త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TVK Chief Vijay | గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన విజ‌య్‌.. రెండు వారాల్లో మెజారిటీ నిరూపించుకుంటా

TVK Chief Vijay | త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ను టీవీకే చీఫ్ విజ‌య్ క‌లిశారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన మ‌ద్ద‌తు త‌నకు ఉంద‌ని తెలిపారు. ఈ మేర‌కు 112 మంది ఎమ్మెల్యేలు సంత‌కాలు చేసిన లేఖ‌ను గ‌వ‌ర్న‌ర్‌కు అంద‌జేశారు. రెండు వారాల్లో అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకుంటామ‌ని విజ‌య్ త‌న లేఖ‌లో పేర్కొన్నారు.

D

National | Published On May 6, 2026, 4.36 pm IST

TVK Chief Vijay | గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన విజ‌య్‌.. రెండు వారాల్లో మెజారిటీ నిరూపించుకుంటా
Advertisement
  • ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన మ‌ద్ద‌తు ఉంది
  • రెండు వారాల్లో మెజారిటీ నిరూపించుకుంటా
  • మే 7 లేదా మే 8న ప్ర‌మాణ స్వీకారం
  • 5 వేల మందికి పాసులు జారీ

TVK Chief Vijay | త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ను టీవీకే చీఫ్ విజ‌య్ క‌లిశారు. ఇవాళ మ‌ధ్యాహ్నం 3:30 గంట‌ల‌కు లోక్‌భ‌వ‌న్‌కు చేరుకున్న విజ‌య్‌.. గ‌వ‌ర్న‌ర్‌తో భేటీ అయ్యారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన మ‌ద్ద‌తు త‌నకు ఉంద‌ని తెలిపారు. ఈ మేర‌కు మెజారిటీకి 118 మంది అవ‌స‌రం కాగా.. 112 మంది ఎమ్మెల్యేలు సంత‌కాలు చేసిన లేఖ‌ను గ‌వ‌ర్న‌ర్‌కు అంద‌జేశారు. త‌మ పార్టీకి త‌గినంత బ‌లం ఉంద‌ని చెప్పారు. రెండు వారాల్లో అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకుంటామ‌ని విజ‌య్ త‌న లేఖ‌లో పేర్కొన్నారు.

విజ‌య్‌కి అభ‌య‌"హ‌స్తం"..

అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే.. ప్ర‌భుత్వ ఏర్పాటుకు అడుగు దూరంలో ఉంది. 10 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు అవ‌స‌రం ఏర్ప‌డింది. దీంతో మ్యాజిక్ ఫిగర్ కోసం విజ‌య్‌ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోర‌గా.. అందుకు హ‌స్తం పార్టీ అంగీక‌రించింది. బుధవారం చెన్నైలోని టీవీకే కార్యాలయానికి వచ్చిన హస్తం పార్టీ నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు సహకారం అందించేందుకు ముందుకురాగా.. విజయ్ వారి నిర్ణయాన్ని ఆహ్వానించారు. టీవీకేకి మ‌ద్ద‌తిస్తున్న‌ట్లు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారికంగా ప్ర‌కటించింది. అయితే, మతతత్వ శక్తులను కూటమికి దూరంగా ఉంచాల‌ని హ‌స్తం పార్టీ త‌న ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేసింది.

ఇంకా ఐదుగురు ఎమ్మెల్యేలు అవ‌స‌రం..

కాంగ్రెస్‌కు ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్ర‌మే ఉన్నారు. హ‌స్తం పార్టీ మ‌ద్ద‌తిస్తే టీవీకే బ‌లం 113కి పెరుగుతుంది. ఇంకా ఐదుగురి మ‌ద్ద‌తు కావాల్సి ఉంటుంది. ఇందుకోసం టీవీకే.. వీసీకే (2), సీపీఎం (2), సీపీఐ (2), ఐయూఎంఎల్ వంటి ఇత‌ర చిన్న ప్రాంతీయ పార్టీల మ‌ద్ద‌తు కోసం ప్ర‌య‌త్నిస్తోంది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు మ‌ద్ద‌తు ఇవ్వాలంటూ టీవీకే చీఫ్ విజ‌య్ ఆయా పార్టీల‌ను కోరుతున్నారు. అటు ఏఐఏడీఎంకే కూడా టీవీకేతో పొత్తుకు సిద్ధ‌మైంది. దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు విజ‌య్ పార్టీవైపు మొగ్గు చూపారు. అయితే, కాంగ్రెస్‌తో టీవీకేకి పొత్తు కుద‌ర‌డంతో ఏఐఏడీఎంకే పున‌రాలోచ‌న‌లో ప‌డింది.

ప్ర‌మాణ‌స్వీకారం ఎప్పుడంటే..?

విజ‌య్ సీఎంగా ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మానికి ముమ్మ‌రంగా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. మే 7వ తేదీ లేదా మే 8వ తేదీన ప్ర‌మాణ స్వీకారం ఉంటుంద‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. నెహ్రూ స్టేడియంలో ప్రమాణస్వీకారం ఉంటుంద‌ని పేర్కొన్నాయి. సుమారు 5 వేల మందికి పాసులు జారీ చేసిన‌ట్లు తెలిసింది.

రాహుల్‌కు ఆహ్వానం..

విజ‌య్ ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ హాజ‌రుకానున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు త‌మిళ‌నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్‌కు ఆహ్వానం అందిన‌ట్లు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. అయితే, ఈ ప్రమాణ స్వీకారోత్స‌వ‌ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరవుతారా..? లేదా..? అనే అంశంపై స్ప‌ష్ట‌త లేదు.

సీఎంగా ఆ ఫైల్‌పైనే తొలిసంత‌కం..!

ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం "వెట్రి పయణం పథకం" అమలు కోసం విజ‌య్ తొలి సంత‌కం చేయ‌నున్న‌ట్లు తెలిసింది. ఈ ప‌థ‌కం మహిళా సాధికారత, వారి భద్రతకు ఉద్దేశించిన‌ది. రాష్ట్రంలోని ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయంతోపాటూ ఈ పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందజేస్తామని విజ‌య్ ప్ర‌క‌టించారు.

Also Read..

కాంగ్రెస్ పార్టీ న‌య‌వంచ‌న‌కు నాలుగేళ్లు : కేటీఆర్

డీఎంకే ఓట‌మి.. స్టాలిన్‌ను క‌లిసిన సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌

అల్లాహు అక్బ‌ర్ అంటే డ‌బ్బులు వ‌స్తాయా? మంత్రి కొండా సురేఖకు రాచంద‌ర్‌రావు కౌంట‌ర్‌

Advertisement
Advertisement