Convoy | ప్రధాని బాటలోనే కేంద్ర మంత్రులు.. కాన్వాయ్ సైజు కుదించుకున్న అమిత్ షా, జేపీ నడ్డా
Convoy | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పొదుపు విజ్ఞప్తి మేరకు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah), ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా (JP Nadda) ఇద్దరూ తమ కాన్వాయ్‌ను సగానికి పైగా తగ్గించుకున్నారు.
Convoy | పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో దేశ ప్రజలకు పొదుపు మంత్రం పాటించాలని, వృథా ఖర్చులు తగ్గించుకోవాలని సూచించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi).. తొలుత తాను పొదుపు బాట పట్టారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడంలో భాగంగా తన కాన్వాయ్‌లో (Convoy) వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మోదీ బాటలోనే పలువురు కేంత్ర మంత్రులు కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు.
మోదీ పొదుపు విజ్ఞప్తి మేరకు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah), ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా (JP Nadda) ఇద్దరూ తమ కాన్వాయ్‌ను సగానికి పైగా తగ్గించుకున్నారు. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తన ఎస్కార్ట్ వాహనాన్ని వాడకూడదని నిర్ణయించారు. పలువురు కేంద్ర మంత్రులు కూడా మోదీ సూచనలు పాటిస్తూ ఇదే నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర మంత్రులే కాదు, పలువురు ముఖ్యమంత్రులు కూడా మోదీ సూచనలు పాటిస్తూ తమ కాన్వాయ్‌లోని కార్ల సంఖ్యను తగ్గించుకుంటున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే ఆచరణలోకి దిగారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను 13 నుంచి 8కి తగ్గించాలని ఆదేశించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ తమ కాన్వాయ్‌లో అనవసరపు వాహనాలు ఉండకూడదని సిబ్బందికి సూచించించారు. మరోవైపు పొదుపు మంత్రంలో భాగంగా తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG)కి సూచించిన ప్రధాని మోదీ.. కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (EVs) వినియోగాన్ని పెంచాలని ఆదేశించారు.
Also Read..
సోనియా గాంధీకి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు అనుమానాస్పద మృతి.. భార్యతో విభేదాలే కారణమా..?
అమెజాన్ భారీ బెనిఫిట్స్.. డెలివరీ ఉద్యోగులకు రూ.10 లక్షల ఇన్సూరెన్స్..
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే






