Ajit Pawar | సంచలన వీడియో విడుదల చేసిన అజిత్ పవార్ తనయుడు..!
Ajit Pawar | మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో విమానం కంపెనీ నిర్లక్ష్యం ఉందని ఆయన తనయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన వీడియోను పోస్ట్ చేశారు.
Ajit Pawar | మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో విమానం కంపెనీ నిర్లక్ష్యం ఉందని ఆయన తనయుడు సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన వీడియోను పోస్ట్ చేశారు. జై పవార్ విడుదల చేసిన వీడియోలో విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో కాక్‌పిట్‌లో పైలట్ పక్కన ఓ వ్యక్తి మెయిన్ పైలట్ సీటులో కూర్చొని నిద్రిస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. పక్కనే యూనిఫాం ధరించిన పైలట్ విమానాన్ని నడుపుతుండగా.. బ్యాగ్ పట్టుకొని నిద్ర పోతుండడం కనిపించింది.
అందులో ఉన్నది ఎవరో కాదు వీఎస్ఆర్ వెంచర్స్ అధినేత రోహిత్ సింగ్ అని జై పవార్ ఆరోపించారు. నిబంధనల ప్రకారం.. కాక్‌పిట్‌లోకి ఇతరులకు ప్రవేశం ఉండదు. యజమాని హోదాలో మెయిన్ పైలట్ సీటులో కూర్చొని నిద్రపోవడం నిబంధనలకు విరుద్ధం. తాను తన తండ్రిని కోల్పోయానని.. ఈ బాధ జీవితాంతం వెంటాడుతుందన్నారు. విమానం గాల్లో ఉన్న సమయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని సహించలేమని, ఇది చాలా తీవ్రమైన, దిగ్భ్రాంతికరమైన సంఘటనగా ఆయన అభివర్ణించారు. ఈ విషయంలో వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డీసీజీఏని కోరారు. సమగ్ర దర్యాప్తు జరిగే వరకు అన్ని వీఎస్ఆర్ విమానాలను నిలిపివేయాలని, రోహిత్ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆయనపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రయాణికుల భద్రత మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే డీజీసీఏ వీఎస్ఆర్ వెంచర్స్‌కు చెందిన నాలుగు నాలుగు విమినాలను నిలిపివేసింది. జనవరి 28న బారామతిలో జరిగిన లియర్‌జెడ్45 విమాన ప్రమాదంలో అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నిర్వహించిన ప్రత్యేక భద్రతా ఆడిట్‌లో నిబంధనలు ఉల్లంగించినట్లు తేలింది. దాంతో చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా.. విమాన ప్రమాదంపై ఏఏఐబీ ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. ప్రమాదం రోజున బారామతిలో విమానం ల్యాండింగ్ సమయంలో విజిబిలిటీ కేవలం 3 కిలోమీటర్లుగా నమోదైందని తెలిపింది. విజువల్ ఫ్లైట్ రూల్స్ ప్రకారం కనీసం 5 కిలోమీటర్ల విజిబులిటీ అవసరమని నివేదిక స్పష్టం చేసింది.
हाच तो #VSR कंपनीचा मालक रोहित सिंग… आज तो जणूकाय राज्यातील सगळ्याच मोठ्या नेत्यांपेक्षाही मोठा झालाय आणि याच्याच लग्नाला केंद्रातील मंत्रीपदावरील आणि राज्यातील सत्तेतील बडे नेते गेले होते… म्हणूनच त्याला वाचवण्याचा सगळीकडूनच प्रयत्न होताना दिसतोय.. विमान हवेत असताना स्वतः… pic.twitter.com/WXrCiGoGtV
— Rohit Pawar (@RRPSpeaks) March 2, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే






