త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MK Stalin | డీఎంకే ఓట‌మి.. స్టాలిన్‌ను క‌లిసిన సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌

MK Stalin | డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఓట‌మి నేప‌థ్యంలో సానుభూతి తెలిపారు. కష్ట స‌మ‌యంలో అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు.

D

National | Published On May 6, 2026, 3.35 pm IST

MK Stalin | డీఎంకే ఓట‌మి.. స్టాలిన్‌ను క‌లిసిన సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌
Advertisement

MK Stalin | డీఎంకే (DMK) అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin)ను త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ (Rajinikanth) మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఇవాళ మ‌ధ్యాహ్నం చెన్నైలోని అల్వాల్‌పేట‌లో గ‌ల‌ స్టాలిన్ నివాసానికి వెళ్లిన త‌లైవా.. డీఎంకే అధినేత‌తో భేటీ అయ్యారు. ఇటీవ‌లే జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ ఓట‌మి నేప‌థ్యంలో సానుభూతి తెలియ‌జేశారు. ఈ మేర‌కు స్టాలిన్‌కు ధైర్యం చెప్పారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అండగా ఉంటాన‌ని రజినీకాంత్ హామీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. రాష్ట్రంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్న వేళ స్టాలిన్‌ను ర‌జినీకాంత్ క‌ల‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

234 సభ్యులున్న త‌మిళ‌నాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఎన్నిక‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. మొన్న‌వెలువ‌డిన ఫ‌లితాల్లో విజ‌య్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ఊహించిన రీతిలో భారీ విజ‌యం న‌మోదు చేసింది. ఏకంగా 108 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక ఈ ఎన్నిక‌ల్లో డీఎంకే 59 స్థానాల్లో గెలుపొందింది. చెన్నై కొళత్తూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్టాలిన్‌.. అక్క‌డ టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో 8,700 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో సీఎం ప‌ద‌వికి స్టాలిన్ రాజీనామా చేశారు.

Also Read..

ఎల్పీజీ సిలిండ‌ర్ల‌ను క‌బోర్డ్స్‌లో ఉంచుతున్నారా..? వేస‌వి కాలంలో ఈ జాగ్ర‌త్త‌లు మ‌స్ట్‌

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. మెట్రో రెండో ద‌శ ప‌నుల‌పై కేంద్ర మంత్రితో చ‌ర్చ‌లు

అర్ధరాత్రి 40 మంది పోకిరీలకు సుమతీ దండకం...

Advertisement
Advertisement