CM Vijay | బలపరీక్షలో నెగ్గిన విజయ్ ప్రభుత్వం
CM Vijay | తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో విజయ్ ప్రభుత్వం గట్టెక్కింది. విశ్వాస పరీక్షలో విజయ్ ప్రభుత్వం సునాయాసంగా విజయం సాధించింది. ఓటింగ్‌లో 144 మంది ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు.
CM Vijay | తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీవీకే చీఫ్ విజయ్ (CM Vijay) ఇవాళ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు (Vijay Floor Test). బుధవారం ఉదయం జరిగిన ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వం నెగ్గింది. తొలుత బలపరీక్షపై విజయ్ సభలో తీర్మానం ప్రవేశపెట్టగా.. దీనిపై చర్చ చేపట్టారు. అనంతరం స్పీకర్ ఓటింగ్ నిర్వహించగా.. విశ్వాస పరీక్షలో విజయ్ ప్రభుత్వం సునాయాసంగా విజయం సాధించింది. ఓటింగ్‌లో 144 మంది ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు.
234 మంది సభ్యులున్న అసెంబ్లీలో.. విజయ్ ప్రభుత్వం బలపరీక్ష నెగ్గాలంటే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. సొంతంగా తన పార్టీకి 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అయితే, వీరిలో ఓటింగ్‌లో స్పీకర్, ఒక్క ఓటు తేడాతో గెలిచిన ఎమ్మెల్యే పాల్గొనలేదు. ఇక కాంగ్రెస్ నుంచి ఐదుగురు, వీసీకే నుంచి ఇద్దరు, సీపీఎం నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు విజయ్‌కి మద్దతిచ్చారు. వీరితో పాటూ ఏఐఏడీఎంకేకు చెందిన 26 మంది రెబల్ ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వానికి ఓటేశారు. ఏఎంఎంకే (1) కూడా ప్రభుత్వానికి మద్దతిచ్చింది. దీంతో ఈ బలపరీక్షలో 144 ఓట్లతో విజయ్ చాలా ఈజీగా నెగ్గారు.
సభ నుంచి డీఎంకే వాకౌట్..
ఇక విశ్వాస పరీక్ష సందర్భంగా అసెంబ్లీలో హైడ్రామా చోటు చేసుకుంది. డీఎంకే ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. వారు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఇక నలుగురు పీఎంకే ఎమ్మెల్యేలు, ఒక బీజేపీ ఎమ్మెల్యే కూడా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. సుమారు 20 మంది ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు.
మిత్రపక్షాలకు విజయ్ ధన్యవాదాలు..
తనకు మద్దతు తెలిపిన మిత్రపక్షాలకు సీఎం విజయ్ ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రభుత్వం ఐదేళ్లపాటూ ఉంటుంది.. లైకిక వాదాన్ని అవలంబిస్తూ పాలన సాగిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. అదే సమయంలో తన వ్యక్తిగత జ్యోతిషుడిని ఓఎస్డీగా నియమించడంపై వచ్చిన విమర్శలపై విజయ్ స్పందించారు.
జ్యోతిష్యుడి నియామకంపై డీఎండీకే (DMDK) నాయకురాలు ప్రేమలత చేసిన వ్యాఖ్యలను తాను పరిగణనలోకి తీసుకుంటానని చెప్పారు. సీఎం విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రిక్కి రాధన్ పండిట్ వెట్రివేల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయంలో 'ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ' (OSD - పొలిటికల్) గా నియమించిన విషయం తెలిసిందే. విజయ్ నిర్ణయంపై పలు పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
Also Read..
ప్రధాని బాటలోనే కేంద్ర మంత్రులు.. కాన్వాయ్ సైజు కుదించుకున్న అమిత్ షా, జేపీ నడ్డా
సోనియా గాంధీకి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు అనుమానాస్పద మృతి.. భార్యతో విభేదాలే కారణమా..?
తాజావార్తలు
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ
- ●Telangana SIR Process | "ఒక వ్యక్తికి ఒకే ఓటు" కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్
- ●Divyabharathi | హాట్ ఫొటోలతో రచ్చ చేసిన సుడిగాలి సుధీర్ హీరోయిన్
- ●Uttam Kumar Reddy | 2028 జూన్ కల్లా ఎస్ ఎల్ బీసీని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే

SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్

OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

Telangana SIR Process | "ఒక వ్యక్తికి ఒకే ఓటు" కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్






