిళ‌నాడు సీఎం కావ‌డం ఖాయ‌మంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌తంలో కొంద‌రు టాప్ సినిమా స్టార్లు సీఎంలుగా మారారు. వారు ఎవ‌రంటే?

N

Entertainment | Published On May 4, 2026, 11.55 am IST

Thalapathy Vijay | సిల్వ‌ర్ స్క్రీన్ టూ సీఎం సీట్ – రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన టాప్ స్టార్లు వీళ్లే
Advertisement

Thalapathy Vijay |  నేడు (సోమ‌వారం) ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. వీటిలో త‌మిళ‌నాడు ఎన్నిక‌ల రిజ‌ల్ట్ అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అధికార డీఎంకేతో పాటు అన్నా డీఎంకేల‌కు షాకిస్తూ ద‌ళ‌ప‌తి విజ‌య్ టీవీకే పార్టీ ఆధిక్యంలో కొన‌సాగుతోంది. ఎన్నిక‌ల్లో విజ‌య్ పోటీ చేయ‌డం ఇదే మొద‌టిసారి. కానీ జ‌నాల్లో అత‌డికి ఉన్న పాపులారిటీ, ప్రాబ‌ల్యం స్ఫ‌ష్టంగా ఈ ఎలెక్ష‌న్స్‌లో క‌నిపిస్తోంది. త‌మిళ‌నాడు నెక్స్ట్ సీఎం విజ‌య్ అంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

వివాదాలు...

విజ‌య్ పార్టీ టీవీకే పార్టీని నెల‌కొల్పిన త‌ర్వాత అనేక ఆటంకాలు ఎదుర‌య్యాయి. క‌రూర్ తొక్కిస‌లాట కేసు, సీబీఐ విచార‌ణ‌, జ‌న‌నాయ‌గ‌న్ సినిమా వాయిదా, విడాకుల కేసు...ఇలా ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి విజ‌య్‌ని వ‌రుస‌గా వివాదాలు వెంటాడాయి. ఈ వివాదాలు ఎన్నిక‌ల్లో విజ‌య్ ప‌ట్ల సింప‌థీని మ‌రింత పెంచాయి. కేవ‌లం త‌న సినిమా గ్లామ‌ర్‌పైనే ఆధార‌ప‌డ‌కుండా అణ‌గారిన వ‌ర్గాల స‌పోర్ట్‌ను సంపాదించుకోవ‌డం విజ‌య్ స‌క్సెస్ అయ్యారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో అధికార పార్టీ, ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై ఆరోప‌ణ‌ల‌ను ఎక్కువ‌గా చేయ‌కుండా కేవ‌లం ప్ర‌జ‌ల‌కు తానేం చేయ‌గ‌ల‌న‌నే విష‌యాల‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు. ఈ వ్యూహాలే విజ‌య్‌కి అనుకూలంగా మారాయ‌ని అంటున్నారు.

సీఎంలుగా మారిన టాప్ స్టార్స్‌...

ద‌ళ‌ప‌తి విజ‌య్ సీఎం కావ‌డం ఖాయ‌మ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌మిళ‌నాడులో హంగ్ ఏర్ప‌డిన కూడా విజ‌య్ సీఎం అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని అంటున్నారు.
గ‌తంలో కొంద‌రు సినిమాల నుంచి రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన టాప్ స్టార్లు సీఎంలుగా మారారు. అందులో త‌మిళ‌నాడు నుంచే ఎక్కువ‌గా ఉన్నారు.

ఎంజీఆర్‌...జ‌య‌ల‌లిత‌...

1960 -80 ద‌శ‌కంలో త‌మిళ‌నాడులో టాప్ హీరోగా కొనసాగారు ఎంజీఆర్‌. సినిమాలు చేస్తోండ‌గానే పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎంజీఆర్ 1975లో ఏఐఎడిఎంకె పార్టీని స్థాపించారు. త‌న‌కున్న ప్ర‌జాబ‌లం, పాపులారిటీతో 1977లో త‌మిళ‌నాడు సీఎం అయ్యారు. ముఖ్య‌మంత్రిగా మారిన తొలి సినీ న‌టుడిగా చ‌రిత్ర‌ను సృష్టించారు.
ఎంజీఆర్ త‌ర్వాత త‌మిళ‌నాడు సీఎంగా ఎన్నికైన సినీ యాక్ట‌ర్‌గా జ‌య‌ల‌లిత నిలిచింది. త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో అగ్ర క‌థానాయిక‌గా పేరు తెచ్చుకున్న జ‌య‌ల‌లిత కూడా చాలా కాలం పాటు సీఎంగా కొన‌సాగారు.

ఎన్టీఆర్‌...

టాలీవుడ్‌లో ఎన్నో చిర‌స్మ‌ర‌ణీయ సినిమాలు, పాత్ర‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో నిలిచిపోయారు ఎన్టీఆర్‌. సినిమాల‌తో వ‌చ్చిన పాపులారిటీతో రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్‌ తెలుగు నాట ముఖ్య‌మంత్రిగా మారిన తొలి సినిమా స్టార్‌గా నిలిచారు. టీడీపీ పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ బ‌ల‌మైన రాజ‌కీయ శ‌క్తిగా ఎదిగారు. ఎన్టీఆర్ త‌ర్వాత రాజకీయాల్లో ఉన్నత ప‌ద‌విని చేప‌ట్టిన సినీ న‌టుడిగా మెగా హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిలిచారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా కొన‌సాగుతోన్నారు.

Advertisement
Advertisement