Mahesh Kumar Goud | జ్ఞానేశ్ కుమార్ బీజేపీకి తొత్తుగా మారారు: మహేశ్‌కుమార్ గౌడ్
Mahesh Kumar Goud | కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ బీజేపీకి తొత్తులా మారారని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఎలక్షన్ కమిషన్ తీరు ఉందని దుయ్యబట్టారు.
Mahesh Kumar Goud | త్రినేత్ర న్యూస్: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ బీజేపీకి తొత్తులా మారారని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఎలక్షన్ కమిషన్ తీరు ఉందని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ, అమిత్ షా తీరుతో ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకుంటున్నాయని మండిపడ్డారు. సర్ వల్లే బీహార్‌లో ఆర్జేడీ, బెంగాల్లో టీఎంసీ ఓటమి చవిచూశాయని వ్యాఖ్యానించారు. బీఆర్కే భవన్ వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎలక్షన్ కమిషనర్, బీజేపీ తీరుపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.
సర్ వల్లే అక్కడ ఓటమి..
ఓటర్ల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. సర్ వల్ల బీహార్‌లో ఆర్జేడీ, బెంగాల్లో టీఎంసీ ఓడిపోయాయి. ఎలక్షన్ కమిషనర్ తీరును అధికారులు ప్రస్తావిస్తూ లబో దీబో మంటున్నారు. ఎలక్షన్ కమిషనర్ తీరుతో ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతోంది. ఎన్నికలు మ్యానిపులేటేడ్ విధంగా జరుగుతున్నాయి. ఎలక్షన్ కమిషనర్ బీజేపీకి తొత్తులా మారారు. మీనాక్షి నటరాజన్ సీటు చోరీ చేశారు. రాహుల్, ఖర్గే నేతృత్వంలో దేశ వ్యాప్తంగా నిరసనలు చేస్తాం అని మహేశ్‌కుమార్ గౌడ్ హెచ్చరించారు.
అంతకుముందు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ నగరంలోని నెక్లెస్‌రోడ్డులో కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో లోపాలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈసీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలతో హోరెత్తించారు. ఈ నిరసనలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, భువనగిరి ఎంపీ చాలమ కిరణ్ కుమార్‌రెడ్డి, దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Romantic OTT | ఓటీటీలోకి అర్జున్ రెడ్డి డైరెక్టర్ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ
సెప్టెంబర్ 28, 2026

Supreme Court on UPI MDR Fee | యూపీఐ లావాదేవీలపై చార్జీలా? ఎవరి లాభం కోసం? కేంద్రం, ఆర్బీఐలను ప్రశ్నించిన సుప్రీంకోర్టు
సెప్టెంబర్ 28, 2026

Rahul Gandhi | ప్రశ్నిస్తే చెంపదెబ్బలు.. నిలదీస్తే లాఠీచార్జీలు.. మంత్రి చెంపదెబ్బ వివాదంపై రాహుల్ విమర్శలు
సెప్టెంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Romantic OTT | ఓటీటీలోకి అర్జున్ రెడ్డి డైరెక్టర్ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ
- ●Supreme Court on UPI MDR Fee | యూపీఐ లావాదేవీలపై చార్జీలా? ఎవరి లాభం కోసం? కేంద్రం, ఆర్బీఐలను ప్రశ్నించిన సుప్రీంకోర్టు
- ●Rahul Gandhi | ప్రశ్నిస్తే చెంపదెబ్బలు.. నిలదీస్తే లాఠీచార్జీలు.. మంత్రి చెంపదెబ్బ వివాదంపై రాహుల్ విమర్శలు
- ●Talasani Srinivas Yadav | కాంగ్రెస్ ప్రభుత్వ హామీలన్నీ మోసపూరిత మైనవే: తలసాని శ్రీనివాస్ యాదవ్
- ●BRS Leaders | సోదాలు చేసి రెండేళ్లవుతోంది.. చర్యలేవి?: ఈడీకి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ప్రశ్న
- ●Nidhi Tiwari Suicide | ఇన్‌స్టాలో లక్షల మంది ఫాలోవర్స్.. ఇన్ఫ్లుయెన్సర్ నిధి తివారీ సూసైడ్: ఆ ఫోన్ సంభాషణ తర్వాతే తీవ్ర నిర్ణయం

Romantic OTT | ఓటీటీలోకి అర్జున్ రెడ్డి డైరెక్టర్ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ

Supreme Court on UPI MDR Fee | యూపీఐ లావాదేవీలపై చార్జీలా? ఎవరి లాభం కోసం? కేంద్రం, ఆర్బీఐలను ప్రశ్నించిన సుప్రీంకోర్టు

Rahul Gandhi | ప్రశ్నిస్తే చెంపదెబ్బలు.. నిలదీస్తే లాఠీచార్జీలు.. మంత్రి చెంపదెబ్బ వివాదంపై రాహుల్ విమర్శలు

Talasani Srinivas Yadav | కాంగ్రెస్ ప్రభుత్వ హామీలన్నీ మోసపూరిత మైనవే: తలసాని శ్రీనివాస్ యాదవ్





