CM Vijay | శిశువులకు బంగారు ఉంగరం.. మేనమామ కానుక పథకాన్ని ప్రారంభించిన సీఎం విజయ్
CM Vijay | నవజాత శిశువులకు ప్రభుత్వం నుంచి గ్రాము బంగారం (gold ring scheme) అందించే సరికొత్త పథకాన్ని ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) సోమవారం లాంఛనంగా ప్రారంభించారు.
CM Vijay | త్రినేత్ర న్యూస్ : తమిళనాడులో నవజాత శిశువులకు ప్రభుత్వం నుంచి గ్రాము బంగారం (gold ring scheme) అందించే సరికొత్త పథకాన్ని ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. మధురై (Madurai)లోని ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రిలో (Government Rajaji hospital) ఈ పథకాన్ని ప్రారంభించిన విజయ్.. ఈ సందర్భంగా అక్కడి శిశువులను ఎత్తుకుని కాసేపు ముద్దాడారు. అనంతరం 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారు ఉంగరాలను అందజేశారు. దీంతోపాటూ బేబీ వెల్‌కమ్ కిట్ కూడా అందజేశారు.
‘తైమామన్ తంగ మోతిరం’ (Thaaimaman Thanga Mothiram Thittam) పేరుతో టీవీకే సర్కార్ ఈ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు, నవజాత శిశువుల సంక్షేమం కోసం ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది. ఈ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 755.83 కోట్ల భారీ మొత్తాన్ని కేటాయించింది. తొలిదశ పంపిణీలో భాగంగా 1.28 లక్షల ఉంగరాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విజయ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
2026 జూన్ 22 , తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాస్పత్రుల్లో జన్మించిన అర్హత కలిగిన శిశువులకు ఈ పథకం వర్తిస్తుంది. తమిళనాడులో శాశ్వత నివాసం ఉండే తల్లులకు పుట్టిన శిశువులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. గర్భిణీ, శిశు వివరాల పర్యవేక్షణ వ్యవస్థ (PICME)లో నమోదు, ఆర్‌సీహెచ్ ఐడీ తప్పనిసరి. అర్హత ఉన్న శిశువులకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి సమయంలో ఉంగరం అందిస్తారు. ప్రతి ఉంగరానికి ప్రత్యేక సీరియల్ నంబర్ ఉండటంతోపాటు ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకేజింగ్‌లో అందజేయనున్నారు.
జోయాలుక్కాస్, కళ్యాణ్ జ్యువెలర్స్‌కు ఉంగరాల తయారీ, సరఫరా ఆర్డర్లు ఇచ్చారు. పథకం అమలులో పారదర్శకత, ఉంగరాల నిల్వ, పంపిణీని పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాలో కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. తమిళనాడులో ఏటా సుమారు 7.80 లక్షల మంది శిశువులు జన్మిస్తుండగా.. 99.9 శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఇందులో సుమారు 4.20 లక్షలు (53 శాతం) ప్రభుత్వాస్పత్రుల్లో జరుగుతున్నాయి. ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచడం, ఆస్పత్రుల్లో సురక్షిత ప్రసవాలను ప్రోత్సహించడం ఈ పథకం ఉద్దేశమని పేర్కొంది.
STORY | TN CM Vijay launches one-gram gold ring scheme for newborns
Tamil Nadu Chief Minister C Joseph Vijay on Monday launched the 22-carat one-gram gold ring scheme - Maternal Uncle Gold Ring Scheme (Thaaimaman Thanga Mothiram Thittam) - for newborn babies, fulfilling a key… pic.twitter.com/OZf3a2uSpk
— Press Trust of India (@PTI_News) September 28, 2026
Also Read..
జ్ఞానేశ్ కుమార్ బీజేపీకి తొత్తుగా మారారు: మహేశ్‌కుమార్ గౌడ్
ప్రశ్నిస్తే చెంపదెబ్బలు.. నిలదీస్తే లాఠీచార్జీలు.. మంత్రి చెంపదెబ్బ వివాదంపై రాహుల్ విమర్శలు
యూపీఐ లావాదేవీలపై చార్జీలా? ఎవరి లాభం కోసం? కేంద్రం, ఆర్బీఐలను ప్రశ్నించిన సుప్రీంకోర్టు
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Mahesh Kumar Goud | జ్ఞానేశ్ కుమార్ బీజేపీకి తొత్తుగా మారారు: మహేశ్‌కుమార్ గౌడ్
- ●Romantic OTT | ఓటీటీలోకి అర్జున్ రెడ్డి డైరెక్టర్ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ
- ●Supreme Court on UPI MDR Fee | యూపీఐ లావాదేవీలపై చార్జీలా? ఎవరి లాభం కోసం? కేంద్రం, ఆర్బీఐలను ప్రశ్నించిన సుప్రీంకోర్టు
- ●Rahul Gandhi | ప్రశ్నిస్తే చెంపదెబ్బలు.. నిలదీస్తే లాఠీచార్జీలు.. మంత్రి చెంపదెబ్బ వివాదంపై రాహుల్ విమర్శలు
- ●Talasani Srinivas Yadav | కాంగ్రెస్ ప్రభుత్వ హామీలన్నీ మోసపూరిత మైనవే: తలసాని శ్రీనివాస్ యాదవ్
- ●BRS Leaders | సోదాలు చేసి రెండేళ్లవుతోంది.. చర్యలేవి?: ఈడీకి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ప్రశ్న

Mahesh Kumar Goud | జ్ఞానేశ్ కుమార్ బీజేపీకి తొత్తుగా మారారు: మహేశ్‌కుమార్ గౌడ్

Romantic OTT | ఓటీటీలోకి అర్జున్ రెడ్డి డైరెక్టర్ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ

Supreme Court on UPI MDR Fee | యూపీఐ లావాదేవీలపై చార్జీలా? ఎవరి లాభం కోసం? కేంద్రం, ఆర్బీఐలను ప్రశ్నించిన సుప్రీంకోర్టు

Rahul Gandhi | ప్రశ్నిస్తే చెంపదెబ్బలు.. నిలదీస్తే లాఠీచార్జీలు.. మంత్రి చెంపదెబ్బ వివాదంపై రాహుల్ విమర్శలు






