త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mrunal Thakur | తూచ్ … అంతా వ‌ట్టిదే – టీమిండియా క్రికెట‌ర్‌తో డేటింగ్ రూమ‌ర్ల‌పై మృణాల్ టీమ్ క్లారిటీ

టీమిండియా క్రికెట‌ర్ య‌శ‌స్వి జైస్వాల్‌తో మృణాల్ ఠాకూర్ డేటింగ్‌లో ఉన్న‌ట్లు సోష‌ల్ మీడియాలో జోరుగా పుకార్లు వినిపిస్తున్నాయి. వీరిద్ద‌రి ఏజ్ గ్యాప్‌పై జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ రూమ‌ర్ల‌పై మృణాల్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రేమ వార్త‌ల‌న్నీ క‌ల్పితాలే అని తేల్చేశారు

N

Entertainment | Published On Jul 28, 2026, 5.22 pm IST

Mrunal Thakur | తూచ్ … అంతా వ‌ట్టిదే – టీమిండియా క్రికెట‌ర్‌తో డేటింగ్ రూమ‌ర్ల‌పై మృణాల్ టీమ్ క్లారిటీ
Advertisement

Mrunal Thakur |  గ‌త కొద్ది రోజులుగా సినిమాల‌తో కంటే ప్రేమ‌, పెళ్లి పుకార్ల‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తోంది మృణాల్ ఠాకూర్‌. కోలీవుడ్ హీరో ధ‌నుష్‌తో సీతారామం హీరోయిన్ ప్రేమ‌లో ఉందంటూ బ‌లంగా రూమ‌ర్స్ వినిపించాయి. ల‌వ‌ర్స్ డే రోజు వీరిద్ద‌రు పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. చివ‌ర‌కు ధ‌నుష్ త‌న‌కు అన్న‌య్య‌లాంటి వాడంటూ చెప్పిన మృణాల్ ఈ పుకార్ల‌కు పుల్‌స్టాప్ పెట్టింది.

టీమిండియా క్రికెట‌ర్‌...

తాజాగా టీమిండియా ఓపెన‌ర్‌ య‌శ‌స్వి జైస్వాల్‌తో మృణాల్ డేటింగ్ చేస్తోందంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు, ట్వీట్స్ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ముంబైలోని ఓ కేఫ్‌లో మృణాల్‌, య‌శ‌స్వి క‌నిపించ‌డంతో ఈ రూమ‌ర్లు మొద‌ల‌య్యాయి. కేఫ్ నుంచి య‌శ‌స్వి జైస్వాల్ బ‌య‌ట‌కు వ‌చ్చి కారులో వెళ్లిపోయాడు. అత‌డు వెళ్లి పోయిన కొద్ది నిమిషాల్లోనే మృణాల్ కూడా అదే కేఫ్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం సినీ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. వీరిద్ద‌రు జంట‌గానే ఆ కేఫ్‌లోకి అడుగుపెట్టార‌ని, మీడియాకు డౌట్ రాకుండా ఉండాల‌నే విడివిడిగా బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

సీక్రెట్ డేట్‌...

వీరిద్ద‌రి సీక్రెట్ డేట్‌ను క‌న్ఫామ్ చేస్తూ ప‌లువురు నెటిజ‌న్లు పోస్ట్‌లు పెడుతోన్నారు. ప్ర‌స్తుతం మృణాల్ వ‌య‌సు 33 ఏళ్లు కాగా...య‌శ‌స్వి ఇటీవ‌లే 24లోకి అడుగుపెట్టారు. ఇద్ద‌రి మ‌ధ్య ఏజ్ గ్యాప్ 9 తొమ్మిదేళ్లు ఉండ‌టంపై కూడా జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఓ ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌లో మృణాల్‌, య‌శ‌స్వి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారిన‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

అంతా అబ‌ద్ద‌మే...

ఈ డేటింగ్ రూమ‌ర్లు వైర‌ల్ కావ‌డంతో మృణాల్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. అవ‌న్నీ అబ‌ద్దాలేన‌ని తేల్చిచెప్పింది. య‌శ‌స్వి జైస్వాల్‌తో మృణాల్‌కు అస‌లు ప‌రిచ‌య‌మే లేద‌ని వెల్ల‌డించారు. మృణాల్, య‌శ‌స్వి వేర్వేరుగా ఆ కేఫ్‌లోకి వెళ్లార‌ని చెప్పారు . య‌శ‌స్వి వెళ్లిపోయిన‌ చాలా స‌మ‌యం త‌ర్వాత మృణాల్ ఆ కేఫ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని, కానీ ఎవ‌రో ఎడిట్ చేసి ఇంచుమించు ఒకే టైమ్‌కు ఇద్ద‌రు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు ఫేక్ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశార‌ని మృణాల్ టీమ్ పేర్కొన్న‌ది.

రాకాలో హీరోయిన్‌...

ప్ర‌స్తుతం అల్లు అర్జున్ రాకాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది మృణాల్ ఠాకూర్‌. ఇందులో మృణాల్‌తో పాటు దీపికా ప‌డుకోణ్‌, ర‌ష్మిక మంద‌న్న‌, జాన్వీ క‌పూర్ కూడా క‌థానాయిక‌లుగా క‌నిపించ‌బోతున్నారు.

.

Advertisement
Advertisement