త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchandra Rao | అల్లాహు అక్బ‌ర్ అంటే డ‌బ్బులు వ‌స్తాయా? మంత్రి కొండా సురేఖకు రాచంద‌ర్‌రావు కౌంట‌ర్‌

P

Telangana | Published On May 6, 2026, 3.04 pm IST

Ramchandra Rao | అల్లాహు అక్బ‌ర్ అంటే డ‌బ్బులు వ‌స్తాయా? మంత్రి కొండా సురేఖకు రాచంద‌ర్‌రావు కౌంట‌ర్‌
Advertisement

Ramchandra Rao | రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌కు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. జై శ్రీరాం అంటే పై నుంచి పైసలు పడుతున్నాయా.. పథకాలు వస్తున్నాయా అంటూ చేసిన వ్యాఖ్య‌ల‌కు దీటుగా బ‌దులిచ్చారు. జై శ్రీ‌రామ్ కాదు.. అల్లాహు అక్బ‌ర్ అంటే డ‌బ్బులు వ‌స్తాయా? అంటూ ప్ర‌శ్నించారు. కేవ‌లం హిందూ దేవీదేవ‌త‌లు, స‌నాత‌న ధ‌ర్మంపై విశ్వాసం లేని వ్య‌క్తులు అడ్డ‌గోలు వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. గ‌తంలో స్టాలిన్‌, ఆయ‌న కొడుకు ఉద‌య‌నిధి స‌నాత‌న ధ‌ర్మం, హిందువుల‌ను అవ‌మాన‌ప‌రిస్తే త‌మిళ ప్ర‌జ‌లు వారికి ఎన్నిక‌ల్లో బుద్ధి చెప్పార‌న్నారు. బెంగాల్‌లో సైతం మ‌మ‌తా బెన‌ర్జీ హిందువులు, హిందూ సంస్కృతి, స‌నాత‌న ధ‌ర్మంపై అడ్డ‌గోలుగా మాట్లాడినందుకు ప్ర‌జ‌లు ఆమెను ఓడించార‌న్నారు.

ఈ రోజు తెలంగాణ‌లో కూడా కాంగ్రెస్ నేత‌లు హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా వ్యాఖ్యానించ‌డాన్ని బీజేపీ ఖండిస్తుంద‌న్నారు. దేవ‌త‌లు, హిందుమ‌తంపై విశ్వాసం లేని వ్య‌క్తుల‌కు దేవాదాయ‌శాఖ మంత్రి ప‌ద‌విలో కొన‌సాగే అర్హ‌త లేద‌న్నారు. ఈ విష‌యంలో కాంగ్రెస్ అధిష్టానంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి ఈ విష‌యంలో నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోరారు. రాష్ట్రంతో పాటు యావ‌త్ దేశంలోని హిందువుల‌కు మంత్రి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. అయితే, వ‌క్రీక‌రించారంటూ మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆమె చేసిన వ్యాఖ్య‌లు వీడియోల్లో స్ప‌ష్టంగా వినిపించాయ‌ని.. ఇదంతా ప్ర‌జ‌లు చూశార‌న్నారు. ఆమె వ్యాఖ్య‌ల‌ను ఎవ‌రూ వ‌క్రీక‌రించ‌లేదు.. మంత్రే వ్యంగ్యంగా మాట్లాడ‌ర‌ని ఆరోపించారు. శ్రీ‌రాముడు అంటే డ‌బ్బులు వ‌స్తాయా? అని మాట్లాడింద‌ని.. మ‌రి అల్లాహు అక్బ‌ర్ అంటే డ‌బ్బులు వ‌స్తాయా? అని మంత్రిని ప్ర‌శ్నించారు. అల్లా హో అక్బ‌ర్ అంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వ‌స్తుండొచ్చ‌ని.. కానీ శ్రీ‌రాముడిపై వ్యాఖ్య‌ల‌ను స‌హించేది లేద‌న్నారు. ఇలాంటి కామెంట్స్ చేస్తే రాష్ట్ర ప్ర‌జ‌లు ఊరుకోర‌న్నారు.

Advertisement
Advertisement