Baramati By-Election | ఏకగ్రీవానికి అడ్డంకులు.. అజిత్ పవార్ సతీమణిపై పోటీకి కాంగ్రెస్ సిద్ధం
Baramati By-Election | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సునేత్ర పవార్ (Sunetra Pawar) ఆశలకు విపక్ష కాంగ్రెస్ గండికొట్టింది. తన భర్త, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) మరణంతో ఆయన సతీమణి సునేత్ర బారామతి ఉపఎన్నిక బరిలో (Baramati By-Election) నిలిచారు.
Baramati By-Election | త్రినేత్ర.న్యూస్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సునేత్ర పవార్ (Sunetra Pawar) ఆశలకు విపక్ష కాంగ్రెస్ గండికొట్టింది. తన భర్త, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) మరణంతో ఆయన సతీమణి సునేత్ర బారామతి ఉపఎన్నిక బరిలో (Baramati By-Election) నిలిచారు. అయితే ఈ స్థానంలో సునేత్ర ఏకంగ్రీవంగా ఎన్నికవుతారని అంతా అనుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగడంతో ఎన్నికలు నిర్వహించడం అనివార్యమైంది. ఆమెపై కాంగ్రెస్ తన అభ్యర్థిని బరిలోకి దింపింది.
ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యాయవాది ఆకాష్ విశ్వనాథ్ మోర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. కాగా, సునేత్ర పవార్ సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ ఎన్నికను ఏకగ్రీవం చేయడానికి ఆమె విపక్షాలను సంప్రదించారు. ఇందులో భాగంగా మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ సప్కల్‌ను కూడా కలిశారు. అయితే, అభ్యర్థిని పోటీలో దింపాలనే నిర్ణయం కేంద్ర నాయకత్వం నుంచి వచ్చిందని ఆయన తెలిపినట్లు సమాచారం. మరోవైపు, ఉద్ధవ్ ఠాక్రేను ఆమె కూడా సంప్రదించినప్పటికీ శివసేన (యూబీటీ) ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.
బారామతి పవార్ కుటుంబానికి పెట్టని కోటగా ఉన్నది. గత లోక్‌సభ ఎన్నికల్లో బారామతి నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే పోటీచేశారు. ఆమెపై ఎన్డీయే కూటమి తరపున సునేత్ర పవార్ బరిలో నిలిచారు. అయితే ఆమెపై 1,58,333 ఓట్లతో సుప్రియ విజయం సాధించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే






