Congress | కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశం.. తప్పనిసరిగా హాజరుకావాలంటూ ఆదేశం
Congress | కాంగ్రెస్ (Congress) పార్టీ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జూన్ 11న కీలక సమావేశం జరగనుంది.
Congress | కాంగ్రెస్ (Congress) పార్టీ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జూన్ 11న కీలక సమావేశం జరగనుంది. ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో జరిగే ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జులు, పీసీసీ అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని అధిష్ఠానం ఆదేశించింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) ఎక్స్ వేదికగా ప్రకటించారు. ప్రస్తుత రాజకీయా పరిణామాలపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈసీని కలిసిన నేతలు..
కాగా, జూన్ 18న రాజ్యసభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మొత్తం 10 రాష్ట్రాలకు సంబంధించి 24 స్థానాలను ఎన్నిక జగరనుంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఆ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ (Meenakshi Natarajan Nomination Rejected)కు గురైంది. ఈ అంశం తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై కాంగ్రెస్ ప్రతినిధులు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33ఏను అభిషేక్ సింఘ్వీ ఉదహరించారు. కోర్టు ద్వారా అభియోగాలు నమోదై, రెండేళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో మాత్రమే సమాచారం వెల్లడించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మీనాక్షి నటరాజన్ విషయంలో కోర్టు ఎలాంటి అభియోగాలను నమోదు చేయలేదని, ఆమెకు కోర్టు ముందు హాజరు కావాలని మాత్రమే నోటీసులందాయని ఆయన తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read..
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ.. బీజేపీ కుట్రనే : మహేశ్ కుమార్ గౌడ్
ఆ వివరాలు బయటపెట్టిన కోవర్ట్ ఎవరో ముందు తెలుసుకోండి.. కాంగ్రెస్‌పై బీఎల్ సంతోష్ ఫైర్
తాజావార్తలు
- ●Prajavani | ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Mrunal Thakur | తూచ్ ... అంతా వట్టిదే - టీమిండియా క్రికెటర్‌తో డేటింగ్ రూమర్లపై మృణాల్ టీమ్ క్లారిటీ
- ●B.Optometry | హెచ్‌సీయూలో 'ఆప్టోమెట్రీ' డిగ్రీ కోర్సు.. 'నీట్' మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు
- ●Akhilesh Yadav | మోదీని కాపాడేందుకే ప్రధాన్‌ను తొలగించారు : అఖిలేష్ యాదవ్
- ●Instagram | ఆగస్టు 25 నుంచి ఇన్స్టాగ్రామ్ బ్యాన్ ? నిజమేనా.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- ●Chanagani Dayakar | హైడ్రా వచ్చాక 3,350 ఎకరాల భూమి కాపాడింది.. బీఆర్ఎస్ ఆక్రమణలను కూల్చినందుకే ఈ దుష్ప్రచారం

Prajavani | ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్

Mrunal Thakur | తూచ్ ... అంతా వట్టిదే - టీమిండియా క్రికెటర్‌తో డేటింగ్ రూమర్లపై మృణాల్ టీమ్ క్లారిటీ

B.Optometry | హెచ్‌సీయూలో 'ఆప్టోమెట్రీ' డిగ్రీ కోర్సు.. 'నీట్' మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు

Akhilesh Yadav | మోదీని కాపాడేందుకే ప్రధాన్‌ను తొలగించారు : అఖిలేష్ యాదవ్






