త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mamata Banerjee | ఆ ద్రోహుల‌కు పార్టీలోకి నో ఎంట్రీ.. బీజేపీకి వ్య‌తిరేకంగా విప‌క్ష పార్టీలు ఏకంకావాలి : మ‌మ‌తా బెన‌ర్జీ

Mamata Banerjee | రెబ‌ల్ నేత‌ల‌ను తిరిగి పార్టీలోకి చేర్చుకునే ప్ర‌సక్తే లేద‌ని తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ (Mamata Banerjee) తేల్చి చెప్పారు. వారి స్థానాన్ని భ‌ర్తీ చేయ‌డానికి నా ద‌గ్గ‌ర చాలా మంది ఉన్నారని వ్యాఖ్యానించారు.

D

National | Published On Jul 21, 2026, 5.58 pm IST

Mamata Banerjee | ఆ ద్రోహుల‌కు పార్టీలోకి నో ఎంట్రీ.. బీజేపీకి వ్య‌తిరేకంగా విప‌క్ష పార్టీలు ఏకంకావాలి : మ‌మ‌తా బెన‌ర్జీ
Advertisement

Mamata Banerjee | తిరుగుబాటు నేత‌ల‌పై (TMC rebels) తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ (Mamata Banerjee) తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఆ ద్రోహుల‌ను తిరిగి పార్టీలోకి చేర్చుకునే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెప్పారు. కోల్‌క‌తాలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో దీదీ పాల్గొని మాట్లాడారు.

"నేను వారికి (టీఎంసీ రెబ‌ల్స్‌ను ఉద్దేశించి) ఓ స‌వాల్ విసురుతున్నాను. బీజేపీకి మ‌ద్ద‌తు ఇవ్వాల‌నుకునే వాళ్లు వెళ్లిపోవ‌చ్చు. వారంతా ఆ పార్టీలో చేరాలి. ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలుపొందాలి. ఈ విష‌యంలో నాకు ఎలాంటి అభ్యంత‌రం లేదు. పైగా నేను చాలా సంతోషిస్తాను. ఎంత మంది వెళ్తే నాకు అంత మంచిది. వారి స్థానాన్ని భ‌ర్తీ చేయ‌డానికి నా ద‌గ్గ‌ర చాలా మంది ఉన్నారు" అని మ‌మ‌తా బెన‌ర్జీ అస‌మ్మ‌తి వ‌ర్గాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

అదే స‌మ‌యంలో బెంగాల్‌లో బీజేపీకి (BJP in Bengal) వ్య‌తిరేకంగా విప‌క్ష పార్టీల‌న్నీ ఏకం కావాల‌ని దీదీ పిలుపునిచ్చారు. బీజేపీ వ్య‌తిరేక పోరాటం రాజకీయాల‌కు అతీత‌మ‌న్నారు. అదేవిధంగా నీట్ పేప‌ర్ లీక్‌కు నిర‌స‌న‌గా ఢిల్లీలో ఆందోళ‌న చేప‌డుతున్న కాక్రోచ్ జ‌న‌తా పార్టీకి త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ఈ సంద‌ర్భంగా దీదీ స్ప‌ష్టం చేశారు. అవ‌స‌ర‌మైతే ఢిల్లీకి వెళ్లి నిర‌స‌న‌ల్లో పాల్గొంటాన‌ని చెప్పారు.

Also Read..

విడుద‌ల కాని ఓయూ 'డిగ్రీ' ఫ‌లితాలు.. 'లా' అడ్మిష‌న్ల‌కు ఇక్క‌ట్లు..

ఢిల్లీలో కొన‌సాగుతున్న సీజేపీ నిర‌స‌న‌లు.. జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద‌కు శ‌ర‌ద్ ప‌వార్, అర‌వింద్ కేజ్రీవాల్‌

మోదీ రాజీనామా చేయాలి.. ప్ర‌ధాని ఇంటి ముందు బైఠాయించిన రాహుల్‌

Advertisement
Advertisement