Sunetra Pawar | ఏకగ్రీవానికి తొలగిన అడ్డంకులు.. బారామతిలో సునేత్ర పవార్ విజయం లాంఛనమే
Sunetra Pawar | మహారాష్ట్రలోని బారామతి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో (Baramati bypolls) కీలక పరిణామం చోటు చేసుకుంది. దివంగత నేత అజిత్ పవార్ (Ajit Pawar) సతీమణి, ప్రస్తుత డిప్యూటీ ముఖ్యమంత్రి సునేత్ర పవార్ ఏకగ్రీవానికి ఏర్పడిన అడ్డంకి తొలగిపోయింది.
Sunetra Pawar | మహారాష్ట్రలోని బారామతి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో (Baramati bypolls) కీలక పరిణామం చోటు చేసుకుంది. దివంగత నేత అజిత్ పవార్ (Ajit Pawar) సతీమణి, ప్రస్తుత డిప్యూటీ ముఖ్యమంత్రి సునేత్ర పవార్ ఏకగ్రీవానికి ఏర్పడిన అడ్డంకి తొలగిపోయింది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ (Congress) పార్టీ తమ అభ్యర్థిని ఉపసంహరించుకుంది. దీంతో సునేత్ర పవార్ విజయం లాంఛనమైంది. ఏప్రిల్ 23న జరగాల్సిన ఉప ఎన్నికలో సునేత్ర ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
కాగా, జనవరి 28న జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆయన మరణం అనంతరం పవార్ వారసురాలిగా సునేత్రను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎన్నుకుంది. ఆ తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ బాధ్యతలు చేపట్టారు. ఇక ఈ నెల 23న జరగాల్సిన బారామతి అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో (Baramati By-Election) సునేత్ర పోటీలో నిలిచారు. ఈ స్థానంలో సునేత్ర ఏకగ్రీవంగా ఎన్నికవుతారని అంతా అనుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగడంతో ఎన్నికలు నిర్వహించడం అనివార్యమైంది. ఆమెపై కాంగ్రెస్ తన అభ్యర్థిని బరిలోకి దింపింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యాయవాది ఆకాష్ విశ్వనాథ్ మోర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో కాంగ్రెస్ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
రంగంలోకి దిగిన మహా సర్కార్.. సునేత్ర ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్‌తో సంప్రదింపులు జరిపింది. స్వయంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ సప్కల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. దీంతో అజిత్ పవార్‌కు గౌరవ సూచికంగా కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకుంది. హస్తం పార్టీ నిర్ణయంతో పవార్ కుటుంబానికి కంచుకోట అయిన బారామతిలో సునేత్ర పవార్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
Also Read..
15,400 టన్నుల LPGతో భారత్‌కు చేరుకున్న గ్రీన్ ఆశా
బెంగాల్ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరం : ప్రధాని మోదీ
11 వేల లీటర్ల పాలతో నర్మదా నదికి అభిషేకం.. నెట్టింట తీవ్ర చర్చ
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే






