Instagram | ఆగస్టు 25 నుంచి ఇన్‌స్టాగ్రామ్ బ్యాన్ ? నిజమేనా.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
Instagram | ఆగస్టు 25 నుంచి భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించనుందని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ విస్తృతంగా వైరల్ అవుతోంది. ఈ సమాచారాన్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయాలని కూడా ఆ పోస్టులో పేర్కొన్నారు. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌పై ఆధారపడే కంటెంట్ క్రియేటర్లు, చిన్న వ్యాపారాలు, డిజిటల్ మార్కెటింగ్ రంగానికి చెందిన వారిలో ఆందోళన నెలకొంది.
Technology | Published On Jul 28, 2026, 4.55 pm IST
Instagram | ఆగస్టు 25 నుంచి భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించనుందని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ విస్తృతంగా వైరల్ అవుతోంది. ఈ సమాచారాన్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయాలని కూడా ఆ పోస్టులో పేర్కొన్నారు. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌పై ఆధారపడే కంటెంట్ క్రియేటర్లు, చిన్న వ్యాపారాలు, డిజిటల్ మార్కెటింగ్ రంగానికి చెందిన వారిలో ఆందోళన నెలకొంది. అయితే ఈ వైరల్ ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఖండించింది. ఈ సమాచారం పూర్తిగా అవాస్తవమని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని స్పష్టం చేసింది. ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఈ వైరల్ క్లెయిమ్‌ను పరిశీలించి, భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ను నిలిపివేయడం లేదా నిషేధించడంపై ఎలాంటి అధికారిక నిర్ణయం లేదా ప్రకటన వెలువడలేదని వెల్లడించింది.
నిషేధం నిజమేనా..
కేంద్ర ప్రభుత్వం ఇన్‌స్టాగ్రామ్‌పై నిషేధం విధించినట్లు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న ఇలాంటి పుకార్లను నమ్మవద్దని, ఏ సమాచారాన్నైనా ఇతరులకు పంపే ముందు దాని నిజానిజాలను తప్పనిసరిగా ధ్రువీకరించాలని ప్రజలకు సూచించింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ బృందం కూడా సోషల్ మీడియా పోస్టులు, మెసేజ్‌లు లేదా వార్తల్లో కనిపించే అనుమానాస్పద సమాచారాన్ని ముందుగా ధ్రువీకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ సమాచారం పట్లనైనా సందేహం ఉంటే, దానిని ఫ్యాక్ట్ చెక్ కోసం పంపి నిజానిజాలు తెలుసుకోవచ్చని తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌ను ఆగస్టు 25 నుంచి నిషేధిస్తారన్న ప్రచారం పూర్తిగా తప్పుడు సమాచారం అని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. అలాంటి నిర్ణయంపై ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని పేర్కొంది. వైరల్ అవుతున్న పోస్టును తప్పుదోవ పట్టించే సమాచారంగా పీఐబీ ఫ్యాక్ట్ చెక్ గుర్తించింది.
ఐటీ నిబంధనలను పాటించాల్పిందే..
భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సోషల్ మీడియా సంస్థలు దేశంలోని సమాచార సాంకేతిక (ఐటీ) నిబంధనలు, చట్టాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. నిబంధనలను ఉల్లంఘించిన సందర్భంలో సంబంధిత సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇన్‌స్టాగ్రామ్ వంటి పెద్ద సోషల్ మీడియా వేదికపై పూర్తి స్థాయిలో నిషేధం విధించడం అంటే అత్యంత కీలకమైన చట్టపరమైన నిర్ణయం. అలాంటి చర్యలకు అధికారిక ఉత్తర్వులు, నిర్దిష్ట న్యాయపరమైన ప్రక్రియలు అవసరం అవుతాయి. అందువల్ల ఆగస్టు 25 నుంచి ఇన్‌స్టాగ్రామ్ ను భారత్‌లో నిలిపివేస్తారన్న ప్రచారం పూర్తిగా అసత్యమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి పుకార్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ధ్రువీకరించని సమాచారాన్ని షేర్ చేయకూడదని, జాగ్రత్త వహించాలని సూచించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Minister Vivek | పరిశ్రమల్లో భద్రతే తొలి ప్రాధాన్యం..
- ●Rahul Gandhi | లోక్‌సభలో రాహుల్ Vs కేంద్రం.. ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై సభలో రగడ
- ●Manushi Chhillar | కామన్వెల్త్ గేమ్స్ వేదికపై మానుషి సందడి.. స్పెషల్ ప్రదర్శన ఇవ్వనున్న మాజీ మిస్‌వరల్డ్..!
- ●Dell XPS 13 | ఏఐ ఫీచర్లతో వచ్చిన డెల్ కొత్త ఎక్స్పీఎస్ ల్యాప్‌టాప్‌లు.. బడ్జెట్ ధరలకే లాంచ్..
- ●RS Praveen Kumar | రూ. 1100 కోట్ల స్కాం బయటపెట్టినందుకే 'పెద్ది'కి వేధింపులు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ●Avor EX | మార్కెట్లో మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఏఐ ఫీచర్లతో లాంచ్.. రూ.799కే బుకింగ్..

Minister Vivek | పరిశ్రమల్లో భద్రతే తొలి ప్రాధాన్యం..

Rahul Gandhi | లోక్‌సభలో రాహుల్ Vs కేంద్రం.. ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై సభలో రగడ

Manushi Chhillar | కామన్వెల్త్ గేమ్స్ వేదికపై మానుషి సందడి.. స్పెషల్ ప్రదర్శన ఇవ్వనున్న మాజీ మిస్‌వరల్డ్..!

Dell XPS 13 | ఏఐ ఫీచర్లతో వచ్చిన డెల్ కొత్త ఎక్స్పీఎస్ ల్యాప్‌టాప్‌లు.. బడ్జెట్ ధరలకే లాంచ్..






