Aircraft Crash Land | బారామతిలో కూలిన శిక్షణ విమానం.. గతంలో అజిత్ పవార్ మరణించింది కూడా ఇక్కడే
Aircraft Crash Land | మహారాష్ట్రలోని పూణె జిల్లా బారామతి (Baramati)లో మరోసారి విమాన ప్రమాదం చోటు చేసుకుంది. గోజుబావి గ్రామంలో శిక్షణ విమానం క్రాష్ ల్యాండ్ అయ్యింది.
Aircraft Crash Land | మహారాష్ట్రలోని పూణె జిల్లా బారామతి (Baramati)లో మరోసారి విమాన ప్రమాదం చోటు చేసుకుంది. బారామతి సమీపంలోని గోజుబావి గ్రామంలో బుధవారం ఉదయం ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన శిక్షణ విమానం కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో అందులో ఓ ట్రైనీ పైలట్ మాత్రమే ఉన్నారు. ఆయన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఉదయం 8:50 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు పుణె ఎస్పీ సందీప్ సింగ్ గిల్ తెలిపారు. విమానం క్రాష్ ల్యాండ్ అయినట్లు చెప్పారు (Trainer Aircraft Crash Lands).
విమానం తక్కువ ఎత్తులో ఎగురుతున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు సమాచారం. ల్యాండ్ అయ్యే క్రమంలో విమానం విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీ కొట్టి నేలకూలింది. ఈ విమానం 'రెడ్‌బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీ'కి (Redbird Flight Training Academy) చెందిన శిక్షణ విమానంగా అధికారులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
కాగా, ఈ ఏడాది జనవరి చివరిలో ఇదే గ్రామంలో విమానం కూలిన విషయం (Ajit Pawar Plane Accident) తెలిసిందే. ఆ ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయారు. ఆయనతోపాటూ మరో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం జరిగిన నెలల వ్యవధిలోనే మరో విమానం కూలడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read..
బలపరీక్షలో నెగ్గిన విజయ్ ప్రభుత్వం
ప్రధాని బాటలోనే కేంద్ర మంత్రులు.. కాన్వాయ్ సైజు కుదించుకున్న అమిత్ షా, జేపీ నడ్డా
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే






