Chanagani Dayakar | హైడ్రా వచ్చాక 3,350 ఎకరాల భూమి కాపాడింది.. బీఆర్ఎస్ ఆక్రమణలను కూల్చినందుకే ఈ దుష్ప్రచారం
Chanagani Dayakar | హైడ్రా వచ్చాక 3,350 ఎకరాలు కాపాడిన ఘనత దానికే దక్కిందని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ తెలిపారు. అవినీతి, ఆక్రమణదారులకే హైడ్రా అంటే గిట్టదన్నారు. బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
- హైడ్రాకు ప్రజల మద్దతు ఉంది.. అవినీతి, ఆక్రమణదారులకే ఇదంటే గిట్టదు
- బీఆర్ఎస్ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు
- టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ విమర్శలు
Chanagani Dayakar | త్రినేత్ర.న్యూస్: హైడ్రా వచ్చాక 3,350 ఎకరాలు కాపాడిన ఘనత దానికే దక్కిందని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ తెలిపారు. అవినీతి, ఆక్రమణదారులకే హైడ్రా అంటే గిట్టదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటు చేసినందుకు పేదలు, కాలనీవాసులు, వెల్ఫేర్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలు, ప్రకృతి ప్రేమికులు, స్వాగతించి జేజేలు పలుకుతున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేశారు.
ప్రజా, ప్రభుత్య ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రాకు ప్రజల మద్దతు ఉంది. బీఆర్ఎస్ పార్టీ సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటు. సరస్సులు, చెరువులు, ప్రజా ప్రభుత్వ ఆస్తులు కాపాడాలనే ఉద్దేశంతోనే హైడ్రా ఏర్పాటైంది. పది ఏళ్ల BRS ఆక్రమణలు కూల్చినందుకు హైడ్రాపైన బీఆర్ఎస్ నేతల దుష్ప్రచారం చేస్తున్నారు. నగరంలో ప్రభుత్వ ఆస్తులను అధికారంతో కబ్జా చేసిన వారిపైన ఉక్కుపాదం మోపింది. ప్రజా పాలన అధికారంలో రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్ప ఆలోచన చేసి భావితరాలు చెరువులు, కుంటలు, లేకులు, పార్కులు కబ్జా చేసిన ప్రజలకు ఆటంకంగా మరడంతో హైడ్రా వచ్చి విముక్తి చేసింది అని ఆయన పేర్కొన్నారు.
ప్రతి జిల్లాలో పెట్టాలని ప్రజల డిమాండ్ ఉంది..
హైదరాబాద్ నగరంలో బతుకమ్మ కుంటను ఏండ్ల తరబడి బీఆర్ఎస్ ప్రభుత్వం కబ్జాదారులకు తొత్తు అయింది అన్నారు. కొందరు భూ కబ్జాదారులకు బీఆర్ఎస్ పార్టీ అడుగులకు మడుగులు ఒత్తుతూ హైడ్రా పైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. హైడ్రా ఉండాలి.. ప్రతి జిల్లాలో పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హైడ్రా ఏర్పాటు నుండి బీఆర్ఎస్ పార్టీ కుట్ర పూరిత ప్రచారం మొదలు పెట్టింది. బీఆర్ఎస్ పార్టీ పది ఏళ్ళు అధికారం ప్రజలు ఆస్తులను దోచుకున్నారు అది సరిపోక ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేసి ప్రజలకు ఆటంకంగా మారారు. హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ పార్టీ సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటు అని చనగాని దయాకర్ మండిపడ్డారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Heavy Rains | 13 జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్.. ఉత్తర తెలంగాణకు అతి భారీ వర్ష సూచన
- ●Malavika Mohanan | యాక్షన్ పాత్రలపై మాళవిక మోహనన్ ఆసక్తి.. మహిళా దర్శకులపై కీలక వ్యాఖ్యలు..!
- ●IPL-RCB | రూ.2లక్షల కోట్ల దిశగా ఐపీఎల్ విలువ.. ఆర్సీబీకి అరుదైన ఘనత
- ●Konda Surekha | పులుల సంరక్షణ పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి : మంత్రి కొండా సురేఖ
- ●TRAI | దూసుకెళ్తున్న టెలికాం రంగం.. దేశంలో 130 కోట్లకు పైగా వైర్లెస్ కనెక్షన్లు..
- ●National Honour (Amendment) Bill | వందేమాతరం బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు

Heavy Rains | 13 జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్.. ఉత్తర తెలంగాణకు అతి భారీ వర్ష సూచన

Malavika Mohanan | యాక్షన్ పాత్రలపై మాళవిక మోహనన్ ఆసక్తి.. మహిళా దర్శకులపై కీలక వ్యాఖ్యలు..!

IPL-RCB | రూ.2లక్షల కోట్ల దిశగా ఐపీఎల్ విలువ.. ఆర్సీబీకి అరుదైన ఘనత

Konda Surekha | పులుల సంరక్షణ పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి : మంత్రి కొండా సురేఖ





