త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ritabrata Banerjee | బెంగాల్ విపక్ష నేత పదవిని కోల్పోయిన రితబ్రత బెనర్జీ.. మమతకు భారీ విజ‌యం

Ritabrata Banerjee | తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) రెబల్ వర్గానికి కలకత్తా హైకోర్టు (Calcutta High Court)లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత (LoP)గా రితబ్రత బెనర్జీ (Ritabrata Banerjee) నియామకాన్ని ర‌ద్దు చేస్తూ శుక్ర‌వారం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. మ‌మ‌త (Mamata Banerjee) వ‌ర్గం వాద‌న‌ల‌ను మ‌రోసారి ప‌రిశీలించాల‌ని అసెంబ్లీ స్పీక‌ర్ ర‌థీంద్ర బోస్‌ను ఆదేశించింది.

D

National | Published On Nov 27, 2026, 6.06 pm IST

Ritabrata Banerjee | బెంగాల్ విపక్ష నేత పదవిని కోల్పోయిన రితబ్రత బెనర్జీ.. మమతకు భారీ విజ‌యం
Advertisement

Ritabrata Banerjee | త్రినేత్ర న్యూస్ : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) రెబల్ వర్గానికి కలకత్తా హైకోర్టు (Calcutta High Court)లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత (LoP)గా రితబ్రత బెనర్జీ (Ritabrata Banerjee) నియామకాన్ని ర‌ద్దు చేస్తూ శుక్ర‌వారం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. అంతేకాదు, చీఫ్ విప్‌గా ఎమ్మెల్యే అఖ్రుజ్జమాన్ (MLA Akkhruzzaman) నియామకాన్ని కూడా న్యాయస్థానం పక్కన పెట్టింది.

స్పీకర్ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధంగా లేదని జస్టిస్ కృష్ణ రావుతో కూడిన ఏకసభ్య ధర్మాసనం స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు మ‌మ‌త (Mamata Banerjee) వ‌ర్గం వాద‌న‌ల‌ను మ‌రోసారి ప‌రిశీలించాల‌ని అసెంబ్లీ స్పీక‌ర్ ర‌థీంద్ర బోస్‌ను ఆదేశించింది. అలాగే ప్రతిపక్ష నాయకుడి నియామ‌కంపై 10 రోజుల్లోగా కొత్త ఉత్తర్వులను జారీ చేయాలని గ‌డువు విధించింది. పార్టీ త‌ర‌ఫున త‌న‌ను విప‌క్ష నేత‌గా నామినేట్ చేసిన‌ప్ప‌టికీ.. రిత‌బ్ర‌త‌కు ఆ ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డాన్ని స‌వాల్ చేస్తూ దీదీ వ‌ర్గానికి చెందిన శోభ‌న్‌దేబ్ ఛ‌టోపాధ్యాయ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన ధ‌ర్మాస‌నం ఈ మేర‌కు తీర్పు వెలువ‌రించింది.

కాగా, ఈ ఏడాది మేలో జ‌రిగిన ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో (West Bengal Assembly election) మ‌మ‌త నేతృత్వంలోని టీఎంసీ ఘోర ప‌రాజ‌యం పాలైన విష‌యం తెలిసిందే. మ‌మ‌తా బెన‌ర్జీ 15 ఏళ్ల పాల‌న‌కు తెర‌దించుతూ.. సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ఘ‌న విజ‌యం సాధించింది. తాను పోటీ చేసిన భవానీపూర్‌ నియోజకవర్గంలో (Bhabanipur assembly seat) సువేందు అధికారి (Suvendu Adhikari) చేతిలో దీదీ ఘోర ఓట‌మి చ‌విచూడాల్సి వ‌చ్చింది. ఈ ఓట‌మితో పార్టీ రెండు వ‌ర్గాలుగా చీలిపోయింది.

మొత్తం 80 మంది ఎమ్మెల్యేల్లో 59 మందితో క‌లిసి రిత‌బ్ర‌త తిరుగుబాటు చేసి 'డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్' పేరుతో ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేశారు. తమదే అసలైన టీఎంసీ అని ప్రకటించుకోవడంతో జూన్ 3న స్పీకర్ ఆయనను విపక్ష నేతగా గుర్తించారు. అయితే, మే6న జ‌రిగిన శాస‌న‌స‌భా ప‌క్ష స‌మావేశంలో సుమారు 70 మంది ఎమ్మెల్యేల ఆమోదంతో త‌న‌ను విప‌క్ష నేత‌గా ఎన్నుకున్నార‌ని శోభ‌న్‌దేబ్ త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. కోర్టు తీర్పుతో ప‌ది రోజుల్లో ప్ర‌తిప‌క్ష నేత ఎవ‌ర‌న్న‌ది స్పీక‌ర్ తేల్చ‌నున్నారు.

Also Read..

న్యాయ‌మూర్తుల నియామ‌కాల్లో ఒకే వర్గానికి కొలీజియం పెద్దపీట : మాజీ సీజేఐ జస్టిస్ గవాయ్

మళ్లీ హిట్‌మ్యాన్ చేతికి ముంబ‌యి పగ్గాలు!

పోలీసు క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భ‌ర్తీ.. వివ‌రాలివే..!

Advertisement
Advertisement