Koel Mallick | దీదీకి షాక్.. రాజీనామా చేసిన మరో ఎంపీ
Koel Mallick | తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)కి మరో షాక్ తగిలిచింది. రాజ్యసభ ఎంపీ కోయల్ మల్లిక్ (Koel Mallick) పార్టీకి, ఎగువ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
Koel Mallick | తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం కొసాగుతోంది. పార్టీలో కీలక నేతలు, ప్రజాప్రతినిధులు మమతా బెనర్జీ (Mamata Banerjee) నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీదీకి మరో నేత (TMC MP) షాకిచ్చారు.
రాజ్యసభ ఎంపీ కోయల్ మల్లిక్ (Koel Mallick) పార్టీకి, ఎగువ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌కు అందజేశారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. అయితే, రాజీనామాకు గల కారణాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. కాగా, ఇప్పటికే ఆ పార్టీ నుంచి దీదీకి అత్యంత నమ్మకస్థుడుగా పేరొందిన సుఖేందు శేఖర్ రాయ్ (Sukhendu Sekhar Roy), ప్రకాశ్ చిక్ బరైక్, సుష్మితా దేవ్ (Sushmita Dev) తమతమ రాజ్యసభ ఎంపీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాజ్యసభ నుంచి వైదొలిగిన నాలుగో టీఎంసీ ఎంపీగా కోయల్ నిలిచారు. కోయల్ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే పార్లమెంట్ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేవలం రెండు నెలల్లోనే ఆమె రాజీనామా చేయడం సంచలనంగా మారింది. కోయల్ రాజీనామాపై దీదీగానీ, తృణమూల్ పార్టీ గానీ అధికారికంగా స్పందించలేదు.
Also Read..
యూజర్లకు గుడ్ న్యూస్.. జీమెయిల్‌లో ఏఐని ఇక కావల్సిన విధంగా ఉపయోగించుకోవచ్చు..
మహాప్రభు జగన్నాథ్ మూవీ రిలీజ్‌పై సుప్రీంకోర్టుకు మేకర్స్
సంబంధిత వార్తలు

Vaddiraju Ravichandra | బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపీ వద్దిరాజు.. నియమించిన కేసీఆర్
జులై 9, 2026

ED Freezes TMC Bank Accounts | తృణమూల్ కాంగ్రెస్‌కు ఈడీ బిగ్ షాక్.. రూ.440 కోట్ల ఖాతాలు ఫ్రీజ్, ఆ హెలికాప్టర్ కొనుగోళ్లే కొంపముంచాయా?
జులై 8, 2026

Encounter | 11 ఏళ్ల బాలికపై హత్యాచారం.. ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు హతం
జులై 8, 2026
తాజావార్తలు
- ●Bhadradri Kothagudem | వైద్యుల నిర్లక్ష్యం.. అప్పుడే పుట్టిన పసికందుకు తీవ్ర గాయం
- ●Gmail | యూజర్లకు గుడ్ న్యూస్.. జీమెయిల్‌లో ఏఐని ఇక కావల్సిన విధంగా ఉపయోగించుకోవచ్చు..
- ●Mahaprabhu Jagannath | మహాప్రభు జగన్నాథ్ మూవీ రిలీజ్‌పై సుప్రీంకోర్టుకు మేకర్స్
- ●Telangana Cabinet | రేపు మ. 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం
- ●Mallikarjun Kharge | డీలిమిటేషన్ బిల్లుపై చర్చిద్దాం.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖ
- ●Sampath Kumar | ఆర్ఎస్ ప్రవీణ్.. ప్రవర్తన మార్చుకో.. లేదంటే బీఆర్ఎస్ డస్ట్‌బిన్‌లో డస్ట్ పేపర్ అవుతవ్

Bhadradri Kothagudem | వైద్యుల నిర్లక్ష్యం.. అప్పుడే పుట్టిన పసికందుకు తీవ్ర గాయం

Gmail | యూజర్లకు గుడ్ న్యూస్.. జీమెయిల్‌లో ఏఐని ఇక కావల్సిన విధంగా ఉపయోగించుకోవచ్చు..

Mahaprabhu Jagannath | మహాప్రభు జగన్నాథ్ మూవీ రిలీజ్‌పై సుప్రీంకోర్టుకు మేకర్స్

Telangana Cabinet | రేపు మ. 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం



