త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

B.Optometry | హెచ్‌సీయూలో ‘ఆప్టోమెట్రీ’ డిగ్రీ కోర్సు.. ‘నీట్’ మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు

B.Optometry | మీరు నీట్( NEET ) ఎగ్జామ్ రాశారా..? ఎంబీబీఎస్( MBBS ), బీడీఎస్( BDS ) కోర్సుల్లో ప్ర‌వేశం పొంద‌లేక‌పోయారా..? అయినా కూడా ఆందోళ‌న చెంద‌కండి. ఎంతో మంది జీవితాల‌కు వెలుగునిచ్చే కోర్సు మీ చెంత‌కే చేరింది. అదే.. బ్యాచిల‌ర్ ఆఫ్ ఆప్టోమెట్రీ( B.Optometry ). ఈ కోర్సులో ప్ర‌వేశాల కోసం హెచ్‌సీయూ( HCU ) ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. వివ‌రాలివే..

S

Telangana | Published On Jul 28, 2026, 5.16 pm IST

B.Optometry | హెచ్‌సీయూలో ‘ఆప్టోమెట్రీ’ డిగ్రీ కోర్సు.. ‘నీట్’ మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు
Advertisement

B.Optometry | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ( Hyderabad Central University ).. ఓ స‌రికొత్త కోర్సును ప్ర‌వేశ‌పెట్టింది. ఎంబీబీఎస్( MBBS ), బీడీఎస్( BDS ) వంటి కోర్సుల్లో ప్ర‌వేశాలు పొంద‌లేని విద్యార్థుల‌కు ఇదొక సువ‌ర్ణావ‌కాశం. ఎందుకంటే కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన కోర్సు కూడా మెడిక‌ల్ రంగానికి చెందిన‌దే. 2026-27 విద్యా సంవ‌త్స‌రానికి గానూ బ్యాచిల‌ర్ ఆఫ్ ఆప్టోమెట్రీ( B.Optometry ) కోర్సును ప్ర‌వేశ‌పెట్టింది హెచ్‌సీయూ( HCU ). ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు అయిన బ్యాచిల‌ర్ ఆఫ్ ఆప్టోమెట్రీ కోర్సుకు హెచ్‌సీయూ ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది.

అర్హులు ఎవ‌రు..?

  • ఇంట‌ర్ బైపీసీ పాసైన విద్యార్థులు అర్హులు. అంతేకాదు నీట్ -2026 ఎగ్జామ్ క‌చ్చితంగా రాసి ఉండాలి. నీట్‌లో వ‌చ్చిన మార్కుల ఆధారంగా ప్ర‌వేశాలు క‌ల్పించ‌నున్నారు.

ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ఎప్ప‌ట్నుంచి..?

  • ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ప్రారంభమైంది. అర్హ‌త గ‌ల విద్యార్థులు ఆగ‌స్టు 7వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు.

ద‌ర‌ఖాస్తు ఫీజు ఎంత‌..?

  • జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు రూ. 300
  • ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థుల‌కు రూ. 200
  • ఓబీసీ - ఎన్సీఎల్ అభ్య‌ర్థుల‌కు రూ. 200
  • ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్య‌ర్థుల‌కు రూ. 125

సీట్ల సంఖ్య ఎంత‌..?

  • జ‌న‌ర‌ల్ - 12
  • ఎస్సీ - 05
  • ఎస్టీ - 02
  • ఓబీసీ - 08
  • ఈడ‌బ్ల్యూఎస్ - 03
  • పీహెచ్ - 01
  • డీపీ - 01

ఆప్టోమెట్రీ కోర్సు అంటే ఏంటి..?

ఈ కోర్సు మెడిక‌ల్ రంగానికి చెందిన‌దే. ఆప్టోమెట్రిస్ట్‌లు ముఖ్యంగా కంటి రోగుల‌కు సంబంధించిన ప్రాథ‌మిక ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తారు. అంటే వారి దృష్టి లోపాల‌ను ముందుగానే గుర్తించి, నిర్ధారించ‌డంలో కీల‌క‌పాత్ర పోషిస్తారు. స‌ద‌రు రోగుల కంటి చూపును ప‌రీక్షించి, వారికి ఉన్న హ్ర‌స్వ‌దృష్టి, దీర్ఘ‌దృష్టితో పాటు అస్టిగ్మాటిజం వంటి దృష్టి లోపాల‌ను నిర్ధారిస్తారు. ఆ త‌ర్వాత ఈ లోపాల‌ను స‌వ‌రించ‌డానికి క‌ళ్ల‌జోడును ఇవ్వ‌డం లేదా కాంటాక్ట్ లెన్స్‌ల‌ను రిఫ‌ర్ చేస్తారు. కంటి వ్యాధులను గుర్తించడంలో, నిర్ధారించడంలో కూడా ఆప్టోమెట్రిస్ట్‌లు నైపుణ్యం కలిగి ఉంటారు. గ్ల‌కోమా, శుక్లాలు, మాకుల‌ర్ డీజ‌న‌రేష‌న్, డయాబెటిక్ రెటినోపతి వంటి పరిస్థితులను గుర్తించడానికి ఆప్టోమెట్రిస్ట్‌లకు శిక్షణ ఇస్తారు. ఈ వ్యాధులను ముందుగానే గుర్తించడం వల్ల సకాలంలో చికిత్స అందించడానికి వీలవుతుంది, ఇది దృష్టిని కాపాడటానికి, మరింత క్షీణించకుండా నిరోధించడానికి సహాయపడుతుంది.

Advertisement
Advertisement