BL Santhosh | ఆ వివరాలు బయటపెట్టిన కోవర్ట్ ఎవరో ముందు తెలుసుకోండి.. కాంగ్రెస్‌పై బీఎల్ సంతోష్ ఫైర్
BL Santhosh | కాంగ్రెస్ పార్టీపై బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ (BL Santhosh) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మీనాక్షి నటరాజన్ కేసు గురించి బయటపెట్టిన తెలంగాణ కాంగ్రెస్ కోవర్ట్ ఎవరు..? అంటూ ప్రశ్నించారు.
BL Santhosh | తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ (Meenakshi Natarajan Nomination Rejected) ఉదంతం రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ అంశం కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. నామినేషన్ తిరస్కరణ విషయంలో బీజేపీపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుండగా.. కమలం పార్టీ సైతం ధీటుగా సమాధానమిస్తోంది.
ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ (BL Santhosh) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మీనాక్షి నటరాజన్ కేసు గురించి బయటపెట్టిన తెలంగాణ కాంగ్రెస్ కోవర్ట్ ఎవరు..? అంటూ ప్రశ్నించారు. అది తెలుసుకోకుండా బీజేపీపై నోరుజారడం ఎందుకని నిలదీశారు. భవిష్యత్తులో ఇలాంటి పరువు తక్కువ పరిణామాలు ఎదురుకాకుండా ఉండాలంటే ముందు కోవర్ట్‌లను పట్టుకుని అదుపులో పెట్టుకోవాంటూ చురకలంటించారు.
మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే ఆమె నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. బీజేపీ అభ్యర్థి మహేశ్ కేవట్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ప్రకటించారు. హైదరాబాద్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుకు సంబంధించిన వివరాలను మీనాక్షి తన నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదని, ఈ నేపథ్యంలోనే నామినేషన్‌ను తిస్కరించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం రేపుతోంది.
Also Read..
లోక్‌సభలో 200 దిగువకు ఇండీ బలం..
రేవంత్ రెడ్డికి మేడిగడ్డనే దిక్కు : మాజీ ఎంపీ వినోద్
6 ఏళ్లలో 313 శాతం లాభం.. పెట్టుబడిదారులకు లాభాలు కురిపిస్తున్న గోల్డ్ బాండ్స్..
సంబంధిత వార్తలు

BJP Ramchandar Rao | రాష్ట్రమంతా బీజేపీ శరవేగంగా విస్తరిస్తోంది.. నెక్స్ట్ అధికారం మాదే
జులై 28, 2026

AK-47 rifles | AK-47 వినియోగంపై అమిత్ షా ప్రకటన చేసే వరకు సభను జరగనివ్వం: కాంగ్రెస్
జులై 27, 2026

Gattu Ramchandar Rao | మీ హామీలను కొరియర్ చేస్తున్నం.. సదువుకొని ఎందుకు ఎగ్గొట్టిర్రో చెప్పుండ్రి
జులై 25, 2026
తాజావార్తలు
- ●Garuda Seva | గరుడ వాహనంపై వివహరించిన తిరుమలేశుడు..!
- ●Ashika Ranganath | మెగాస్టార్ సినిమాలో అవకాశం.. ఆషిక ఆశలన్నీ ‘విశ్వంభర’పైనే!
- ●Bonalu | న్యూయార్క్‌లో మార్మోగిన తెలంగాణ బోనాల సందడి
- ●TG Police Jobs | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది..!
- ●Singareni | ఇక సింగరేణికి సోలార్ వెలుగు..
- ●CS Sanjay Jaju | తెలంగాణలో నాలుగు ఇండస్ట్రియల్ పార్కులు.. కేంద్రానికి ప్రతిపాదనలు

Garuda Seva | గరుడ వాహనంపై వివహరించిన తిరుమలేశుడు..!

Ashika Ranganath | మెగాస్టార్ సినిమాలో అవకాశం.. ఆషిక ఆశలన్నీ ‘విశ్వంభర’పైనే!

Bonalu | న్యూయార్క్‌లో మార్మోగిన తెలంగాణ బోనాల సందడి

TG Police Jobs | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది..!



