త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bisleri water | బిస్ల‌రీ నీటిలో కోలిఫామ్ బ్యాక్టీరియా.. ప్రాసిక్యూషన్‌కు FSSAI అనుమ‌తి

Bisleri water | ప్ర‌ముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్‌ వాటర్ బ్రాండ్ బిస్ల‌రీ (Bisleri water) వివాదంలో చిక్కుకుంది. బెంగాల్ ప్లాంట్ నుంచి సేక‌రించిన న‌మూనాల్లో హానికరమైన కోలిఫామ్ బ్యాక్టీరియా (Coliform bacteria) ఉన్నట్లు తేలింది. దీంతో బిస్లరీ ఇంటర్నేషనల్‌పై ప్రాసిక్యూషన్‌కు ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమ‌తి ఇచ్చింది.

D

National | Published On Nov 28, 2026, 1.23 pm IST

Bisleri water | బిస్ల‌రీ నీటిలో కోలిఫామ్ బ్యాక్టీరియా.. ప్రాసిక్యూషన్‌కు FSSAI అనుమ‌తి
Advertisement

Bisleri water | త్రినేత్ర న్యూస్ : దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్‌ వాటర్ బ్రాండ్ బిస్ల‌రీ (Bisleri water) వివాదంలో చిక్కుకుంది. ఇటీవ‌లే గోవా త‌యారీ కేంద్రం నుంచి సేక‌రించిన శాంపిల్స్‌లో బ్రోమేట్ స్థాయి నిర్ణీత ప‌రిమితి కంటే కొంచెం ఎక్కువగా ఉన్నట్లు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) గుర్తించిన విష‌యం తెలిసిందే. అయితే, తాజాగా బెంగాల్ ప్లాంట్ నుంచి సేక‌రించిన న‌మూనాల్లో హానికరమైన కోలిఫామ్ బ్యాక్టీరియా (Coliform bacteria) ఉన్నట్లు తేలింది.

ప‌శ్చిమ‌ బంగాల్​ (West Bengal)లోని జల్పాయ్‌గురి (Jalpaiguri) జిల్లా తేలిపారా (Telipara) గ్రామంలో ఉన్న బిస్లరీ ప్లాంట్‌ నుంచి బ్యాచ్ నంబర్ PB 201 ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ నమూనాను FSSAI సేకరించింది. వాటిని టెస్ట్‌కు పంప‌గా.. ఆ నమూనాలో కోలిఫామ్ బ్యాక్టీరియా ఉన్నట్లు ప్రాథమిక ప్రయోగశాల పరీక్షల్లో తేలింది. దీంతో శాంపిల్స్‌ను రెఫరల్‌ ల్యాబ్‌కు పంపగా అక్కడ కూడా బ్యాక్టీరియా ఉనికి నిర్ధారణ అవ‌డంతో.. ఆగస్టు 12న ఆ ఒక్క బ్యాచ్ అమ్మకాలను FSSAI నిషేధిస్తూ సంస్థ‌కు నోటీసులు జారీ చేసింది. తాజాగా ఈ వ్య‌వ‌హారంపై బిస్లరీ ఇంటర్నేషనల్‌పై ప్రాసిక్యూషన్‌కు ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమ‌తి ఇచ్చింది.

బిస్ల‌రీ స్పంద‌న‌..

ఈ నేప‌థ్యంలో తాజా వ్య‌వ‌హారంపై బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ శనివారం ప్రకటన విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లా తేలిపారా ప్లాంట్‌లో తయారైన PB201 బ్యాచ్‌కు సంబంధించిన నమూనాల్లోనే ఈ సమస్య తలెత్తినట్లు తెలిపింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాల మేరకు ఆగస్టు 12నే ఆ బ్యాచ్‌ను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రాథమిక, రిఫరల్ ల్యాబ్‌లలో కోలిఫామ్ బ్యాక్టీరియా ఉన్నట్లు నివేదికలు వచ్చినప్పటికీ.. తాము అదే బ్యాచ్‌కు చెందిన న‌మూనాల‌ను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గుర్తింపు పొందిన రెండు వేర్వేరు స్వతంత్ర ప్రయోగశాలల్లో ప‌రీక్షించిన‌ట్లు బిస్ల‌రీ తెలిపింది. ఆ రెండు ల్యాబ్‌లలోనూ తమ నీరు అన్ని ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా, సురక్షితంగా ఉన్నట్లు ఫలితాలు వచ్చాయని పేర్కొంది.

ప్రభుత్వ ల్యాబ్‌లు, స్వతంత్ర ల్యాబ్‌ల ఫలితాల మధ్య ఉన్న ఈ వ్యత్యాసంపై సమగ్ర సమీక్ష జరపాలని FSSAIను బిస్ల‌రీ కోరింది. నమూనాల సేకరణ విధానం, పరీక్షా పద్ధతులను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. తాము 10 దశల తయారీ ప్రక్రియలో 90కి పైగా నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తామని, వినియోగదారుల ఆరోగ్య భద్రతకే తమ మొదటి ప్రాధాన్యతని సంస్థ పునరుద్ఘాటించింది.

Also Read..

మురుగ‌న్‌దే విజ‌యం.. దీపం వివాదం వేళ‌ ప్ర‌ధాని ఆస‌క్తిక‌ర పోస్ట్‌

మోదీ కేబినెట్‌లోకి సుప్రియా సూలే..? డీలిమిటేష‌న్ మ‌ద్ద‌తు ప్ర‌తిఫ‌లంగా ఎన్సీపీకి కీల‌క ప‌ద‌వులు..!

మోదీ స‌ర్కార్‌కు బూస్ట్‌.. డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు.. యూటర్న్ వెనుక అసలు కారణమిదే..!

Advertisement
Advertisement