Rahul Gandhi | ప్రశ్నిస్తే చెంపదెబ్బలు.. నిలదీస్తే లాఠీచార్జీలు.. మంత్రి చెంపదెబ్బ వివాదంపై రాహుల్ విమర్శలు
Rahul Gandhi | ఓ యువకుడిపై ఢిల్లీ మంత్రి (Delhi Minister) పర్వేశ్ వర్మ (Parvesh Verma) చేయి చేసుకోవడంపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. ఈ ఘటన అధికార అహంకారానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రశ్నిస్తే చెంపదెబ్బలు.. నిలదీస్తే లాఠీచార్జీలు చేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు.
Rahul Gandhi | త్రినేత్ర న్యూస్ : రోడ్డు పనుల తనిఖీకి వెళ్లిన సమయంలో వీడియో రికార్డ్ చేస్తున్న ఓ యువకుడిపై ఢిల్లీ మంత్రి (Delhi Minister) పర్వేశ్ వర్మ (Parvesh Verma) చేయి చేసుకోవడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. మంత్రి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రస్థాయిలో స్పందించారు. వీడియో తీశాడన్న ఒకే ఒక్క కారణంతో యువకుడిని మంత్రి కొట్టడాన్ని రాహుల్ తీవ్రంగా తప్పుబట్టారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. ఈ ఘటన అధికార అహంకారానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలను తట్టుకోలేక ప్రభుత్వం అసహనంతో వ్యవహరిస్తోందని విమర్శించారు. చేతిలో కెమెరా పట్టుకుని వీడియో తీయడమే ఆ యువకుడు చేసిన నేరమా..? అంటూ ప్రశ్నించారు. ఇది ఓటర్లకు భయపడని అధికారిక అహంకారానికి నిలువెత్తు రూపమని వ్యాఖ్యానించారు.
రోడ్డుపై ప్రశ్నిస్తే ప్రజలకు చెంపదెబ్బలు, పేపర్ లీకులపై నిలదీస్తే విద్యార్థులపై లాఠీచార్జీలు, పార్లమెంట్లో గళం వినిపిస్తే విపక్షాల మైకులు కట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల చోరీ, అక్రమాలు కేవలం ఎన్నికల ఫలితాలనే కాకుండా, నాయకుల్లో విపరీతమైన అహంకారాన్ని పెంచుతున్నాయని ఆక్షేపించారు. అయితే, రాహుల్ వ్యాఖ్యలపై మంత్రి పర్వేశ్ వర్మ స్పందించారు. ఈ వివాదానికి దూరంగా ఉండాలంటూ సూచించారు. "రాహుల్ జీ.. మీరు ఈ వివాదానికి దూరంగా ఉండండి. మీకేం తెలియదు" అంటూ ఆయన బదులిచ్చారు.
Also Read..
కాంగ్రెస్ ప్రభుత్వ హామీలన్నీ మోసపూరిత మైనవే: తలసాని శ్రీనివాస్ యాదవ్
సోదాలు చేసి రెండేళ్లవుతోంది.. చర్యలేవి?: ఈడీకి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ప్రశ్న
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






