Sonia Gandhi | సోనియా గాంధీకి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
Sonia Gandhi | కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు (Congress leader) సోనియా గాంధీ (Sonia Gandhi) అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెని గురుగ్రామ్ (Gurugram)లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు.
Sonia Gandhi | కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు (Congress leader) సోనియా గాంధీ (Sonia Gandhi) అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెని గురుగ్రామ్ (Gurugram)లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. సోనియా గాంధీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా, సోనియా గాంధీ వయసు ప్రస్తుతం 79 ఏళ్లు. ఇటీవలే పలుమార్లు ఇలా అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అనంతరం కోలుకుని ఆరోగ్యంతో ఇంటికి చేరారు.
ఇక ఈ ఏడాది జనవరి నుంచి సోనియా ఆసుపత్రిలో చేరడం ఇది మూడోసారి. జనవరి, మార్చి నెలల్లో ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం కోలుకుని ఇంటికి చేరారు. ఆ తర్వాత కూడా పలుమార్లు స్వల్ప అస్వస్థతకు గురైన సమయాల్లో ఇంటివద్దే చికిత్స అందించారు. గతేడాది కూడా చాలాసార్లు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.
ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన సోనియా గాంధీ.. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. రెండు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రభావవంతమైన నాయకురాలిగా కొనసాగుతున్న ఆమె, రెండు పర్యాయాలు పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ సంస్థాగత, రాజకీయ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
Also Read..
ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు అనుమానాస్పద మృతి.. భార్యతో విభేదాలే కారణమా..?
వారాంతంలో అండమాన్‌కు నైరుతి రుతుపవనాలు: ఐఎండీ
దేశ ప్రజలకు మోదీ 'గోల్డ్' షాక్.. ఒక్క రోజులోనే రూ.1.39 లక్షలు పెరిగిన పసిడి ధర..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే






