త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | కాంగ్రెస్ పార్టీ న‌య‌వంచ‌న‌కు నాలుగేళ్లు : కేటీఆర్

KTR | రైతు డిక్ల‌రేష‌న్ పేరిట రైతును మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ న‌య‌వంచ‌న‌కు నేటితో నాలుగేళ్లు నిండింద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రైతు డిక్ల‌రేష‌న్ మోసాల‌ను ఎండ‌గ‌డుతూ.. వ‌రంగ‌ల్ జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు సంగ్రామ స‌ద‌స్సుకు కేటీఆర్ హాజ‌రై ప్ర‌సంగించారు.

S

Telangana | Published On May 6, 2026, 4.25 pm IST

KTR | కాంగ్రెస్ పార్టీ న‌య‌వంచ‌న‌కు నాలుగేళ్లు : కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : రైతు డిక్ల‌రేష‌న్ పేరిట రైతును మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ న‌య‌వంచ‌న‌కు నేటితో నాలుగేళ్లు నిండింద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రైతు డిక్ల‌రేష‌న్ మోసాల‌ను ఎండ‌గ‌డుతూ.. వ‌రంగ‌ల్ జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు సంగ్రామ స‌ద‌స్సుకు కేటీఆర్ హాజ‌రై ప్ర‌సంగించారు.

ఓరుగ‌ల్లుకు వందనం.. పోరుగ‌ల్లుకు వంద‌నం.. గ్రామ‌గ్రామం నుంచి ఈ రైతు సంగ్రామ స‌ద‌స్సుకు త‌ర‌లివ‌చ్చినందుకు ప్ర‌తి రైతన్నకు ధ‌న్య‌వాదం. స‌రిగ్గా ఈ రోజుతో న‌య‌వంచ‌న‌కు నాలుగేళ్లు నిండింది. ఇది కాక‌తీయ పౌరుషాల గ‌డ్డ‌. ఇది కాళోజీ ఆత్మ‌గౌర‌వ గ‌డ్డ‌, జ‌య‌శంక‌ర్ సార్ పుట్టిన గ‌డ్డ ఈ ఓరుగ‌ల్లు. పోరాటాల విల్లు ఎక్కుపెడితే ద్రోహుల‌కు గుండె ఝ‌ల్లుమంట‌ది. ఉద్య‌మ స‌మ‌యంలో వ‌రంగ‌ల్ క‌దం తొక్కింది. ఆ రోజుల్లో కాగ‌డా ప‌ట్టుకుని క‌వాతు చేసినం. ఏ ప‌ని ఇక్క‌డ మొద‌లుపెట్టినా విజ‌య‌వంతం అవుతుంద‌ని కేసీఆర్ విశ్వాసం. మ‌హాగ‌ర్జ‌న‌, ర‌జ‌తోత్స‌వ స‌భ‌.. ఇక్క‌డే పెట్టాం అని కేటీఆర్ గుర్తు చేశారు.

కాళోజీ ఒక మాట చెప్పారు.. మ‌రిచిపోకుండా గుర్తుంచుకోవాలె.. క‌సి ఆర‌కుండా బుస‌కొట్టుచుండాలె. కాలంబు రాగానే కాటేసి తీరాలే. ఆ కాళ‌న్న స్ఫూర్తితో రైత‌న్న‌కు జ‌రిగిన మోసాన్ని, ద్రోహాన్ని గుర్తు చేసేందుకు ఈ స‌ద‌స్సు పెట్టుకున్నాం. కాంగ్రెస్ పార్టీ పెద్ద‌లు వ‌చ్చారు నాలుగేళ్ల క్రితం. వాళ్లు పెద్ద‌లు కాదు దొంగ‌లు. కొంగ‌జ‌పం చేసి నాలుగేండ్ల కింద న‌క్క విన‌యాలు ప్ర‌ద‌ర్శించి రైతుల‌ను మోసం చేశారు. ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ.. గ‌ల్లీలో ఉండే తొట్టిగ్యాంగ్‌ను వెంట పెట్టుకుని వ‌చ్చి రైతుల‌ను ఉద్ధ‌రిస్తామ‌ని చెప్పారు. వ‌రంగ‌ల్ రైతు డిక్ల‌రేష‌న్ సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.

సరిగ్గా నాలుగేళ్ల కింద‌ట‌.. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ఇత‌ర నేత‌లు మాట్లాడిన మాట‌లు వింటుంటే.. వెయ్యి ఎలుక‌లు తిన్న పిల్లి కాశీకి పోయిన‌ట్టు, నూరు గొడ్ల‌ను తిన్న రాబందు గోపూజ చేసిన‌ట్టు.. వ‌రంగ‌ల్ రైతుల డిక్ల‌రేష‌న్ అని ఒక ప‌త్రాన్ని విడుద‌ల చేశారు. రైతుల ర‌క్తం తాగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.. రైతుల‌కు కిరిటీం పెడుతామ‌ని క‌ల్ల‌బొల్లి మాట‌ల‌తో 34 హామీలు ఇచ్చారు. డిక్ల‌రేష‌న్లు, గ్యారెంటీ కార్డులు చెప్పి ఓట్లు దొబ్బారు అని కేటీఆర్ మండిప‌డ్డారు.

Advertisement
Advertisement