TMC | టీఎంసీకి మరో షాక్.. రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాజీనామా
TMC | పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ (Sukhendu Sekhar Ray) టీఎంసీకి గుడ్‌బై చెప్పారు. రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేశారు. దీదీ నేతృత్వంలోని తృణమూల్ పాలనలో అడ్డూ అదుపూ లేని అవినీతి జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
TMC | అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అంతర్గత తిరుగుబాటుతో సతమతమవుతున్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)కి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ (Sukhendu Sekhar Ray) టీఎంసీకి గుడ్‌బై చెప్పారు. తృణమూల్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతేకాదు తన రాజ్యసభ పదవికి (Rajya Sabha MP) కూడా ఆయన రాజీనామా చేశారు. ఇవాళ ఉదయం పార్లమెంట్‌కు చేరుకుని తన రాజీనామా లేఖను సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన సంచలన ప్రకటన చేశారు. దీదీ నేతృత్వంలోని తృణమూల్ పాలనలో అడ్డూ అదుపూ లేని అవినీతి జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. "అడ్డూ అదుపూ లేని అవినీతి. మహిళలపై జరిగిన దారుణాలు.. ఆరోగ్యం, విద్య, పరిశ్రమలు, శాంతిభద్రతలు, ఉపాధి వంటి రంగాల్లో ఘోర వైఫల్యంతో విసిగిపోయిన బెంగాల్ ప్రజలు.. తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల అరాచక పాలనకు స్వస్తి పలికారు. రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా బీజేపీకి అనుకూలంగా భారీ తీర్పును ఇచ్చారు" అని రాయ్ పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పును గౌరవిస్తూ.. రాజ్యసభ సభ్యత్వానికి, తృణమూల్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా సువేందు అధికారి నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వానికి శుభకాంక్షలు తెలిపారు.
Also Read..
ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సిగ్గుచేటు.. రేవంత్‌పై పినరయి విజయన్ ఫైర్
వెంటనే ఇరాన్‌ను వీడండి.. తమ పౌరులకు భారత్ కీలక అడ్వైజరీ
గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందతో చెస్ ఆడిన తమిళననాడు సీఎం విజయ్
సంబంధిత వార్తలు

Taslima Nasrin | 19 ఏళ్ల తర్వాత.. కోల్‌కతాలో అడుగుపెట్టిన తస్లీమా
జులై 31, 2026

Ex Bus Driver | షాకింగ్.. మాజీ బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.28 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం
జులై 30, 2026

Green India Challenge | మడ అడవుల్లో మరో 10వేల మొక్కలు.. సుందర్బన్స్కు అండగా గ్రీన్ ఇండియా చాలెంజ్
జులై 27, 2026
తాజావార్తలు
- ●Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!
- ●Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు
- ●CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
- ●Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం
- ●Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం
- ●TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!

Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!

Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు

CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం



