Prajavani | ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్
Prajavani | ప్రజల సమస్యలకు వేగంగా పరిష్కారం చూపించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి, ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.
Prajavani | ప్రజల సమస్యలకు వేగంగా పరిష్కారం చూపించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి, ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. వినతులు అందించిన పలువురు బాధితులతో మాట్లాడిన మంత్రి, సంబంధిత అధికారులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ వివాదాలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, 2బీహెచ్‌కే గృహాలు, రెవెన్యూ, మున్సిపల్, సంక్షేమ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి దరఖాస్తుదారుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
విదేశాల్లో ఉద్యోగాలు, ఉపాధి తదితర కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ వాసుల నుంచి ప్రవాసి ప్రజావాణి ద్వారా వచ్చిన వినతులను కూడా మంత్రి పరిశీలించారు. సంబంధిత శాఖల సమన్వయంతో వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో ప్రతిరోజూ అందుతున్న వినతులు, వాటి పరిష్కార పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి, ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా పరిశీలించి నిర్ణీత గడువులో పరిష్కరించాలని స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రజావాణి నోడల్ అధికారి విద్యాసాగర్‌లతో ప్రజావాణి నిర్వహణ, సమస్యల పరిష్కార విధానంపై చర్చించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని, ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి వినతికి పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

BRS Leaders | సోదాలు చేసి రెండేళ్లవుతోంది.. చర్యలేవి?: ఈడీకి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ప్రశ్న
సెప్టెంబర్ 28, 2026

Ponnam Prabhakar | మహిళల ఆర్థిక సాధికారతే.. సమాజ అభివృద్ధికి పునాది: మంత్రి పొన్నం ప్రభాకర్
సెప్టెంబర్ 28, 2026

Additional Collector | కంటైనర్‌ను ఢీకొట్టిన కారు.. కొత్తగూడెం అదనపు కలెక్టర్‌కు తప్పిన ప్రమాదం
సెప్టెంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Mahesh Kumar Goud | జ్ఞానేశ్ కుమార్ బీజేపీకి తొత్తుగా మారారు: మహేశ్‌కుమార్ గౌడ్
- ●Romantic OTT | ఓటీటీలోకి అర్జున్ రెడ్డి డైరెక్టర్ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ
- ●Supreme Court on UPI MDR Fee | యూపీఐ లావాదేవీలపై చార్జీలా? ఎవరి లాభం కోసం? కేంద్రం, ఆర్బీఐలను ప్రశ్నించిన సుప్రీంకోర్టు
- ●Rahul Gandhi | ప్రశ్నిస్తే చెంపదెబ్బలు.. నిలదీస్తే లాఠీచార్జీలు.. మంత్రి చెంపదెబ్బ వివాదంపై రాహుల్ విమర్శలు
- ●Talasani Srinivas Yadav | కాంగ్రెస్ ప్రభుత్వ హామీలన్నీ మోసపూరిత మైనవే: తలసాని శ్రీనివాస్ యాదవ్
- ●BRS Leaders | సోదాలు చేసి రెండేళ్లవుతోంది.. చర్యలేవి?: ఈడీకి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ప్రశ్న

Mahesh Kumar Goud | జ్ఞానేశ్ కుమార్ బీజేపీకి తొత్తుగా మారారు: మహేశ్‌కుమార్ గౌడ్

Romantic OTT | ఓటీటీలోకి అర్జున్ రెడ్డి డైరెక్టర్ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ

Supreme Court on UPI MDR Fee | యూపీఐ లావాదేవీలపై చార్జీలా? ఎవరి లాభం కోసం? కేంద్రం, ఆర్బీఐలను ప్రశ్నించిన సుప్రీంకోర్టు

Rahul Gandhi | ప్రశ్నిస్తే చెంపదెబ్బలు.. నిలదీస్తే లాఠీచార్జీలు.. మంత్రి చెంపదెబ్బ వివాదంపై రాహుల్ విమర్శలు



