Saayoni Ghosh | దీదీని ప్రధానిగా చూడాలనుకుంది.. కట్‌చేస్తే ఆ పార్టీలో భవిష్యత్తే లేదంటూ రెబల్ గ్రూప్‌లో చేరిన ఎంపీ
Saayoni Ghosh | మమతా బెనర్జీకి అత్యంత విధేయురాలిగా పేరున్న జాదవ్‌పూర్ లోక్‌సభ ఎంపీ (Trinamool MP) సాయోని ఘోష్ (Saayoni Ghosh) సైతం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆమె రెబల్ వర్గంలో చేరారు.
Saayoni Ghosh | పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ పార్టీలో అంతర్గత సంక్షోభం మరింత ముదిరింది. పలువురు నేతలు ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి షాకుల మీద షాకులిస్తున్నారు. ఇప్పటికే సుమారు 60 మంది ఎమ్మెల్యేలు, 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబావుటా ఎగురవేసిన విషయం తెలిసిందే. పలువురు రాజ్యసభ ఎంపీలు కూడా రాజీనామా చేశారు. ఈ క్రమంలో దీదీకి అత్యంత విధేయురాలిగా పేరున్న జాదవ్‌పూర్ లోక్‌సభ ఎంపీ (Trinamool MP) సాయోని ఘోష్ (Saayoni Ghosh) సైతం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆమె రెబల్ వర్గంలో చేరారు.
రెబల్ వర్గానికి నేతృత్వం వహిస్తున్న కాకోలి ఘోష్ దస్తీదార్‌ను సాయోని సంప్రదించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. రెబల్ వర్గానికి తన మద్దతు తెలియజేస్తూ.. సంతకం కూడా చేసినట్లు సమాచారం. తృణమూల్ కాంగ్రెస్‌లో తనకు రాజకీయ భవిష్యత్తు లేదని భావించిన సాయోని.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఎన్నికల ప్రచార సమయంలో తనపై వచ్చిన విమర్శలు, దాడులు జరిగినప్పుడు పార్టీ నాయకత్వం నుంచి మద్దతు లభించకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలిసింది. భవిష్యత్తులో మమతా బెనర్జీ ప్రధాని కావాలంటూ (Mamata Banerjee As Future PM) సాయోని బలంగా వాదించారు. అలాంటి నాయకురాలు ఇప్పుడు తిరుగుబాటు వర్గానికి మద్దతుగా సంతకం చేసి, ఢిల్లీలో మకాం వేయడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.
Also Read..
కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశం.. తప్పనిసరిగా హాజరుకావాలంటూ ఆదేశం
ఆ వివరాలు బయటపెట్టిన కోవర్ట్ ఎవరో ముందు తెలుసుకోండి.. కాంగ్రెస్‌పై బీఎల్ సంతోష్ ఫైర్
సంబంధిత వార్తలు

Mamata Banerjee | ఆ ద్రోహులకు పార్టీలోకి నో ఎంట్రీ.. బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలు ఏకంకావాలి : మమతా బెనర్జీ
జులై 21, 2026

Koel Mallick | దీదీకి షాక్.. రాజీనామా చేసిన మరో ఎంపీ
జులై 16, 2026

ED Freezes TMC Bank Accounts | తృణమూల్ కాంగ్రెస్‌కు ఈడీ బిగ్ షాక్.. రూ.440 కోట్ల ఖాతాలు ఫ్రీజ్, ఆ హెలికాప్టర్ కొనుగోళ్లే కొంపముంచాయా?
జులై 8, 2026
తాజావార్తలు
- ●Prajavani | ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Mrunal Thakur | తూచ్ ... అంతా వట్టిదే - టీమిండియా క్రికెటర్‌తో డేటింగ్ రూమర్లపై మృణాల్ టీమ్ క్లారిటీ
- ●B.Optometry | హెచ్‌సీయూలో 'ఆప్టోమెట్రీ' డిగ్రీ కోర్సు.. 'నీట్' మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు
- ●Akhilesh Yadav | మోదీని కాపాడేందుకే ప్రధాన్‌ను తొలగించారు : అఖిలేష్ యాదవ్
- ●Instagram | ఆగస్టు 25 నుంచి ఇన్స్టాగ్రామ్ బ్యాన్ ? నిజమేనా.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- ●Chanagani Dayakar | హైడ్రా వచ్చాక 3,350 ఎకరాల భూమి కాపాడింది.. బీఆర్ఎస్ ఆక్రమణలను కూల్చినందుకే ఈ దుష్ప్రచారం

Prajavani | ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్

Mrunal Thakur | తూచ్ ... అంతా వట్టిదే - టీమిండియా క్రికెటర్‌తో డేటింగ్ రూమర్లపై మృణాల్ టీమ్ క్లారిటీ

B.Optometry | హెచ్‌సీయూలో 'ఆప్టోమెట్రీ' డిగ్రీ కోర్సు.. 'నీట్' మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు

Akhilesh Yadav | మోదీని కాపాడేందుకే ప్రధాన్‌ను తొలగించారు : అఖిలేష్ యాదవ్



